సినీ నిర్మాత మరియు డ్రగ్ పెడ్లర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం ప్రకారం, డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం, ఆర్థిక పరిస్థితుల దారుణంగా మారడం అతని సూసైడ్‌కు కారణమని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినిమా రంగంలోకి ప్రవేశించారు. తెలుగులో “కబాలి” సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే, 2023లో 93 గ్రాముల కొకైన్‌తో పట్టుబడటంతో, పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన చిత్రపరిశ్రమను, చౌదరి సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

