Thursday, September 17, 2026
25.5 C
Hyderabad

‘కవిత|KAVITHA KALVAKUNTLA కథ’కి స్క్రీన్ ప్లే|SCREEN PLAY, డైరెక్షన్|DIRECTION ఎవరు?

BRS|బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది?
‘టీ|TEA’ కప్పు|CUPలో తుఫానా?
LETTER|లేఖ ‘లీకు|LEAK’ వీరులెవరు?
కవిత పార్టీ|PARTY పెడతారా?
KCR|కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా?

రాజకీయాల్లో నిరంతరం చర్చల్లో ఉండాలి. ఆ చర్చ మన చుట్టూనే జరగాలి. మనల్ని గురించే ప్రజలు చర్చించుకోవాల్సిన అగత్యం సృష్టించాలి. లేకపోతే ఆ పరిస్థితులను కల్పించాలి.

ప్రజలకు యాది ఎక్కువే మరుపు ఎక్కువే. ఒక పెద్ద ఇష్యూ వస్తే, చిన్న ఇష్యూని మరచిపోతారు. మంచా చెడా అన్నది కాదు ప్రజల మనోఫలకంపై మనం అలా తచ్చాడుతూ ఉండాలి. అంటే ఏం చేయాలి?

రాజకీయాల్లో ఆరితేరిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బాగా తెలుసు. అది ఆయనకు రాజకీయంతోపాటే నేర్చిన విద్య. ఉద్యమ సమయంలోనూ ఈ ట్రిక్ ని బాగా వాడారాయన. ఎదుటి పార్టీల్లోనూ, శత్రు శిబిరాల్లోనూ తన మనుషులే ఉండే విధంగా చూసుకుంటారు. ఆ విధంగా తన పార్టీనే కాదు. తనకు వ్యతిరేక పార్టీలను కూడా తానే నడిపేంత రాజకీయ నేర్పరి. అంతెందుకు టీఆర్ఎస్ @ బీఆర్ఎస్ పార్టీ చరిత్రను పరిశీలిస్తే, పార్టీలో ఏనాడైనా ధిక్కార ధోరణిని చూశారా? అలా ఆలోచిస్తున్నారన్నది తెలుసుకుని, అలాంటి వారెందరినో కారణాలు చూపో, లేకుండానో నిర్దాక్షిణ్యంగా తరమేసిన సంగతులెన్నో కనిపిస్తాయి. పార్టీయే కుటుంబం, కుటుంబమే పార్టీ అయిన అలాంటి నాయకుడు తన కుటుంబంలోనే వ్యతిరేకతను, తిరుగుబాటును సహిస్తారా? రానిస్తారా? అంత దాకా పోనిస్తారా? చూస్తూ ఊరుకుంటారా?

కేసీఆర్ పార్టీ సుప్రీం. కేసీఆర్ కొడుకే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన మేనల్లుడే పార్టీలో ట్రబుల్ షూటర్, తోడల్లుడి కొడుకే అనునిత్యం అంటిపెట్టుకునే అత్యంత సన్నిహితుడు. మిగతా అంతా పార్టీ నాయకులు, కార్యకర్తలే కదా!? ఇప్పుడు కన్న బిడ్డ ఏకాకి ఎలా అవుతుంది? ఎప్పటికీ కాదు. కానీ, కవిత రాసిన లేఖ, ఆతర్వాత ఆ లేఖ లీకేజీ వ్యవహారం అలా అనిపించేలా చేస్తోంది. అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ స్మార్ట్ సెల్ ఫోన్ల యుగంలో కన్నబిడ్డ తండ్రికి లేఖ రాయడం? నిజంగానే అంత దూరం తండ్రీ బిడ్డలకు ఉందా? ఉంటే ఇంతకాలంగా నిప్పు ఉప్పు కూడా ఎవరికీ అందకుండా మంటలెలా లేచాయి? దూరం ఉండి ఉంటే అసలు లేఖ ఎందుకు రాస్తుంది? రాసిన లేఖ, కేసీఆర్ ఉండే శత్రు దుర్బేధ్యమైన సువిశాలమైన ఎర్రవెల్లి కోటలో లీక్ అయ్యే పరిస్థితులు ఉంటాయా? లీక్ అయిందే అనుకుందాం. ఆ లీక్ చేయగలిగే పరిస్థితులే లేనప్పుడు లీక్ చేయగలిగిన వ్యక్తులు ఎవరై ఉంటారు? ఆయన చుట్టూ ఉండే వాళ్ళే కదా? ఆయన చుట్టూ ఉన్నది ఎవరు? పార్టీ నేతలా? కార్యకర్తలా? కుటుంబ సభ్యులా? కుటుంబ సభ్యులు మాత్రమే. అయితే ఆ అవసరం ఎవరికి ఉంది? కేటీఆర్ మాట్లాడుతూ లేఖ రాస్తే తప్పు లేదు. మామూలే అన్నారు. యథావిధిగా మా పార్టీలోనూ రేవంత్ కోవర్టులు ఉండవచ్చన్నారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని బట్టి ఉంటే గింటే బీఆర్ఎస్ పార్టీలో రేవంత్ కోవర్టులు ఉండవచ్చు. కానీ, కేసీఆర్ కుటుంబంలో కాదు కదా? అసలు లేఖలో ఉన్నదేంటి? వరంగల్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ సమీక్ష. ఆ సభ సక్సెసా? ఫేయిలా? పక్కన పెడితే, అది పెద్ద ఇష్యూయే కాదు. దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోంది?|KAVITHA KALVAKUNTLA|SCREEN PLAY|DIRECTION|BRS|TEA|CUP|LETTER|LEAK|PARTY|KCR

పార్టీలో ఆధిపత్యం పోరు సాగుతోందని, అన్నా చెల్లెళ్ళకు పడటం లేదని, కవిత పార్టీ పెడుతుందని, పెడితే అది తెలంగాణ జాగృతి పార్టేయేనని, ఆల్ రెడీ ఇంట్లో ఆమె తన కుటుంబ సభ్యులతో చర్చిస్తోందని, బిడ్డ తండ్రి పిలుపు కోసం వేచి చూస్తోందని, తండ్రి ఇదంతా గమనిస్తున్నాడని, వైఎస్ ఫ్యామిలీతో పోలిక, పీలికలు, పేలికలు, బీఆర్ఎస్ పనైపోయిందన్న వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, వివిధ పార్టీల ప్రతిస్పందనలు ఇదంతా కొనసాగుతున్న తీరు చూస్తే, కేసీఆర్ అనుకున్నదే జరుగుతోందన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. బహుషా కేసీఆర్ అందుకే మౌనం వహించి ఉంటారు? కవిత లేఖ లీకే వ్యూహం. అంతకు మించిన వ్యూహాలేమీ ఇందులో లేవు. ఉండే ఆస్కారమే లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ కి లేదా జనం చూస్తున్న సినిమాకి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు? అన్నది ఆ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి వ్యూహాలు కేసీఆర్ కి కొత్తమీ కాదు. అంతెందుకు పార్టీల లోపాలు, జనం, మీడియా వీక్ నెస్ లు, సెన్సేషన్లు, సెన్సేలేని పుకార్లు, సోషల్ మీడియా షికార్లు అన్నీ కేసీఆర్ కి బాగా తెలుసు. డౌటే లేదు. అందుకే అలవాటులో అలవాటుగా అలా లేఖ ‘లీక్’ ఇచ్చేశారన్నమాట. ఇప్పుడు ఆ లేఖ లీకేజీలో అంతా కొట్టుకుపోతున్నారు. అందుకే ఓ ప్రెస్ మీట్ తో కేటీఆర్, ఫాం హౌస్ లో కేసీఆర్ మౌనంగా ఉన్నారు. పార్టీలో మరెవరినీ మాట్లాడవద్దని ఆదేశించారు.|KAVITHA KALVAKUNTLA|SCREEN PLAY|DIRECTION|BRS|TEA|CUP|LETTER|LEAK|PARTY|KCR

మరి లేఖ లికేజీయే ఎందుకు? అంటే, పార్టీతోపాటు, కవితకి కూడా పూర్వ వైభవం రావాలి. ఒక మహిళ అయి ఉండీ కవిత లిక్కర్ స్కాంలో కూరుకుపోయి, జైలుకు కూడా వెళ్ళి రావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేదు. ఇంకా ఆ కేసులాగే, ఆ ప్రభావం ప్రజల్లో ఉంది. దాన్ని పోగొట్టాలి. ఉద్యమంలోలాగే ‘మహిళల జాగృతి’ పాత్రను కవిత తీసుకోవాలి. అందుకు ఆమెకు పార్టీలో ‘ఆత్మాభిమానం’, ‘ఆత్మగౌరవం’ కల్పించాలి. బిడ్డ మీద అపవాదుల్ని తొలగించి, ఆమెను లైమ్ లైట్ లోకి తీసుకరావాలి. బిడ్డను సంచలనం చేయాలన్నదే తండ్రి తపన. ఒకవేళ పార్టీలో కాదు కాదు కుంటుంబంలో కవితను పక్కన పెట్టాలన్న ప్రతిపాదనేదైనా ఉండి ఉంటే, అది ఎప్పటికీ కుదరదని, ఆ పరిస్థితి లేదని తేల్చిచెప్పడమే. వరంగల్ మీటింగ్ ను గొప్ప సక్సెస్ గా చూపించడం. రానున్నది బీఆర్ఎస్సే. ప్రజలు మాకు ఓటేయడం తప్ప వేరే దారి లేదు. కాంగ్రెస్ కు ఓటు వేసి ప్రజలు తప్పు చేశారు. అధికారాన్ని బీఆర్ఎస్ కు అప్పగించాల్సిందే. అనేది కేసీఆర్ కుటుంబం ఆలోచన. నిజానికి కాంగ్రెస్ వైఫల్యాలు కూడా కేసీఆర్ కు కలిసి వస్తున్నాయన్నది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం అవుతోంది. కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని, ఆయన నడిపిన ఉద్యమాన్ని దగ్గరగా చూసి వాళ్ళంతా చెబుతున్నది కూడా ఇదే. ‘దున్నపోతుకు గడ్డి వేసి, బర్రెను పాలివ్వమంటే ఎట్లా?’ వరంగల్ బహిరంగ సభలో కేసీఆర్ అన్న మాటలు గుర్తు చేసుకోండి.|KAVITHA KALVAKUNTLA|SCREEN PLAY|DIRECTION|BRS|TEA|CUP|LETTER|LEAK|PARTY|KCR

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News