నేను సామాన్యురాలినే
టిపిసిసి సమావేశంలో తెలంగాణ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్
నేను ఎంత ఎదిగిన ఒదిగి ఉంటానని నూతనంగా వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. నేను సామాన్యురాలి గానే ఉంటానని, ఎవ్వరైనా నన్ను కలవోచ్చని, ఎవరు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, కార్యకర్తలు ఫోన్ చేస్తే మాట్లాడుతా…. అని అన్నారు. అలాగే ఫ్లెక్సీ, ఫోటోలు పెడితే నాయకులు కారు అలా ప్రచారం చేసుకుంటే ఎన్నికల్లో గెలవరని, ప్రజల్లో ఉంటేనే గెలుస్తారని నాయకులకు హితబోధ చేశారు. భారత స్వాతంత్ర పోరాటంలో మనం ఎలాంటి ప్రచారాలు లేకున్నా గెలిచామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అలాగే నాయకులకు మరో విజ్ఞప్తి కూడా చేశారు.నా కోసం రైల్వే స్టేషన్లకు లీడర్స్ రావొద్దని, నా బాగ్ లు ఎవరు మొయొద్దు అన్నారు. నేను ఇలానే ఉంటానని, నాకు బలం లేకపోతే నేనే మీ సహాయం అడుగుతా అని చెప్పారు. లీడర్లు, కార్యకర్తలు బ్యాగులు మోసే వారు కాదని, ఆత్మ గౌరవాన్ని ఎక్కడ తక్కువ చేసుకోవద్దు.. మీరు మీ పని చేసుకోవాలని చెప్పారు.

