Thursday, September 17, 2026
27.7 C
Hyderabad

ఈ వరుస ఎన్నికల వరస మారాలి!|EDITORIAL

ఎన్నికలంటే రాజకీయ పార్టీలకే కాదు, ఓటర్లకు కూడా పండగగా మారింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదైనా, అది నేడు డబ్బుతో ముడిపడిపోవడం ఆందోళనకరం. తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఎన్నికలు ఖజానాపై భారీ భారం మోపుతుండగా, ఆ భారాన్ని చివరికి ప్రజలే పన్నుల రూపంలో భరిస్తున్నారు.

తెలంగాణలో పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి ఉంటే ప్రభుత్వ ఖర్చు గణనీయంగా తగ్గేది. ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయం, భద్రత, సిబ్బంది, పరిపాలనా యంత్రాంగం శ్రమ తగ్గేది. కానీ రాజకీయ లెక్కలు వేరేలా ఉన్నాయి. అధికార పార్టీలకు విడతలుగా ఎన్నికలు జరగడం అనుకూలంగా కనిపిస్తోంది.‘జమిలి ఎన్నికలు’ జరిగితే ప్రజల మనోభావాలు ఒక్కసారిగా ప్రతిబింబిస్తాయి. ఫలితాలు అనుకూలంగా రాకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం అధికార పార్టీలకు ఉంటుంది. అందుకే విడతలుగా ఎన్నికలు జరుపుతూ, ఓటర్ల మనోగతాలను తమకనుకూలంగా మలుచుకుంటూ, పరిస్థితులను చక్కబెట్టుకోవడమే మెరుగని భావిస్తున్నారు.

ఇటీవల తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత మార్చిలో జడ్పీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా విడతలుగా ఎన్నికలు జరగడం వల్ల ఖజానా గుల్లవుతున్నా, రాజకీయ పార్టీలకు ప్రత్యక్ష నష్టం ఏమీ లేదు. ఆ భారమంతా చివరికి ప్రజలపైనే పడుతుంది. ఎన్నికల ఖర్చు ప్రభుత్వ ఖర్చుగానే కనిపించినా, అది ప్రజల పన్నుల నుంచే వస్తుందన్న సత్యాన్ని మనం మరిచిపోతున్నాం.

రాష్ట్రంలో మున్సిపల్ రిజర్వేషన్ల జాబితా ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరిలో ఈ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. దీంతో ఏ క్షణంలోనైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

రిజర్వేషన్లు ఖరారు కావడంతో పట్టణాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటివరకు ఏ వార్డు ఎవరికీ రిజర్వ్ అవుతుందోనన్న టెన్షన్‌తో ఉన్న ఆశావహులు ఇప్పుడు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధాన రాజకీయ పార్టీలు ‘గెలుపు గుర్రాల’పై దృష్టి సారించాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ పార్టీలు ఇప్పటికే ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల బాధ్యతను సంబంధిత మంత్రులకు అప్పగించింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జిగా నియమిస్తూ, మున్సిపల్–కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.

ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరగనున్నందున అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ ముగిసే వరకూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చిన్న పొరపాటు కూడా గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అన్ని పార్టీలు ఎలాంటి లోపాలు లేకుండా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే ఈ రాజకీయ హడావుడిలో ఒక చేదు నిజం మరుగున పడుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ పార్టీలు గెలుస్తున్నాయి. కానీ ప్రజలు ఓడిపోతున్నారు. డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో కొందరు ఓటర్లు డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదని, కొందరు అభ్యర్థులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను నిలదీసిన సంఘటనలు ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి నిదర్శనం. ఇలాంటి సంస్కృతి కొనసాగితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది? నిజాయితీగల నాయకత్వం ఎలా వస్తుంది?

ఈ వరుస ఎన్నికలు ఖజానాపై భారం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలకు కూడా సవాల్‌గా మారుతున్నాయి. ఎన్నికల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఖర్చు, రాజకీయ స్వార్థం, ఓటర్ల ప్రలోభాలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఎన్నికల విధానంలో సంస్కరణలు అవసరం. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల ఖర్చును నియంత్రించడం, ఓటర్లలో చైతన్యం పెంపొందించడం అత్యవసరం. ఎన్నికల పండగలో రాజకీయ పార్టీలు లబ్దిపొందుతూంటే, ప్రజలు మాత్రం ఎప్పటికీ నష్టపోతూనే ఉన్నారు.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News