రాఖీలను తోడబుట్టినోల్లకే కాదుల్లా. సోదర భావంతోటి ఎవ్వలకైనా కట్టొచ్చు. గట్లనే ఓ బడి పిల్ల, ఎవ్వలూ లేక వాడవాడలకు తిరిగే ఓ అనాథకు రాఖీ కట్టింది. తనలోని మానవత్వాన్ని సాటుకుంది.

యేడ జరిగిందో గనీ, గీ ఈడియ నెట్టింట్ల వైరలైతాంది. గీ ఈడియల ఓ బడిలో సదువుకునే అమ్మాయి, ఓ అనాథను పిలిచి రాఖీ కట్టింది. గా అనాథ గామె కాల్లు మొక్కిండు. ఐటెంక తన సంచిల నుంచి ఏదో ఓ వస్తువును తీసి గామెకిచ్చిండు. గదాన్ని పట్టుకుని ఇద్దరూ గట్టిగ ఏదో నినాదాలిచ్చిండ్రు. గీ ముచ్చట మీద అంతా స్పందిస్తాండ్రు. మానవతను పెంచే గీ ఈడియను బాగా సూత్తాండ్రు.

