‘అదృష్టం అందలమెక్కిస్తుంటే… బుద్ధి పోయి బురద తొక్కిందట!’ గీ సామెతెట్లున్నదో, గా అదృష్టవంతుని బుద్ధి గట్లనే ఉన్నది. పంజాబ్ లోని బర్నాల రైలు టేషన్ల ఒకలెవలో రూ.50 పెట్టి లాటరీ టికెట్ కొన్నరు. ఆదర బాదరల్నలో, గాబరల్నో గనీ, గా లాటరీ టికెట్ మీద పత్తా, పోన్ నెంబర్లు రాయలే. గంతేగాదుల్లా! పేరు కూడ రాస్కోలేదట! ఇగ గా టికెట్ కే అదృష్టం అయస్కాంతం లెక్క పట్టింది. 30 లచ్చల రూపాయల లాటరీ తగిలింది. ఇగ గా లాటరీ తగిల్నోల్ల జాడ కోసం ఊల్లె డప్పు సాటింపు శేపిస్తుండ్రు. ఆచూకీ తెలిస్తే, వస్తే ఘనంగా సాగతం పలకడానికి రంగురంగుల బుగ్గలు అంటిచ్చిండ్రు. కమీషన్ కింద ఏజెంటుకు లచ్చ రూపాయలిచ్చిండ్రు.

ఇగ గా లాటరీ తగిల్నోల్లు నెల రోజుల్లోగా రాలేదనుకోండ్రి. తగిల్న గా లాటరీ మొత్తం సర్కారు లెక్కలకు పోతదట! ఇగ గీ నెల రోజుల్లనే దొరకపట్టుకోవాల్నని, మైకులు పెట్టి మరీ ఊరూ, వాడా సాటింపేస్తాండ్రట. లాటరీ తగిల్నోల్లు మాత్రం పత్తా లేరట? ఏ తియ్ మనం పోదాం పా అనుకుంటాండ్రా? గట్ల గూడ గాడ ఎవ్వలు వత్తలేరట? ఎందుకో తెలుసా? గదానికి పావుతి ఇంకోటి మనదగ్గర ఉండాలె కదా?

