ఇల్లంటే రాయి, సలాక, ఇసుక, ఇటికె, కంకర, సిమిటి, సెమట, నీల్లు.. పిల్లర్లు, బేస్ మెట్లు, బెడ్లు, అడ్డ బీములు, స్లాబులు.. గివే మనకు తెలిసినయి. కనీ, గా ఇండోర్ ల గిదంతా ఏమీ ఉండదట. ! ఇల్లంతా ఇటికెలతోటే! అవుమల్ల.. సివరాఖరికి పైకప్పు, గదేనుల్లా స్లాబ్ కూడా ఇటుకలతోటే కట్టడం ఎక్కడైనా సూసిండ్రా?

ఇంటికి మన లెక్క సిమెంట్, కాంక్రీటు వంటివేవీ ఆడరట. ఆఖరికి పై కప్పు కూడా ఇటికెలతోటే కడతరట. మొత్తం ఇల్లంతా ఇటికెలతోటి సరే, మరి పై కప్పునెలా కడతరు? అంటే, గా పైకప్పులకు కూగా ఇటికెను పెట్టి, గదేదో సిమెంట్ ను పూత్తరు. గంతే సిటికెల గది అతుకుతది. పైకప్పుకు పెట్టిన ఇటికె పెట్టినట్లే అతుక్కపోతాంది. గోడలకంటే తొందరగ గా పైకప్పు పడతాంది. ఇండోర్ అంతా ఇండ్లను గిట్లనే కడతరట. కర్సు తక్కువ. టైమ్ తక్కువల..ఎర్రటి ఇటికెలతోటి అందంగా ఇల్లు కనబడ్తాంది. మరి మీరూ కట్టి సూడుండ్రి!

