DCC President|డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో కొత్త మార్గదర్శకాలు|NEW RULES
TELANGANA|తెలంగాణలో డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల నియామక ప్రక్రియలో కాంగ్రెస్ హైకమాండ్|HIGH COMMAND కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసారి నియామకాల్లో పారదర్శకతకు, నూతన నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన ఏఐసీసీ, అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకునే వారు కనీసం ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసి ఉండాలని షరతు విధించింది. గతంలో డీసీసీ అధ్యక్షులుగా పని చేసిన వారికి రెండోసారి అవకాశం ఇవ్వబోమని స్పష్టతనిచ్చింది. ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేదా వారి సన్నిహిత బంధువులు ఈ పదవికి అర్హులు కాదని నిబంధన విధించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు మహిళా నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ సూచించింది. అదేవిధంగా, అభ్యర్థులు పరిశీలకులతో వ్యక్తిగత సమావేశాలు లేదా సంభాషణలు నిర్వహించకూడదని కఠిన ఆదేశాలు జారీ చేసింది. పరిశీలకులు సమర్పించే నివేదికల ఆధారంగా మాత్రమే నియామకాలు జరగనున్నాయని స్పష్టం చేసింది. కొత్త మార్గదర్శకాలు తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గతంగా పెద్ద చర్చకు దారితీశాయి.

