Wednesday, September 23, 2026
26 C
Hyderabad

జీవ వైవిధ్య ఆత్మ ఆరావాళిని రక్షిద్దాం!|EDITORIALS

ప్రకృతి మనకేకాదు, మొత్తం ప్రాణ కోటికి జీవాధారం. గాలి, నీరు, నేల, అడవులు అన్నీ సమతుల్యంగా ఉంటేనే మనుగడ సాధ్యమవుతుంది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నిర్లక్ష్యం చేయడం, దోపిడీ చేయడం, నాశనం చేయడం వల్ల పర్యావరణ విధ్వంసం వేగంగా పెరుగుతోంది. వాతావరణ మార్పులు, నీటి కొరత, జీవ వైవిధ్య నష్టం వంటి సమస్యలు విలయ తాండవం చేస్తాయి. ఈ సమస్య ఇప్పుడు భవిష్యత్తు కాదు, ప్రస్తుతమే. ఈ పరిస్థితికి ప్రత్యక్ష ఉదాహరణ భారతదేశంలోని ఆరావళి పర్వత శ్రేణులు.

ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణుల శ్రేణికి చెందినవి ఆరావళి పర్వతాలు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వీటి వయస్సు దాదాపు 150 కోట్ల నుంచి 250 కోట్ల సంవత్సరాలు. గుజరాత్ నుంచి రాజస్థాన్ మీదుగా హర్యానా, ఢిల్లీ వరకు 800 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. ఈ పర్వతాలు ఆప్రాతాన్ని ఎడారులు కాకుండా అడ్డుకోవడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను అడుగంటకుండా చేయడం సహా మొత్తం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలకంగా ఉన్నాయి.
కానీ నేడు ఆరావళి తీవ్ర సంక్షోభంలో ఉంది. గత కొన్ని దశాబ్దాల్లో విచక్షణ రహితంగా అక్రమ గనుల తవ్వకం, అడవులు నరకడం, పట్టణీకరణ వల్ల ఈ పర్వత శ్రేణులు వేగంగా క్షీణిస్తున్నాయి. అధికారిక నివేదికల ప్రకారం, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో ఆరావళి అటవీ విస్తీర్ణంలో 30 నుంచి 40 శాతం వరకు తరిగిపోయాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆరావళికి చెందిన సహజ కొండలలో 25 శాతం కంటే ఎక్కువగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయని సూచిస్తున్నాయి.

ఈ విధ్వంసం ప్రభావాలు తీవ్రంగా ఉన్నాయి. ఆరావళి క్షీణత వల్ల పశ్చిమ రాజస్థాన్‌ ఎడారీగా మారుతోంది. ఒక అంచనా ప్రకారం, ఆరావళి బలహీనత కారణంగా థార్ ఎడారి ప్రతి సంవత్సరం తూర్పు దిశగా అర కిలోమీటర్ నుండి ఒక కిలోమీటర్ వరకు విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఈ పర్వతాలు వర్షపు నీటిని నేలలోకి చొప్పించడంలో కీలకమైనవి. అవి దెబ్బతింటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. భూమిలో నీటి మట్టాలు పడిపోతాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూగర్భ జల మట్టాలు కొన్ని చోట్ల ప్రతి ఏడాది ఒక మీటరు కంటే ఎక్కువగా పడిపోవడం దీనికి నిదర్శనం.

జీవ వైవిధ్య పరిరక్షణ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు చిరుతలు, నీలగాయిలు, నక్కలు, అనేక పక్షి జాతులతో కళకళలాడిన ఆరావళి అరణ్యాలు ఇప్పుడు కాంక్రీట్ నిర్మాణాలు, రహదారులు, గనుల గోతులతో నిండిపోయాయి. భారతదేశంలో నమోదైన సుమారు 45వేల వృక్ష జాతుల్లో అనేక అరుదైన మొక్కలు ఆరావళికి ప్రత్యేకమైనవి. వాటి నివాసం నశిస్తే జాతుల అంతరించిపోవడం తప్పదు.

ఈ పరిస్థితి మనకు ఒక స్పష్టమైన సందేశాన్నిస్తోంది. ప్రకృతిని ధ్వంసం చేస్తూ అభివృద్ధి సాధించలేం. తక్షణ లాభాల కోసం పర్వతాలను పేల్చడం, పచ్చని అరణ్యాలను పిచ్చిగా నరకడం చివరికి మన మనుగడకే ముప్పు. ఆరావళి పరిరక్షణ కోసం అక్రమ గనులను కఠినంగా నియంత్రించడం, తిరిగి అడవులను పెంచడం, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పాలక వర్గాలు, ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్థిరమైన అభివృద్ధి నమూనాలు అమలు చేయడం అత్యవసరం.

ప్రకృతి మనకు మాత్రమే వారసత్వం కాదు. అది భవిష్యత్ తరాలకు అందించాల్సిన వారసత్వ సంపద కూడా. దాన్ని బాధ్యతగా అందించాల్సిన సమయం ఇది. ఆరావళి పర్వతాల రక్షణ అంటే కేవలం ఒక పర్వత శ్రేణి రక్షణ కాదు. అది మన నీరు, గాలి, వాతావరణం, మొత్తం ప్రకృతి, జీవన భద్రతను కాపాడుకోవడమే. ఇప్పుడు మేల్కొనకపోతే, రేపు పశ్చాత్తాప పడటానికి కూడా మనం మిగలం.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News