ఎన్నికలంటేనే శిత్రం, యిశిత్రం. ఓటుకు ఓటే బలం. గందుకే గా ఓట్ల కోసం నాయకులు గాలం ఏత్తరు. గా గాలమే గీ పైసలు, శీరెలు, శారెలు, మందు, మాకులు. బీర్లు, బిర్యానీ ఇంకా ఏదైనా కావచ్చు. గయన్నీ ఓటర్లకిత్తరు. ఇగ పమాణం చేయించుకుని ఓట్లేయమంటరు. ఇగాయింత గెల్సినంక గవాల్లు మన మొకమే సూడరు. ఇగంతకంతకు సంపాయించుకుంటరు. గదంత మనకెందుకని, మనం గాయింత గవాల్లిచ్చినయి తీసుకుంటం, అన్నీ మర్సిపోతం. కనీ, గా ఇచ్చినోనికి అన్నీ గుర్తుంటయి. ఇగ ఓడినోనికి మరింత బాధ పెడ్తయి. గట్ల గా గెల్సినాయినె ఏం శేసిండో సూడుండ్రి.

గీ మద్దెల ఆంధ్రప్రదేస్ ల పంచాయతీ అయినయి. కడప జిల్ల రాజంపేట మండలం శేషమాంబపురం పంచాయతీ సర్పంచిగా రమాదేవి ఎన్నికయిండ్రు. ఇగామె మామ లెక్కలేసిండు. గా పంచాయతీ ఎన్నికల్ల పంచినయెన్ని? వచ్చినయెన్ని? పోయినయెన్ని? సూసిండు. గా పంచాయతీ పరిధిల ఉన్న తమ సొంత ఊరు పాపరాజు పల్లె రాములోరి గుడి అరుగుల మీద కూసున్నడు. తమకు ఓట్లేయకుంటేమాయె గనీ, గా ఎదురుంగ నిలబడ్డోల్లకు ఓట్లేసిండ్రని తిట్ల దండకం మొదలు పెట్టిండు. ఇగా దెబ్బకు దయ్యం వదిలినట్టు, ఇగాయినె దగ్గర తీసుకున్న శీరెలు, పైసలను తిరిగిచ్చిండ్రు. ఇగా ముచ్చటను ఒకలు యీడియ తీసి నెట్టింట్ల పెట్టిండ్రు. ఇగది మస్తు వైరలైతాంది.

