Wednesday, September 9, 2026
31.8 C
Hyderabad

రాష్ట్రంలో సంతాన సాఫల్య సేవల విస్తరణ -శాసన మండలి క్వశన్ హవర్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

మన రాష్ట్రంలో సంతానలేమి సమస్య తీవ్రంగా ఉంది. తాజా అధ్యయనాల ప్రకారం రాష్ట్రంలో 26 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. సంతానం కోసం ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు. మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. అందువల్ల సంతాన సాఫల్య సేవలను విస్తరిస్తామని శాసన మండలి క్వశన్ హవర్‌లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

రాష్ట్రంలో 358 ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. ప్రభుత్వ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు, ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని 2017లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. గాంధీ, పేట్లబుర్జు, వరంగల్ ఎంజీఎంలో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు జీవో 520 విడుదల చేశారు. కానీ, సెంటర్ల ఏర్పాటు జరగలేదు. 2023 ఫిబ్రవరిలో మరోసారి జీవో విడుదల చేశారు. డాక్టర్లు, రీఏజెంట్స్, డ్రగ్స్, లేకుండానే 2023 అక్టోబర్‌లో గాంధీలో ఓ సెంటర్ ప్రారాంభించారని మంత్రి వివరించారు.

అవసరమైన డాక్టర్లు, మందులు లేకపోవడం వల్ల ఒక్కరికి కూడా ఐవీఎఫ్ చేయలేదు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ హాస్పిటల్‌లోని ఐవీఎఫ్ సెంటర్‌‌లో ఎంబ్రయాలజిస్ట్‌, గైనకాలజిస్ట్, ఇతర డాక్టర్లను నియమించాం. అవసరమైన అన్ని రీఏజెంట్స్, మెడిసిన్స్ పంపిణీ చేశాం. ఏఆర్టీ యాక్ట్ ప్రకారం అనుమతులు తీసుకొచ్చి, అక్టోబర్ 15వ తేదీన గాంధీలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. పేట్లబుర్జు హాస్పిటల్‌లోనూ ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించాం. అవసరమైన రీఏజెంట్స్‌ అందజేసి, అక్కడకూడా ఐవీఎఫ్ సేవలను ఈ నెల 9 నుంచి  అందుబాటులోకి తీసుకొచ్చినమని మంత్రి తెలిపారు. అలాగే ఫాలిక్యులర్ స్టడీ, ఐయూఐ, ఐవీఎఫ్ వంటి అన్ని సేవలు అందిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్ర రెండవ రాజధాని అయిన వరంగల్‌ ఎంజీఎంలోనూ ఐవీఎఫ్ సెంటర్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నాం అన్నారు. హైదరాబాద్‌లో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు.

Latest News

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News