Sunday, November 22, 2026
30.2 C
Hyderabad

ప్రజాపాలన పట్టు తప్పుతోందా?|CONGRESS|TELANGANA|CM|REVANTH REDDY

-అడుగు ప్రత్యేకం

పార్టీ తప్పటడుగులతో తడబడుతోందా?
కాంగ్రెస్ లో ఎందుకీ కస్సు బుస్సులు!
సీఎం వర్సెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు
వాళ్ళపై సిద్ధిపేటలో సీఎం సీరియస్
కాంగ్రెస్ లో వివాద వ్యాఖ్యల కలకలం
వాళ్ళ వ్యాఖ్యలు సరే, మరి చర్యలేవి?
వారి సామాజికవర్గాలే సమస్యా?
సురేఖకు అలా! వీళ్ళకెందుకిలా?
కాంగ్రెస్ లో క్రమ‘శిక్ష’ణ కరువు

ఆ కొందరి బాధా? అందరి వ్యథా?

ప్రజాపాలన పట్టుతప్పుతోందా? పార్టీ నాయకత్వం తడబడుతోందా? మునుగోడు, జడ్చర్ల ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిల వ్యాఖ్యలు, నేరుగా సీఎంపై వాగ్బాణాలు. ఆ ఇద్దరిపై పార్టీ ఆలోచిస్తోందన్న టీపీసీసీ అధ్యక్షుడు, మా వాళ్లు ఎర్రి కుక్కలు కరిసినట్లు మాట్లాడుతున్నారని సీఎం సీరియస్. ఈలోగా, ‘ఇలాగైతే కాంగ్రెస్ మరోసారి పవర్ లోకి రాలేదని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించినట్లుగా చక్కర్లు కొడుతున్న వార్తలు, నేనే మరోసారి సీఎంనని సీఎం పదే పదే చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో అంతర్గతంగా ఏం జరుగుతోంది? ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీకి, సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? అసలు ప్రభుత్వంలో, పార్టీలో ఏం జరుగుతోంది!?

తెలంగాణ అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని, ప్రభుత్వ పనితీరును సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తుండటం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వరుస, పరుశ వ్యాఖ్యలు సీఎంకి, పార్టీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ అసమ్మతి స్వరాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ మాట్లాడుతూ, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోందని, తగిన సమయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈలోగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కలర్లు కొడుతున్నాయి.

ప్రజా పాలన గాడి తప్పిందా?
ఈ వివాదాలకి ప్రధాన కారణం ప్రభుత్వ పనితీరు, నిధుల కేటాయింపులు, అధికారుల తీరుపై ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నిధుల పంపిణీలో వివక్ష ఉందని ఆరోపిస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ తోపాటు మంత్రుల సొంత నియోజకవర్గాలకే నిధులు విడుదలవుతున్నాయని, మిగతా నియోజకవర్గాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శిస్తున్నారు.
మరోవైపు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రభుత్వ అధికారుల అవినీతిని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు 10% నుంచి 20% వరకు కమీషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. రూ.5 లక్షల సీసీ రోడ్డు బిల్లులకు కూడా కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని, రూ.15 వేల లంచంతో ఒక అధికారికి సంబంధించిన పని పూర్తయిందని ఉదాహరణలు ప్రస్తావించారు. బిల్లులు విడుదల చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. తాను చస్తేనే బిల్లులు వస్తాయంటే ఆత్మార్పణకు కూడా సిద్ధమేనని తీవ్రంగా స్పందించారు.

పదవులు దక్కకపోవడమే కారణమా?
ఆసక్తికరంగా రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్‌నేత ఆరోపించారు. అనిరుధ్‌రెడ్డి మాత్రం ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపడం, పార్టీ ప్రయోజనాల కోసమేనని సమర్థించుకుంటున్నారు.

సీఎం సీరియస్!
ఈ పరిణామాలపై నవంబర్ 19న సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. పేరు ప్రస్తావించకుండానే కొందరు సొంత పార్టీ నాయకులు ‘ఎర్రి కుక్కలు కరిసినట్లు’ మాట్లాడుతున్నారని, మంచిని చెవిలో, చెడును మైకుల్లో చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలే అలాంటి వారిని ఎర్రగడ్డకు పంపాలన్నారు. ఈ వ్యాఖ్యలు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను ఉద్దేశించినవేనని వేరే చెప్పక్కర లేదు. సీఎం వ్యాఖ్యలపై రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ, ‘అధికారంలో ఉన్నవారు హుందాగా మాట్లాడాలని, అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలని’ సవాల్ విసిరారు.

సురేఖకు అలా? మరి వీళ్ళకెందుకిలా?
ఇక్కడే కొండా సురేఖ ఉదంతం ప్రస్తావనకు వస్తోంది. సురేఖ కూతురు సీఎం, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ చర్యలను సిఫారసు చేసింది. దీంతో 2026 సెప్టెంబర్ 3న ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాచారు. అదే సమయంలో వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో వివాదం కారణంగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డిని కూడా తొలగించారు. అలాంటప్పుడు ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు లేవన్న ప్రశ్న పార్టీలో వినిపిస్తోంది. సామాజిక వర్గాల సమీకరణలు కూడా ప్రస్థావనకు వస్తున్నాయి. సురేఖ కంటే ముందు నుంచి కూడా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎంను, ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తూనే ఉన్నారు. సురేఖ బర్తరఫ్ సమయంలోనూ వారి ప్రవర్తనలు చర్చకు వచ్చాయి. కానీ చర్యలే లేవని మిగతా సామాజిక వర్గాల ప్రశ్న.

ఇ ఇద్దరి బాధా? అందరి వ్యథా?
అయితే, ఆ ఇద్దరి నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు, భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలు, సీనియర్ నాయకులతో ఉన్న సంబంధాలు అధిష్ఠానం నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయా? లేక సామాజిక వర్గ బలమే రక్షణ కవచంగా ఉందా? అన్న చర్చ కూడా జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి మంత్రి. కఠిన చర్యలు తీసుకుంటే అసమ్మతి మరింత పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు చర్యలు లేకపోతే ఇతర నాయకులూ బహిరంగ విమర్శలకు దిగే అవకాశం కూడా ఉంది.

రాజగోపాల్ కు తాఖీదు?
ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై నవంబర్ 11న నివేదిక కోరినట్లు తెలుస్తోంది. నవంబర్ 20 నాటికి టీపీసీసీ చీఫ్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యల వీడియోలను ఢిల్లీకి పంపినట్లు, కొత్త రాష్ట్ర ఇన్‌చార్జి బీఎం సందీప్ కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం. సందీప్ ని కలవాల్సిందిగా రాజగోపాల్ రెడ్డిని అధిష్ఠానం అదేశించినట్లుగా తెలుస్తోంది.

పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా తుమ్మల వ్యాఖ్యలు
మరోవైపు మంత్రి తుమ్మల వ్యాఖ్యానించినట్లుగా వస్తున్న వార్తలు పార్టీలో, ప్రభుత్వంలో మరింతగా కల్లోలోలాన్ని రేపుతున్నాయి. ‘తీవ్ర కరువు తర్వాత ఏ అధికార పార్టీ మళ్లీ గెలిచిన చరిత్ర లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటమి తప్పదని, తాను కూడా పోటీ చేయబోన’ని ఆయన వ్యాఖ్యానించినట్లు ఆ కథనాలు వెల్లడించాయి. ‘గ్రామాల్లో ప్రజలు పెన్షన్ పెంపు హామీ గురించి నిలదీస్తున్నారని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినంతే ఇప్పుడు కూడా ఇస్తున్నారని, 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఓట్లు ప్రభుత్వానికి అవసరం లేదా?’ అని ఆయన ప్రశ్నించారని కూడా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్నది రెండు సవాళ్లు. ఒకటి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు మాట్లాడే హక్కును కాపాడుతూనే, పార్టీ క్రమశిక్షణను అమలు చేయడం. రెండు ఆరోపణలు నిజమైతే విచారణ జరిపి చర్యలు తీసుకోవడం. ఇక విమర్శలు పార్టీ వేదికలపై పరిష్కారమయ్యేలా వ్యవస్థ ఉండాలి. లేదంటే ఈ అంతర్గత పోరు ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారడమే కాకుండా, ప్రభుత్వ ప్రతిష్ఠను, పార్టీ ఐక్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంది.

Latest News

రోజుకు 5యేలు! 7ఏండ్లకు జరిమానా!?|ADUGU TRENDS

మనం బ్యాంకుల్ల బాకీలు తెచ్చుకుంటం. ఏదన్న కుద పెట్టకపోతే గవాల్లు గా బాకీలియ్యరు. గట్ల బాకీ తీర్సినంక కుద పెట్టిన పేపర్లియ్యకపోతే గా అదాలత్ ఏం శేసిందో సూడుండ్రి. ఉత్తరప్రదేశ్ ల అలీగడ్ కు...

ఢిల్లీ సుల్తానులు|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|EDUCATION

ఢిల్లీ సుల్తానులు పాలించిన ప్రాంతాలను ఇస్లాం భాషలో సల్తనత్ అంటారు. సల్తనత్ అనగా రాజ్యము అని అర్థం. రాజ్యాన్ని పాలించిన రాజులను సుల్తానులు అంటారు. కాబట్టి ఈ ఢిల్లీ సుల్తానులకు గల మరో...

భారత్ కు సవాల్ గా పాక్, చైనా వ్యూహాలు!?|EDITORIAL

పాకిస్తాన్ కు చైనా అండదండలు. భారత్‌ను చుట్టుముట్టే వ్యూహాలు! డ్రాగన్ ద్వంద్వ నీతిపై అమెరికా నివేదిక సంచలన వ్యాఖ్యలు. ఆసియాలో మారుతున్న శక్తి సమీకరణాలు భారత్‌కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి! మార్గం - అడుగు,...

వార/ఈ రోజు రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 22 నుండి నవంబర్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి అనుకున్న పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల ద్వారా...

వలెయ్యకుండనే శేతికి లచ్చల శేపలు!?|ADUGU TRENDS

ఎన్కటికి వట్టి శేపల కూర వడిపిల్ల మెతుకులని మస్తు తినేటోల్లు. ఇప్పటికీ శేపలంటే కొందరు శెవులు కోసుకుంటరు. రుశికి రుశి, ఆరోగ్యానికారోగ్యం. గా కౌసుకు, ముండ్లకు భయపడ్తరు గనీ, గాదాన్ని కాదంటే, గా...

నగరానికి గోదావరి జలాలు పరిష్కారమేనా?|EDITORIAL

హైదరాబాద్‌కు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలు అందుబాటులోకి రావడం ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. పైప్‌లైన్ పనులు, ట్రయల్ రన్ విజయవంతమై, నీటి పంపిణీ సమర్థంగా జరగాలి. మరోవైపు వర్షపు...

నవంబర్ 21, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం చిలుకు ద్వాదశి తులసి వివాహం చాతుర్మాస్య వ్రతసమాప్తి తిధి శు ద్వాదశి రాత్రి 01.16 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 03.24 వరకు ఉపరి అశ్విని యోగం సిద్ది రాత్రి 12.55...

ఆకరి సూపు కోసం అవ్వ శవం ఎదురు సూత్తాంది!?|ADUGU TRENDS

తలంత బలగం, తలకు పోసే దిక్కులేకుండా పోయిందనే సామెత గా అవ్వకు బాగా అతికింది. గా తల్లికి ఇద్దరు బిడ్డలు. బంధుగులు కూడా ఉన్నరు. కానీ, గవాల్లంతా గిప్పుడు యాడున్నరో తెలవదు. 40...

రైతులకు, వినియోగదారులకు ‘గిట్టు’బాటేది!?|EDITORIAL

రైతుకు గిట్టుబాటు ధర రావడం, వినియోగదారుడికి సరసమైన ధరకు కూరగాయలు అందడం పరస్పర విరుద్ధమేమీ కావు. మధ్యలోని సరఫరా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దితే, రెండూ సాధ్యమే. రైతు నష్టపోకుండా, వినియోగదారుడికి భారం కాకుండా...

నవంబర్ 20, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 01.54 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 03.29 వరకు ఉపరి రేవతి యోగం వజ్ర రాత్రి 02.33 వరకు ఉపరి సిద్ది కరణం వణజి పగలు 02.01...

పచ్చని సంసారంల చాట్ జీపీటీ చిచ్చు!?|ADUGU TRENDS

దేని మీదనైనా ఆధారపడినా, అలవాటైనా ఇగంతే సంగతులు. అయిన దానికి, కాని దానికి కూడా గాదాని మీదకే పానం గుంజుతది. గట్లనే గా లెక్కలు శేసే కాలుక్ లేటర్, శేతుల్ల పట్టుకునే పోన్లు...

కాలుష్య కాసారంగా భూగోళం!?|EDITORIAL

ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తును కాపాడుకోగలం. భావితరాలకు కాలుష్య భరిత ప్రపంచాన్ని కాకుండా ఆరోగ్యకరమైన భూగోళాన్ని అందించడం నేటి తరంపై ఉన్న చారిత్రక బాధ్యత!? మార్గం - అడుగు, ఎడిటోరియల్  ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి పేరుతో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News