Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

ఆ స్నేహితులను చూసి స్నేహమే సలాం చేసింది!|FRIENDSHIP

పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ కలయిక వాయిదా పడింది. దీంతో ఈసారి కూడా కలుస్తామా! లేదా? అనే అనుమానాల మధ్య ప్రయాణం ముందుకు సాగింది. పాలకుర్తి, బమ్మెర, లక్ష్మీనారాయణ పురం గ్రామాల మిత్రుల చొరవ, పట్టుదల సంకల్పంతో కృషి ఫలించింది.

పదిహేను రోజుల వ్యవధిలోనే కార్యక్రమ ఏర్పాట్లతో ఊహించని రీతిలో కనుల విందుగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 28న పాలకుర్తిలోని భాషరత్ గార్డెన్లో 1999 – 2000 పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. 25 ఏండ్ల తర్వాత ఆత్మీయుల కలయిక అంబరాన్ని అంటింది. ఆనాటి విద్యార్థుల మనసులు నిండుతనంతో పులకించినట్లు పరవశించిపోయాయి. ఒక్కొక్కరి కండ్లల్లో వారి ముఖాల్లో కనిపించిన ఆ చిత్రాల దరువు, ఆనందపు ఛాయలు మాటల్లో చెప్పలేం కదా! ఆపాత మధురాన్ని వర్ణించడం సాధ్యం కావడం లేదు. తొలుత రాజీవ్ చౌరస్తా నుంచి ఉపాధ్యాయ బృందాన్ని భాషరత్ గార్డెన్ వరకు పూల జల్లులతో తీసుకొచ్చి ప్రత్యేకతను చాటారు. కొద్ది మంది మిత్రులు వివిధ కారణాలతో రాలేకపోయినా వారిని మరచిపోలేదు. తమ తమ జ్ఞాపకాల దొంతరల్లో నెమరేసుకున్నారు.

సభ ప్రారంభంలో ఒక్కో గురువును 10 మంది విద్యార్థులు వేదికపైకి తోలుకువచ్చి స్వాగతించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యాబోధన చేసి భౌతికంగా దూరమైన పలువురు ఉపాధ్యాయులకు నిండు మనసుతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మరణించిన తోటి విద్యార్థులను తలుచుకొని తల్లడిల్లారు. తమకు విద్యాబుద్ధులు సెప్పిన ఉపాధ్యాయులను వారి సేవలను, కొన్ని ఘటనలను యాజ్జేసుకున్నారు. వారిని సన్మానించి గౌరవించుకున్నారు. స్టేజీ మీద కొందరు సహచరులు మాట్లాడినప్పటికీ సారాంశం అంతా ఆనాటి స్మృతులను నెమరువేసుకోవడంతోనే సాగింది. సమయం లేక మాట్లాడక పోయినప్పటికీ, ప్రసంగించిన మిత్రుల మాటల్లో వారి తీపి గుర్తులు ప్రతిధ్వనించాయి. ఆనాటి ఉపాధ్యాయుల బోధనను, విలువలను గుర్తు చేసుకొని ఉల్లాసాన్ని, ఆనందాన్ని పొందారు.

ఆనాడు ఈ విద్యార్థుల జీవితాలకు దిశ దశా మార్గ నిర్దేశనం చేసిన ఉపాధ్యాయులు సైతం తమ అనుభవాలను చెబుతూ, పూర్వ విద్యార్థులకు ఉత్తేజాన్ని కలిగించారు. విలువైన సూచనలను అందించారు. అందరూ ప్రయోజకులు కావడం, వివిధ స్థాయిలలో స్థిర పడటాన్ని అభినందించారు. విద్యా, వైద్యం, సంఘటిత, అసంఘటిత, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నిష్ణాతులుగా ఎదిగిన ఆనాటి పూర్వ విద్యార్థులు ఒకచోట సమూహంగా కనిపించారు. స్నేహానికి సరైన నిర్వచనాన్ని అందించిన తీరు అబ్బురపరుస్తుంది. వీరి అపూర్వమైన కలయిక చరిత్రలో తప్పక నిలిచిపోతుంది అనటంలో సందేహం లేదు. అక్కడి సన్నివేశాలు, ఆనందాలతో వేసిన స్టెప్పులు మైమరిపించాయి. అందరిలో ఐక్యత మరోసారి ప్రస్ఫుటమైంది. జిలుకర తిరుమల్, వినయ్ ల పాటలు జీరబోయిన గొంతుతో వినాల్సి వొచ్చింది.
ఒకే చోట అందరూ కూర్చొని వనభోజనాలకెళ్లినట్లుగా సహపంక్తి భోజనాలు చేశారు. వంద మందికి పైగా తరలొచ్చిన స్నేహితులు తమ ఆత్మీయత అనురాగాలను పంచుకున్నారు. మహిళా మిత్రులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొత్తం ఈ సమ్మేళనానికి మహిళలు నిండుతనాన్ని తీసుకువచ్చారు. సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన మిత్రులు తరలి రావడం స్నేహితుల పట్ల వారికి ఉన్న గౌరవానికి, ఆప్యాయతకు సూచిక. మనసులో మలినం లేని స్వచ్ఛత కలిసిన ఆ స్నేహాన్ని చూసి, ఆనాటి బాల్య మిత్రులకు స్నేహమే సలాం చేసింది!

-మామిండ్ల రమేష్ రాజా
సెల్ : 78932 30218

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News