Monday, August 3, 2026
31.5 C
Hyderabad

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ, అమిత్ షా ఎత్తుల ముందు చిత్తవుతోందా? నాయకత్వ లోపమా? సమన్వయ శాపమా? మేధోమథనం లేకపోవడమా? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ కు ఏమైంది? ఇవి ఆ పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ శ్రేణులే సంధిస్తున్న ప్రశ్నలు. ఆ పార్టీ శ్రేణులే సంధిస్తున్న ప్రశ్నలు. అంతర్మథనాలు.

కాంగ్రెస్ వరుస వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలను ఎజెండా చేయడంలో, వాటిపై పోరాటడంలో, అధికార పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆ పార్టీ బాగా వెనుకబడిపోతోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ చేపట్టిన బాధ్యతల్లో ఈ స్పష్టమైన ఫలితాలు కనిపించలేదు. దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై, ప్రభుత్వాల వైఫల్యాలపై, అధికారాన్ని సాక్షాత్కారం చేసే సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన లేదన్న విమర్శలు నిరంతరాయంగా వినిపిస్తునే ఉన్నాయి. మోదీ లాంటి ఉద్ధండ నేతను, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని నిలదీయాలంటే స్పష్టమైన ఎజెండా అవసరం. కానీ రాహుల్‌ చేతిలో అలాంటి దిశా నిర్దేశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. పార్లమెంట్‌లో గడువు లేకుండా రచ్చ చేయడం, నినాదాలతో రాజకీయాలు నడపడం, వంశపారంపర్య నాయకత్వంపై ఆధారపడటం వంటి చర్యలు కాంగ్రెస్‌ను మరింత బలహీన స్థితికి నెడుతున్నాయి.
గత పుష్కరకాల యూపీఏ పాలనలో జరిగిన పొరబాట్లను ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ పాదయాత్రలు చేసినా, రాజ్యాంగ ప్రతిని ఎత్తిచూపినా, ‘సర్’ని ఎత్తుకున్నా, మహా గఠ్ బంధన్ కూటములు కట్టినా పార్టీకి పెద్దగా కలిసిరాలేదు. మేలు జరగలేదు. ప్రధానంగా పార్టీకి కేంద్ర స్థాయిలో నాయకత్వ సంక్షోభం, నిర్ణయాత్మక, స్పష్టమైన రాజకీయ దిశానిర్దేశం లేకపోవడం వల్ల ప్రజల్లో పార్టీపై నమ్మకం తగ్గింది. తీవ్రమైన అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య సమన్వయం లోపించడం, ఎన్నికల వ్యూహాల్లో వైఫల్యాలు వంటివన్నీ పార్టీ ప్రభావాన్ని నీరుగారుస్తున్నాయి. ప్రధానంగా 2014, 2019, 2024 సాధారణ ఎన్నికలలో పార్టీ సాధించిన బలహీన ఫలితాలు, ఆ పార్టీని జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టలేకపోయాయి. అదనంగా, యువ ఓటర్లను ఆకర్షించడంలో విఫలమవడం ఆ పార్టీని మరింత దిగజారుస్తున్నాయి.

కర్నాటకలో సీఎం పదవి విషయంలో సిద్దరామయ్య–డీకే శివకుమార్‌ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో కూడా హైకమాండ్‌ బలహీనంగా మారింది. ఖర్గే అధ్యక్షుడైనా, రాహుల్‌ మార్గనిర్దేశం ఉన్నా స్పష్టమైన నిర్ణయాలను సమర్థంగా తీసుకునే వేగం, ధైర్యం కనిపించడం లేదు. గతంలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తాజాగా బీహార్‌ ఎన్నికల్లోనూ అంతర్గత కలహాలే కాంగ్రెస్‌, కాంగ్రెస్ కూటముల ఓటములకు కారణమయ్యాయి.

పార్టీ కార్యకలాపాలను నాయకత్వం స్వయంగా పర్యవేక్షించడం తగ్గిపోయింది. నిర్ణయాలు విధేయుల చేతుల్లోకి వెళ్లాయి. కేసీ వేణుగోపాల్‌ వంటి నేతల సూచనలతో ముఖ్యమైన పరిణామాలు జరుగుతుండటం, పెద్ద నేతల మధ్య సమస్యలను పరిష్కరించలేకపోవడం పార్టీ నాయకత్వ బలహీనతను బహిర్గతం చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో రాహుల్‌ నిజమైన నాయకుడిగా ఎదగాలనుకుంటే ప్రజా సమస్యలపై దీర్ఘకాల పోరాటం చేయాలి. నినాదాలకంటే విధానాలు, పదవుల కేటాయింపులకంటే నైతిక నిర్ణయాలు ముఖ్యం.
కాంగ్రెస్‌కు మరో అవకాశం దక్కాలంటే ముందుగా పార్టీ అంతర్గత వ్యవస్థను బలపరచాలి. కేంద్రంలో, రాష్ట్రాల్లో పార్టీలోని అంతర్గత విభేదాలను సమర్థంగా సమసేట్లు చేయాలి. ప్రజలతో, ప్రజా సమస్యలతో, ప్రజల భాగస్వామ్యంతో నడిచే రాజకీయాలు చేయాలి. అధికారంలో లేకపోయినా పటిష్టమైన వ్యూహాలతో ముందుకు సాగగలిగితేనే కాంగ్రెస్‌ తిరిగి ప్రజల్లో నమ్మకం పొందగలదు.

కానీ, ఇప్పుడు ఆ పార్టీకి కావాల్సింది, దృఢమైన నాయకత్వం, సమర్థవంతమైన వ్యూహం, ప్రజలతో సన్నిహిత సంబంధాల పరురుద్ధరణ. ప్రస్తుతం కనిపిస్తున్న నాయకత్వ బలహీనతలతో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పునరుద్ధరణ, పూర్వవైభవం దూరమైన స్వప్నంగానే మిగిలిపోతుంది.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News