ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం శేత్తం? మట్టి, ఇసికె నింపుతం. కనీ, గీ అన్న మరో ఇకమతు శేసిండు. మీరే సూడుండ్రి.

ఇంటి కట్టడానికి పునాదులు తీసిండు. బేస్మేట్ కట్టిండు. ఇగ గండ్ల రాల్లు నింపిండు. గా రాల్లల్ల మీదికెల్లి ఇసికె సిమిటికి కలిపి పోసిండు. దిమ్మిస కొట్టిండు. ఇగ బరింతి గట్టిగైంది. గిట్ల శేస్తే, గా ఐటెంట యేసే బండలు దస్కవు. ఇల్లైనంక పందికొక్కులు, ఎలుకలు, సుందెలుకలు తోడవన్నట్లు. ఇగ గిసొంటి సమస్యలకు శాశ్వత పరిష్కారమన్నట్లు. ఎట్లుంది గీ ఇకమతు?

