ఖాకీలంటే కరడుగట్టిన మనసులు. చేతిల లాఠీలు, నోటి నిండా బూతులనే గిప్పటి దాకా మనకు తెలుసు. కానీ, గా బెంగళూరుల పోలీసులు గట్ల కాదని నిరూపించిండ్రు. గదేందో సూద్దాం పదండ్రి.

గా బెంగళూరుల జ్ఞాన భారతి మోట్రో రైలు టేషనుంది. గాడ గా మొన్న గా ట్రాపిక్ పోలీసులు శేతిల తాపీలు, సాపుగ శేసే శెక్కలు పట్టుకొని గా రోడ్డుకు మరమ్మతులు శేసుకుంట కనిపించిండ్రు. గదేందని సూత్తే, గాడ శానా రోజులుగ రోడ్డ బాగ లేదు. పెద్ద గుంటలు, గోయ్యిలతోటి ఉండేది. గాడ గా ట్రాపిక్ డ్యూటీలు శేసుడు మస్తు కట్టమైతాందట. గందుకే కా సిమెంటు, ఇసుకె, కంకర కలిపిన మాల్ ను గా గుంతల్ల పోయించిండ్రు. ఇగ గా పోలీసులే, గాదాన్ని గా గుంటల్ల సాప్ శేసిండ్రు. ఇగ గీ ఈడియ గా నెట్టింట్ల వైరల్ గ మారింది. గదాన్ని సూసి, మస్తు మంది గా పోలీసులను తారీఫ్ శేత్తాండ్రు. మనం కూడా అభినందించాలె మరి.!

