హనుమకొండ పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో మహిళలను ఇబ్బందిపెట్టే ఆకతాయిల క్రీడలను గుర్తించిన షీ టీం బృందం నేడు సాయంత్రం ప్రత్యేక రెక్కీ నిర్వహించి 20 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ సందర్భంగా బృందం వారి దురుసు ప్రవర్తనపై ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించింది. షీ టీం ఇన్స్పెక్టర్ సుజాత మాట్లాడుతూ, మహిళల భద్రతే తమ ముఖ్య లక్ష్యమని, ఎలాంటి సమయంలోనైనా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో కానీ, ఇతర ప్రదేశాల్లో కానీ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించబోమని, షీ టీం ప్రతిసారీ న్యాయం జరిగేలా చూస్తుందని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు మహిళలపై జరుగుతున్న దాడుల గురించి షీ టీం సహాయ నంబర్లకు (8712685257, 8712685142, 8712685270) సమాచారం అందించాలని సూచించారు.
ఈ దాడిలో ఎస్‌ఐ కంచి విద్యాసాగర్, హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, భాస్కర్, యాదగిరి, కానిస్టేబుల్స్ వంశీకృష్ణ, రాంరెడ్డి, మహిళా కానిస్టేబుల్స్ పూర్ణ, సువార్త తదితరులు పాల్గొన్నారు.


