Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

కవిత కొత్త పార్టీ భవిష్యత్తేంటి?|EDITORIAL

కవిత రాజకీయ ప్రయాణం ఒక అవకాశమూ, ఒక పరీక్ష కూడా. ప్రజా సమస్యలను నిజాయితీగా అర్థం చేసుకుని, వాటికి పరిష్కారాలు చూపగలిగితేనే ఈ పార్టీ నిలబడుతుంది. లేని పక్షంలో ఇది కూడా ఇతర పార్టీల మాదిరిగానే మరో ప్రత్యామ్నాయంగా మిగిలిపోతుంది. ప్రజల ఆశలను కార్యరూపంలోకి తీసుకురావడం ఇప్పుడు కొత్త నాయకత్వం చేతుల్లో ఉంది. మరి ఆ పని కవిత చేయగలుగుతుందా? జనసేన ను పోలిన తెలంగాణ రాష్ట్ర సేన ఆ తరహా విజయాన్నందుకుంటుందా? తనయ పెట్టిన రాష్ట్ర సేన కేసీఆర్ కు తన సేనగా నిలుస్తుందా? వేచి చూడాలి!

తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీగా “తెలంగాణ రాష్ట్ర సేన”ను ప్రకటించారు. విధి విధానాలు, లక్ష్యాలను సైతం వెల్లడించారు. ఈ పరిణామం, ప్రస్తుత రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భావం, దాని ఉనికి, అవసరాలు, దాని భవిష్యత్తులతోపాటు, ఒకప్పుడు ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి పరిణామాలను తిరిగి పరిశీలించాల్సిన అవసరాన్ని కూడా ముందుకు తెచ్చింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం పూర్తైంది. 2014లో ఏర్పడిన ఈ రాష్ట్రం ప్రారంభ దశలో భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే వివిధ స్వతంత్ర అధ్యయనాలు, మీడియా నివేదికలు సూచిస్తున్నట్లుగా గ్రామీణ ఉపాధి, లాభదాయక వ్యవసాయం, నిరుద్యోగ నిర్మూలన లేదా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి అంశాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 6–8% మధ్య నమోదైంది. అలాగే రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోలు ఆలస్యం, గిట్టుబాటు ధరల లోపం వంటివి పలుమార్లు రాజకీయ చర్చకు వచ్చాయి.

ఇలాంటి నేపథ్యంలో, కవిత కొత్త పార్టీని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా విశ్లేషించవచ్చు. ఆమె రాజకీయ ప్రస్థానం పూర్తిగా కుటుంబ ఆధారితంగా ప్రారంభమైనప్పటికీ, తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక స్థాయిలో, ముఖ్యంగా బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యం ఆమెకు మహిళా వర్గంలో ఒక గుర్తింపు తెచ్చింది.

అయితే, కొత్త పార్టీ విజయం, కేవలం గత గుర్తింపుతో మాత్రమే సాధ్యం కాదు. రాష్ట్ర జనాభాలో 49% మహిళలు, 50%కు పైగా బడుగు, బలహీన వర్గాలు ఉన్న నేపథ్యంలో, ఈ వర్గాలను రాజకీయ అధికారంలో భాగస్వామ్యం చేయడం కీలకం. స్థానిక సంస్థలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఉన్నప్పటికీ, శాసనసభ, పార్లమెంట్ స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది. ఈ లోటును పూరించేందుకు స్పష్టమైన విధానాలు అవసరం.

ప్రస్తుత రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్‌పై అవినీతి, కుటుంబపాలన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఎన్నికల హామీల అమలు, ఉపాధి కల్పన, వ్యవసాయ రంగ సంస్కరణలు వంటి అంశాల్లో వేగం కనిపించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

జాతీయ స్థాయిలో చూస్తే, భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నించినప్పటికీ, స్పష్టమైన అభివృద్ధి అజెండాతో ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయిందన్న అభిప్రాయం ఉంది. “డబుల్ ఇంజిన్ సర్కార్” అనే నినాదం ఉన్నప్పటికీ, రాష్ట్రానికి ప్రత్యేకంగా కనిపించే ప్రాజెక్టులు, నిధులు తక్కువగానే ఉన్నాయని విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఏర్పాటైన “తెలంగాణ రాష్ట్ర సేన” ముందు పలు సవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. ప్రజా సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరం. రైతులకు గిట్టుబాటు ధరలు, నిరుద్యోగులకు ఉపాధి, పట్టణ పేదలకు గృహాలు వంటి అంశాల్లో అమలు చేయగల విధానాలు అవసరం. అవినీతి రహిత పాలన పారదర్శకత కోసం డిజిటల్ వ్యవస్థలు, సామాజిక ఆడిట్‌లు వంటి చర్యలు కీలకం. సామాజిక న్యాయం అంటే మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలకు నిర్ణయాత్మక స్థాయిలో అవకాశాలు కల్పించడం అవసరం. సంస్థాగత బలం అంటే కేవలం నాయకత్వం కాకుండా గ్రామ స్థాయి వరకు పార్టీ నిర్మాణం చేపట్టాలి. విశ్వసనీయత అంటు మాటలకంటే పనులతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం అతంత ఆవశ్యం.

రాజకీయాల్లో కొత్త పార్టీలు రావడం సాధారణమే. కానీ అవి నిలబడటానికి అవసరమైనది దీర్ఘకాలిక దృష్టి, స్థిరమైన నాయకత్వం, ప్రజలతో నిరంతర సంబంధం. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజలు చూపిన ఐక్యత, నిబద్ధత ఈరోజు కూడా ఒక రాజకీయ శక్తిని నిర్మించగల సామర్థ్యం కలిగి ఉంది.

కవిత ప్రారంభించిన ఈ రాజకీయ ప్రయాణం ఒక అవకాశమూ, ఒక పరీక్ష కూడా. ప్రజల సమస్యలను నిజాయితీగా అర్థం చేసుకుని, వాటికి పరిష్కారాలు చూపగలిగితేనే ఈ పార్టీ నిలబడుతుంది. లేని పక్షంలో ఇది కూడా ఇతర పార్టీల మాదిరిగానే మరో ప్రత్యామ్నాయంగా మిగిలిపోతుంది. తెలంగాణ రాజకీయాల్లో మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆ ఆశలను కార్యరూపంలోకి తీసుకురావడం ఇప్పుడు కొత్త నాయకత్వం చేతుల్లో ఉంది. మరి ఆ పని కవిత చేయగలుగుతుందా? లేక తన తండ్రి స్థాపించిన పార్టీలాగానో లేక ఇతర పార్టీల్లాగే మిగిలిపోతుందా? అయితే, జనసేన ను పోలిన తెలంగాణ రాష్ట్ర సేన జనసేన తరహా విజయాన్నందుకుంటుందా? కేసీఆర్ తనయ పెట్టిన రాష్ట్ర సేన తన సేనగా నిలుస్తుందా? వేచి చూడాలి.

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News