Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

శ్రమైక జీవన సౌందర్యం-మే డే!|EDITORIAL

“శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తాయోయ్‌! అన్నాడు. అంతేగాక, “కార్మికలోకపు కళ్యాణానికి,. శ్రామిక లోకపు సౌభాగ్యానికి. సమర్పణంగా.. సమర్చనంగా.. త్రిలోకాలలో త్రికాలాలలో,. శ్రమైక జీవన సౌందర్యానికి. సమానమైనది లేనేలేదని ” శ్రీశ్రీ కీర్తించారు. కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి.. ఇవన్నీ శ్రమకు, శ్రామిక లోకానికి చిహ్నాలుగా, ఆ శ్రమయే సౌందర్యంగా ఆయన అభివర్ణించారు. శ్రమే సమాజ పురోగతికి మూలం కాగా, అదే శ్రమ దోపిడీకి గురవుతుండటం ఆందోళనకరం.

1886లో చికాగోలో జరిగిన హే మార్కెట్ సంఘటన ఒక కీలక మలుపు. రోజుకు 8 గంటల పనిదినం కోసం కార్మికులు చేసిన ఆందోళన రక్తపాతం దారితీసినా, అది ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కుల పోరాటానికి పునాది వేసింది. తరువాత 1889లో మే 1ను కార్మిక దినోత్సవంగా గుర్తించారు. భారతదేశంలో 1923లో మద్రాసులో మొదటిసారిగా మే డే జరుపుకోవడం కార్మిక చైతన్యానికి శ్రీకారం చుట్టింది.

భారతదేశంలో కార్మిక వర్గం విస్తృతమైంది. కేవలం కర్మాగార కార్మికులే కాదు, నిర్మాణ రంగం, వ్యవసాయం, రవాణా, సేవా రంగం, ఐటి రంగం ఇలా అన్ని రంగాల్లో పనిచేసేవారంతా కార్మికులే. దేశంలో 90% మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. అయితే, ఈ విభాగానికి సరైన చట్టపరమైన రక్షణ లేకపోవడం ప్రధాన సమస్య.

గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ, లిబరలైజేషన్ విధానాల తర్వాత కార్మిక హక్కులు క్రమంగా బలహీనపడ్డాయి. 8 గంటల పనిదినం అనే ప్రాథమిక హక్కు ఉన్నప్పటికీ, అనేక రంగాల్లో కార్మికులు రోజుకు 10–12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ఐటి రంగంలో ఈ పరిస్థితి తీవ్రమైంది. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఒత్తిడి, అనిశ్చితి యువతను మానసికంగా కూడా ప్రభావితం చేస్తున్నాయి.

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల విస్తరణతో శాశ్వత ఉద్యోగాలు తగ్గిపోయాయి. అనేక సంస్థల్లో 50% కంటే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. వీరికి పింఛన్, ఆరోగ్య భద్రత, ఇతర సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది.

మహిళా కార్మికుల పరిస్థితి మరింత ఆందోళనకరం. రాత్రి పూట పనిచేసే మహిళలకు సరైన భద్రత లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. పని గంటలు పెరగడం, ప్రయాణ భద్రత లేకపోవడం వంటి సమస్యలు వారిపై అదనపు భారం మోపుతున్నాయి.

విద్యా, వైద్య రంగాల్లో కూడా శ్రమదోపిడీ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు రోజుకు 10–12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. అయినప్పటికీ, వారికి తగిన వేతనం లేదా భద్రత ఉండడం లేదు. పిల్లలపై కూడా అధిక ఒత్తిడి పెరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో మే 1ను కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, కార్మిక హక్కుల కోసం పోరాటానికి ప్రతీకగా నిలవాలి. 1916లో 8 గంటల పనిదినం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో హక్కులు సాధించబడ్డాయి. అయితే, అవే హక్కులు మళ్లీ ప్రమాదంలో పడుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో పాలకులు కార్మిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆరోగ్య భద్రత, పింఛన్, కనీస వేతనం, పని గంటల నియంత్రణ, ప్రతి కార్మికుడికి హక్కులుగా అమలు కావాలి. అసంఘటిత రంగానికి ప్రత్యేక చట్టాలు, అమలు వ్యవస్థలు అవసరం.

సమాజ పురోగతిని నిర్ణయించేది శ్రామిక వర్గమే. ఆ వర్గం బలహీనపడితే దేశ అభివృద్ధి అసాధ్యం. కాబట్టి, కార్మిక వర్గం సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. మే డే స్ఫూర్తి ఇదే శ్రమకు గౌరవం, కార్మికుడికి న్యాయం.

ఇప్పటికైనా పాలకులు, సంస్థలు, సమాజం కలసి శ్రమదోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో, కష్టించి పనిచేసే చేతులు పిడికిళ్లుగా మారి ఉద్యమాల రూపంలో విస్ఫోటనం చెందడం అనివార్యం.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News