Thursday, September 24, 2026
22.2 C
Hyderabad

ఎడిటోరియల్ : 11.03.2025

విపక్షాల సమర్థతకు విషమ పరీక్ష !

పార్లమెంట్‌ మలివిడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. దేశంలో ఉన్న సమస్సయల దృష్ట్యా ఈ సమావేశాలే కీలకం. ఈ సమావేశాల్లో ఏ అంశంపై చర్చించాలి..చర్చించకూడదు.. సభాసమయాన్ని సద్వినియోగం చేసుకోవడమెలా అన్నది కూడా విపక్ష కాంగ్రెస్‌ చతురతపై ఆధారపడి ఉంది. అలాగే విపక్షాలు కూడా సమర్థత ప్రదర్వించాల్సి ఉంది. కేవలం అల్లరి చేసి వాకట్లు చేయడమో. ప్రతిష్టంభనతో సభ వాయిదా వేయించడం వల్లనో సమస్యలు చర్చకు రావు. ఇది గమనించి కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. లేకుంటే అది విపక్ష పార్టీగా విఫలం అయినట్లే. ప్రధానంగా డిటిమిటేషన్‌ భయాలు, జనగణన,జిఎస్టీ, నిరుద్యోగం, ఔషధధరలు, పెరుగుతున్న నిత్యావసర ధరలు వంటి ప్రధాన సమస్యలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు డీలిమిటేషన్‌పై సర్వత్రా చర్చ నడుస్తోంది. దక్షిణాది రాష్టాల్ల్రో జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై బిజెపి లేదా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. తెలంగాణ బిజెపి నేతలు మాత్రం సీట్లు తగ్గవని అంటున్నారు. ఇంతకీ ఇప్పుడున్న సీట్లు తగ్గవా లేక, పెరిగే సీట్లు తగ్గవా అన్నది స్పష్టం చేయకుండా గోడవాటం పిల్లిలా వ్యవహరిస్తున్నారు. అమెరికా తరహాలోనే భారత్‌ కూడా ప్రజ్యాస్వామ్య వ్యవస్థ కలిగిన సమాఖ్య రాజ్యం. 1971లోని జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడం వల్ల ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయనే వాస్తవాన్ని గుర్తించాము. అయితే ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి బదులు దాన్ని 2026 దాకా వాయిదా వేశాము. చివరి జనాభా గణన 2011లో జరిగింది. తదుపరి జనాభా గణన 2021లో జరగవలసి ఉండగా కోవిడ్‌ విలయం వల్ల వాయిదా వేశారు. 2021 నుంచి ఏదో ఒక సాకుతో జనాభా గణన జరగనే లేదు. తాజాగా కులగణన అంటూ కాంగ్రెస్‌ రాజకీయాలు మొదలు పెట్టింది. దీంతో సమాజంలో చీలిక తప్ప మరోటి రాదు. ఇది ఓ రకంగా అచ్చం రాజకీయ లబ్దికోసం చేస్తున్న డిమాండ్‌ తప్ప మరోటి కాదు. ఈ క్రమంలో 2026లో జనాభా గణన అనంతరం విధిగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరగవలసి ఉన్నది. ప్రతి రాష్టాన్రికి కేటాయించే సీట్ల సంఖ్యను కూడా అప్పుడే నిర్ణయిస్తారు. జనాభా పెరుగుదల అదుపులేకుండా జరిగినందుకు కొన్ని రాష్టాల్రకు ప్రయోజనాలు కల్పిస్తారు. సంపూర్ణ ప్రజనన రేటు 2 శాతం, అంతకంటే తక్కువగా ఉండాలన్న నిర్దేశిత లక్ష్యాన్ని సాధించిన రాష్టాల్రను సీట్ల కుదింపుతో శిక్షించనున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇలా కేవలం జనాభా ప్తరాపిదకిగా కాకుందా మధ్యేమార్గం అవలంబించాల్సిన అసవరం ఇప్పుడు కనిపిస్తోంది. పునర్విభజనతో దక్షిణాది రాష్టాల్రు తీవ్రంగా నష్టపోతాయని తమిళనాడు సిఎం స్లాలిన్‌ పోరుబాట పట్టారు. జనాభా నిష్పత్తి సూత్రానికి అనుగుణంగా ఆయా రాష్టాల్ర సీట్ల సంఖ్యను పునర్‌ నిర్దారించడం ద్వారా దక్షిణృాది రాష్టాల్రకు నషటం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాది రాష్టాల్ల్రో ఇప్పుడు లోక్‌సభలో 129 స్థానాలున్నా వారి గళం పెద్దగా విన్పించడం లేదు. ఇప్పుడా సీట్ల సంఖ్య మరింతగా తగ్గితే దక్షిణాది ప్రతినిధుల మాటను కేంద్రం పట్టించుకోదు. సీట్ల సంఖ్య తగ్గించబోమనే హావిూలో నిజాయితీ కొరవడిరది. ఇదే సందర్భంలో జనాభా అత్యధికంగా ఉన్న యూపీ, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల సీట్ల సంఖ్యను పెంచబోమని కేంద్రం స్పష్టంగా ప్రకటించడం లేదు. సీట్ల సంఖ్య పునర్‌ నిర్దారణకు జనాభా నిష్పత్తి సూత్రాన్ని అనుసరించిన పక్షంలో దక్షిణాది రాష్టాల్ర బలం మరింతగా తగ్గిపోతుంది. పర్యవసానంగా పార్లమెంటులో దక్షిణాది వారి గళం వినిపించే వారి సంఖ్యా తగ్గుతుంది. ఈ రాష్టాల్ర సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం పెరుగుతంది. కొన్ని రాష్టాల్రకు సీట్ల సంఖ్యను కుదించాలన్నా, పెంచాలన్నా ఇప్పుడున్న సీట్ల సంఖ్యను అనివార్యంగా పెంచాలి. రాష్టాల్ర సైజు బట్టి సీట్లను పెంచడం కూడా ఆలోచించాలి. లోక్‌సభకు ఎన్నికయ్యే ప్రతినిధుల సంఖ్యను విధిగా పెంచవలసి ఉంటుంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, 1977లో రాజ్యాంగానికి 42వ సవరణ జరిగింది. లోక్‌సభలో ప్రస్తుతం రాష్టాల్ర నుంచి ఎన్నికైన ప్రతినిధులు 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది ఉన్నారు. అధికరణ 81లోని నిబంధన 2(ఎ) ప్రకారం ప్రతి రాష్ట్రం నుండి లోక్‌సభకు ఎంతమంది ఎన్నిక కావాలనే విషయం ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. జనాభాకు, లోక్‌సభ సభ్యుల సంఖ్యకు గల నిష్పత్తి సాధ్యమైనంతవరకు అన్ని రాష్టాల్రకు ఒకే విధంగా ఉంటే పేచీ ఉండదు. ఇకపోతే ప్రధానంగా మరో రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంది. ఇప్పుడున్న ఎంపిలు, ఎమ్మెల్యేలు వరుసగా వారే ఎన్నికవుతూ వస్తున్నారు.. కలు,ధనబలం ద్వారా ఒక్కరే ఆరేడు పర్యాయాలు సభ్యులుగా ఉంటున్నారు. ఇది పోవాల్సిన అవసరం ఉంది. 140 కోట్లు ఉన్న దేశంలో కొందరే నిరంతరంగా చట్టసభలను గబ్బిలాల్లో పట్టుకుని వెళ్లాడుతున్నారు. ఇందులో అన్ని పార్టీల వారూ ఉన్నారు. ఇది పోతేనే దేశం బాగుపడదు. అలాగే ప్రజాస్వామ్యం బలపడదు. దీనిపై బిజెపి దృష్టి పెట్టాల్సి ఉంది. కనీసం రెండు టర్ములకు మించి ఎన్నిక కాకుండా రాజ్యాంగ సవరణ చేయాలి. మూడో దఫాలో అధికారం చేపట్టిన మోడీ అనేక ఆశలు కల్పించారు. ఇలాంటి సంస్కరణలు చేపడితే ప్రజలు ఆమోదిస్తారు. హర్షిస్తారు. రాజకీయ పార్టీల నేతలు జీవితాంతం చట్టసభల్లో తిష్టవేయకుండా చేస్తే..దేశ ప్రయోజనాలు కాపాడిన వారు అవుతారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ సచ్ఛీలతను చాటుకోవాల్సి ఉంది. ముందుగా మోడీ ఇందుకు సిద్దం కావాలి.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News