Wednesday, September 9, 2026
31.8 C
Hyderabad

POK|పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలి

RSS|ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ MOHAN BHAGAVAT|మోహన్‌ భగవత్‌ పిలుపు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సత్నాలో జరిగిన సింధీ క్యాంప్‌ గురుద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్సంఘ్‌చాలక్‌ మోహన్‌ భగవత్‌ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో జరుగుతున్న ప్రజా తిరుగుబాట్లు, ఉద్రిక్తతల నేపథ్యంలో భగవత్‌ మాట్లాడుతూ, పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. భారతదేశాన్ని ఒక ఇల్లుతో పోల్చిన ఆయన, ఆ ఇంటిలోని ఒక గది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌గా ఉందని, దానిని ఎవరో ఆక్రమిస్తే నిశ్శబ్దంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఇంటి గదిని తిరిగి స్వాధీనం చేసుకోవడం మన కర్తవ్యమని, భారతదేశం అవిభక్త భారతదేశం కావాలని గుర్తుచేశారు.

భగవత్‌ మాట్లాడుతూ, భారతదేశం అనే ఇల్లు మొత్తం ఒకటే. మన ఇంట్లోని ఒక గది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ రూపంలో ఆక్రమించబడింది. దాన్ని మనం తిరిగి పొందాలి. ఇది రాజకీయ విషయం కాదు, మన ఆత్మగౌరవం, జాతి ఏకత్వం అంశం. అవిభక్త భారతదేశాన్ని తిరిగి నిర్మించాలనే దిశగా అందరం కృషి చేయాలి అని అన్నారు. సభలో ఆయన వ్యాఖ్యలకు హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

ఇక భగవత్‌ మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ, మనమంతా ఒకటే. మతం, భాష, ప్రాంతం వేరు అయినా మన మూలం ఒకటే. మనమంతా హిందువులమే. సింధీ సోదరులను చూసి ఆనందంగా ఉంది. వారు పాకిస్తాన్‌కు వెళ్లలేదు, అవిభక్త భారతదేశంలోని ఒక ప్రాంతానికి వెళ్లారు. పరిస్థితులు వారిని వేరుచేశాయి కానీ ఆ ఇల్లూ, ఈ ఇల్లూ వేరు కావు” అని అన్నారు. ఇంటి ఒక గదిని ఎవరో బలవంతంగా ఆక్రమించుకున్నారు. కానీ అది మనదే కాబట్టి, మనం దానిని తిరిగి తీసుకోవాల్సిందే అని ఆయన పిలుపునిచ్చారు.

ఇక పీఓకేలో ఇటీవల హింసాత్మక నిరసనలు చెలరేగాయి. పాక్‌ ప్రభుత్వం, సైన్యం చేస్తున్న అణచివేత చర్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 12 మంది మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భగవత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పాకిస్తాన్‌ పాలనలో ఉన్న పీఓకే ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. జమ్మూ కశ్మీర్‌ జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తోంది. నిరసనలను అణచివేయడానికి ప్రయత్నించిన పాక్‌ ప్రభుత్వం చివరకు ఆ కమిటీతో చర్చలు జరిపి 25 అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. హింసలో మరణించిన వారికి పరిహారం ఇవ్వడంతో పాటు, ముజఫరాబాద్‌, పూంచ్‌ డివిజన్లలో అదనంగా రెండు ఇంటర్మీడియట్‌, సెకండరీ విద్యా బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు పాకిస్తాన్‌ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్‌ ఫజల్‌ చౌదరి వెల్లడించారు.

పీఓకేలో పెరుగుతున్న అసంతృప్తి, ప్రజల్లో ఆగ్రహం నేపథ్యంలో మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఆయన పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిలుపునివ్వడం, భారతీయ ఏకత్వం పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. దేశ సార్వభౌమ్యానికి భగవత్‌ వ్యాఖ్యలు నూతన ఉత్సాహాన్ని నింపాయని, భారత జాతి ఐక్యతకు ఇది ప్రేరణగా నిలుస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Latest News

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News