Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

కార్మికుల జోలికెళితే ఖతమే!

తస్మాత్ జాగ్రత్త!

-హెచ్చరించిన అఖిల పక్షాలు

-వరంగల్ కూరగాయల మార్కెట్ లో ముమ్మరంగా సంతకాల సేకరణ

అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణ కోసం లక్ష సంతకాల సేకరణలో భాగంగా గురువారం అఖిల పక్షం సారథ్యంలో లక్ష్మీపురంలోని వరంగల్ కూరగాయల మార్కెట్లో సంతకాల సేకరణ కార్యక్రమం జోరుగా సాగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తక్కెళ్లపల్లి రాజేశ్వర రావు, మిల్లు, వివిధ కార్మిక, ప్రజా సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు. నేరుగా కూరగాయలు అమ్ముతున్న, ఇతర కార్మికుల వద్దకు వెళ్ళ విషయం చెప్పి, సంతకాలు సేకరించారు.

ఈ సందర్భంగా ప్రదీప్ రావు, తక్కెళ్లపల్లి రాజేశ్వర రావు, తదితర అఖిల పక్ష నేతలు మాట్లాడుతూ, 80 సంవత్సరాలుగా మిల్లు కార్మిక భవనం అనేక ఉద్యమాలకు సాక్షిగా నిలిచింది. వేలాది మంది కార్మికులకు నీడ నిచ్చింది. ఆదరించింది. అలాంటి భవనాన్ని కొందరు స్వార్థపరులు కబ్జాదారుల కు అప్పగించారు. అన్యాక్రాంతం చేశారు. గత ప్రభుత్వ హయాం లోనే ఆ భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి పరుల పాలు చేశారు. అదే మాయలో పడి, మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, బడా వ్యాపారవేత్త కలిసి ఆ భవనాన్ని కూల్చి కమర్షియల్ కాంప్లెక్స్ కు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ విషయమై ఇప్పటికే కార్మిక లోకం కన్నెర్ర చేసింది. భారతీయ జనతా పార్టీతో సహా అఖిలపక్ష నేతలతో కలిసి ఆ పనులను నిలిపివేసి అది కార్మికులకు చెందే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అది కమర్షియల్ కాంప్లెక్స్ అని నేను రాలేదు. ఏదో ఓ సిటీలో జరుగుతున్న భూమి పూజకు వచ్చానని మాయ మాటలు చెప్పి కొండా మురళి తప్పించుకోవాలని చూశాడు. తానెప్పుడూ కార్మికులకు అండగా ఉంటానని, తన సొంత డబ్బులతో మళ్లీ ఆ యొక్క కార్మిక భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చి నెల రోజులు పూర్తి అయినా పట్టించుకోవడం లేదు. పైగా కోర్టు నుంచి స్టే తెచ్చుకునే విధంగా బడా వ్యాపారవేత్తకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. కొండా మురళి… మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని వరంగల్ ప్రజానీకం గమనిస్తున్నది. ఆ కార్మిక భవన స్థలం జోలికి వెళ్లిన బిఆర్ఎస్ పార్టీకి వరంగల్ ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో, అదే గతి మీకు పడుతుంది. తస్మాత్ జాగ్రత్త! అని హెచ్చరించారు. కార్మిక భవన స్థలంలోనే కొత్త భవనం నిర్మించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఇందుకు ఎలాంటి త్యాగాలకైనా వెనుతిరగబోమని ఆయన చెప్పారు.

ఇప్పటికే లక్ష సంతకాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ కూరగాయల మార్కెట్లో చేపట్టే కార్యక్రమం మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చింది.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News