మనుషుల, మనసుల మద్దెల ఆప్యాయత, స్నేయితం, పేమ, అనురాగాల్ని వ్యక్తం శేసే ఒక సహజమైన భావోద్వేగ పద్ధతిని కావలింత అంటం. గదాన్నే కౌగిలి అని కూడ అంటరు. ఇగ కౌగిలి పేరున తెలుగు సాహిత్యంల మస్తు కథలు, కయితలు, నవలలు వచ్చినయి. ఇగ సినిమాలనైతే గా కావలింత లేని పాట, ఆట ఉండనే ఉండది. ఇగ పైకి ఎంతో పేమగ, ఆప్యాయతతో కనిపించినప్పటికీ, లోపల మోసం శేసే, హాని తలపెట్టే కావలింతను ధృతరాష్ట్ర కౌగిలి అంటరు. గీయెనిది మాత్రం పేమ కౌగిలే కాకపోతే, గా కావలింత మిగిల్చిన యిషాదమే యింతగ ఉంది.

గా చైనాల వాంగ్ అనేటాయినెకు ఓ పెండ్లాం ఉంది. గామె గీ మద్దెల భర్త దగ్గరకు పోయింది. సల్లగుంది, సలిపెడ్తాందంది. యెంటనే గాయినె గామెను అమాంతం తన శేతుల్లకు తీసుకొని, కావలించుకున్నడు. గంతే, గామె గిలగిల కొట్టుకుని, తండ్లాడి కింద పడిపోయింది. ఇగ పొద్దుగాల గామెను గా దవాఖానాకు తీసుకపోయిండు. గామెకు 5 పక్కబొక్కలు యిరిగినయని, ఇంకో పక్కబొక్క శీరికబాసిందని డాస్కర్లు శెప్పిండ్రు. గట్లెట్లయింది? నేను మాములుగనే కావలించికున్ననని గా పెనిమిటి ఆశీరపోయిండు. అయితే, గామె 50కిలోలుందంట. ఇంకా బరువు తగ్గాల్నని రాత్రి పూట తింటలేదట. ఇగామె ఇంట్లనే ఉంటాందట. గందుకని గామెకు బొక్కల్ల బలం లేకుండ అయిండొచ్చని గా డాక్టర్లు అనుకుంటాండ్రు. ఇగో మనం ఫారం కోల్లల్లెక్క అయినం. పెండ్లాం మొగల మద్దెల పేమనైనా కాస మొల్లగ, జెర జాగర్తగ సూపుకోవాలె. ఏమంటరు?

