ఉత్తరప్రదేశ్ బాగ్పత్‌లో జైనులు నిర్వహించిన లడ్డూ మహోత్సవంలో వేదిక కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వేదికను వెదురు కర్రలతో నిర్మించగా, ఒక్కసారిగా జనం ఎగబడటంతో వేదిక కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

