Thursday, September 24, 2026
22.2 C
Hyderabad

BC|బీసీలకు DASARA|దసరా బోనాంజా!

42% RISERVATIONS|రిజర్వేషన్లకు జీవో!!
TELANGANA GOVERNMENT|తెలంగాణ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం|HISTORICAL DECISION
CONGRESS|కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ కు మోక్షం!
కమిటీ నివేదికను ఆమోదించిన ప్రభుత్వం|GOVERNMENT
రానున్న LOCAL BODY ELECTIONS|స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు
జీవో నెం.9 జారీ.. త్వరలో నోటిఫికేషన్!?
కుల సర్వే ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లు
PRESIDENT|రాష్ట్రపతి, GOVERNOR|గవర్నర్ల వద్ద పెండింగ్ లో బిల్లులు
అయినా, జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్!
42%లో బీసీ మహిళలకు సగం సబ్ కోటా
మొదటి దశలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ|ZPTC|MPP|MPTC
రెండో దశలో సర్పంచ్ పదవులకు ఎన్నికలు
నేడు సీఎస్, డీజీపీలతో ఎన్నికల సంఘం భేటీ

తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకుంది. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా, కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించింది. కేబినెట్ ఆమోదించినప్పటికీ, శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించినప్పటికీ, బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద పెండింగ్ లో ఉన్నప్పటికీ, వాటన్నింటినీ అదిగమించి జీవోను జారీ చేసింది. కుల సర్వే ఆధారంగా, ప్రత్యేక కమిటీ సిఫారసులకనుగుణంగా ప్రభుత్వం ఈ స్థానిక ఎన్నికల్లోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి పూనుకుంది. అందులో సగం బీసీ మహిళలకు కేటాయించాలని నిర్ణయించింది. ఈసీతో సీఎస్, డీజీపీలు సమావేశం కానున్నాయి. త్వరలోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అయితే, 50శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదన్న సుప్రీం కటాఫ్, కోర్టు కేసులు రిజర్వేషన్లకు కానున్నాయా?అన్న అనుమానాలు మాత్రం తొలిగిపోలేదు.

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (అడుగు న్యూస్):
బీసీలు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న 42శాతం రిజర్వేషన్లకు జీవో 9 జారీ అయింది. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు మోక్షం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీలకు దసరా బోనాంజను ప్రకటించింది. రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద బిల్లులు పెండింగులో ఉన్నప్పటికీ వాటికతీతంగా జీవోనిచ్చింది. చారిత్రాత్మకం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఈసీతో సీఎస్, డీజీపీలు సమావేశం కానున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకు సర్కార్, సర్వం సన్నద్ధం చేసింది. ఇక షెడ్యూల్ విడుదలే తరువాయిగా మిగిలింది.
తెలంగాణలో పల్లె, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జి.ఓ నెం.9ను శుక్రవారం విడుదల చేసింది. ఈ రిజర్వేషన్ల ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ఉదయం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు. కాగా, బీసీ రిజర్వేషన్ల విషయంలో బుసాని వెంకటేశ్వరరావు కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే ఆధారంగా 42% రిజర్వేషన్లు నిర్ణయించబడ్డాయి. ఆర్టికల్స్‌ 40, 243%ణ, 243ు%తో పాటు డైరెక్టివ్‌ ప్రిన్సిపిల్స్‌ ప్రకారం ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. ఇప్పటికే కేబినెట్ లో, అసెంబ్లీలో ఈ బిల్లు ఏక్రగీవ ఆమోదం పొందింది. చట్టం ప్రకారం అమలులోకి రాబోయే ఈ రిజర్వేషన్లతో తెలంగాణ దేశంలోనే తొలిసారి బీసీలకు పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్‌ కల్పించిన రాష్ట్రంగా నిలిచింది. ఈ నిర్ణయంతో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బీసీ వర్గాల ప్రాధాన్యం మరింత బలపడనుంది. అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఈ మేరకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మార్చి 18, 2025న %దీజ% కోటాను 42%కు పెంచే బిల్లులు ఆమోదించారు. ఆగస్టు 31న మరో రెండు బిల్లులు ఆమోదించి, %ూజ, ూు, దీజ%లకు 50% మించి రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ బిల్లులు గవర్నర్‌, రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కానీ అవి పెండింగ్‌ లోనే ఉన్నాయి. డెడికేటెడ్‌ %దీజ% కమిషన్‌ నివేదిక, కుల సర్వే ఆధారంగా 42% %దీజ% కోటా నిర్ణయించారు. ఈ కోటాలో మహిళలకు 50% సబ్‌-కోటా కూడా ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్‌ మ్యాట్రిక్స్‌ను సీల్డ్‌ కవర్లలో పంచాయతీ రాజ్‌ శాఖకు సమర్పించారు. ఈ మ్యాట్రిక్స్‌ ప్రకారం, గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు , జిల్లా పరిషత్తులలో కోటాలు నిర్ణయిస్తారు.
కాగా, జీవో విడుదలైనందున వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ రాజ్‌ విభాగం కు సిఫార్సు చేస్తుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తుంది. ఎన్నికలు దశలవారీగా జరుగుతాయి. మొదటి దశలో 31 జిల్లా పరిషత్తులు చైర్మన్‌లు, 566 జెడ్పీటీసీలు లు, 566 ఎంపీపీ ప్రెసిడెంట్లు, 5,773 ఎంపిటీసీల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండో దశలో 13వేల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి.

అయితే ఈ జీవో చెల్లుబాటుపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్‌ 24న తెలంగాణ హైకోర్టు, 42% బీసీ కోటాపై పిటిషన్‌ను తిరస్కరించింది. ‘‘జీవో జారీ కాలేదు, తొందరపడి పిటిషన్‌ వేశారు’’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇప్పుడు జీవో జారీ అయినందుకు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

ఎన్నికల నిర్వహణకు ఎదురయ్యే ఆటంకాలను ప్రభుత్వం ఎలా అదిగమిస్తుంది? కోర్టుల్లో వేసే దావాలకు ఏ విధంగా స్పందిస్తుంది? ఏ రకమైన వ్యూహాలున్నాయి? లేక మేమైతే జీవో ఇచ్చాం? అడ్డకున్నది మాత్రం మేం కాదన్న రీతిలో వ్యవహరిస్తుందా? అలాగైతే ఫైనల్ గా రిజర్వేషన్లు అమలవుతాయా? అన్న అనుమానాలు బీసీల్లో వెల్లువెత్తుతున్నాయి. వీటికి సమాధానం మరికొద్ది రోజుల్లోనే రావచ్చు.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News