Sunday, November 15, 2026
28.2 C
Hyderabad

ఫార్మసిస్ట్ లు ఆరోగ్య భారత్ కు ఆధార స్తంభాలు|PHARMACIST|DR RAPOLU SATYANARAYANA

(65వ జాతీయ ఫార్మసీ సప్తాహం: 15-21 నవంబర్ 2026)

ప్రపంచంలోని ఆరోగ్యసంరక్షణ నిపుణులలో 3వ అతిపెద్ద సమూహంగా, భారత్ లో 13 లక్షల మంది రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లు ఉండగా, 8.5 లక్షల పైచిలుకు ఫార్మసిస్ట్ లు క్రియాశీలకంగా వృత్తిలో ఉన్నారు. దేశంలో ఫార్మసిస్ట్ ల సాంద్రత ప్రతి పదివేల జనాభాకు 9.1. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 9.5 కు సమీపంలో ఉంది. మరి ఫార్మసిస్ట్ సేవలను ప్రత్యక్ష ప్రజారోగ్యంలో వినియోగించుకొవడంలో దేశం సఫలమవుతోందా!?

డాక్టర్ రాపోలు సత్యనారాయణ వ్యాసం

ప్రపంచంలోని ఆరోగ్యసంరక్షణ నిపుణులలో మూడవ అతిపెద్ద సమూహం ఫార్మసిస్ట్ లు. భారత్ లో 13 లక్షల రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లు ఉండగా ఎనిమిదిన్నర లక్షల పైచిలుకు ఫార్మసిస్ట్ లు క్రియాశీలకంగా వృత్తిలో ఉన్నారు. దేశంలో ఫార్మసిస్ట్ ల సాంద్రత ప్రతి పదివేల జనాభాకు 9.1. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 9.5 కు సమీపంలో ఉంది. వీరిలో 40% మంది 35 సంవత్సరాలకు దిగువన ఉన్నారు. దీనికి తోడు దేశంలోని రెండు వేల డి ఫార్మ్, రెండున్నర వేలు బి ఫార్మ్ కాలేజీల నుండి సుమారు 4 లక్షలు మరియు 2 లక్షల చొప్పున పట్టాలు పుచ్చుకొని బయటకు వస్తున్నారు. ఫలితంగా భవిష్యత్ అవసరాలకు కావలసిన ఫార్మసిస్ట్ మానవ సంపద మనకు పుష్కలంగా ఉంటుంది. ప్రపంచంలోని ఔషధ ఉత్పత్తిలో మన దేశం 5 అత్యధిక ఉత్పాదక దేశాలలో ఒకటిగా నిలిచింది. మన ఉత్పత్తిలో 30% ఔషధాలు 200 పైగా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ కూడా గణనీయంగా జరుగుతున్నాయి. కానీ, ఫార్మసిస్ట్ సేవలను ప్రత్యక్ష ప్రజారోగ్యంలో వినియోగించుకొనే విషయంలో దేశం విఫలమైంది.

మన దేశంలో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ కావాలంటె డి ఫార్మ్, బి ఫార్మ్ లేదా ఫార్మ్ డి పట్టా ఉండాలి. తదుపరి ఎం ఫార్మ్, ఎం ఎస్ ఫార్మసీ, పిఎచ్ డి, పి డి ఎఫ్ వంటి అదనపు అర్హతలు ఉన్నాయి. ఇంకా కొన్ని క్లినికల్ స్పెషాలిటీ కోర్స్ ల రూపకల్పన జరగవలసి ఉంది. విద్యా పరంగా మెడికల్ ప్రాక్టిషనర్ లు వ్యాధి చికిత్స, ఫార్మసిస్ట్ లు ఔషధ కల్పన ప్రధానంగా అభ్యసిస్తారు. మెడికల్ ప్రాక్టిషనర్ లకు ఔషధాలు తెలిసినట్లే, ఫార్మసిస్ట్ లకు వ్యాధి చికిత్స తెలుసు. బ్రిటిష్ కాలంలో సబ్-అసిస్టెంట్ సర్జన్ హోదాలో వైద్య సేవలు అందించిన ఎపోతెకరీలు/ ఫార్మసిస్ట్ లు 1970 దశాబ్ది దాకా డిస్పెన్సరీలలో స్వతంత్రంగా, వైద్యశాలల్లో వైద్యాధికారి అనుపస్థితిలో ఆధికారిక ఇన్-ఛార్జ్ గా నడిపిన చరిత్ర ఉంది. ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసిస్ట్ లే పెద్ద దిక్కు. ఆ విషయం తెలిసి, చట్టం తెలిసి కూడా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ ఎచ్ ఎం) కింద ఏర్పాటు చేస్తున్న బస్తీ/ పల్లె దవాఖానల్లో ఫార్మసిస్ట్ లను అసలే నియమించలేదు. జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రకారం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ లుగా ఫార్మసిస్ట్ లను తీసుకోవలసి ఉన్నా ఎన్ ఎచ్ ఎం అధికారులు ఎంపిక చేయడం లేదు.

ప్రభుత్వాల పాక్షిక అవగాహన, ఉన్నతాధికారుల ఒంటెద్దు ఆధిపత్యం మూలంగా ప్రజలకు ఫార్మసిస్ట్ ల సేవలు సమగ్రంగా అందక పోగా, ఫార్మసిస్ట్ లు నిమ్నఉద్యోగిత, నిరుద్యోగిత అనుభవిస్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులకు మెడికల్ ప్రాక్టిషనర్ లు మాత్రమే, అదేవిధంగా మెడికల్ ప్రాక్టిషనర్ లకు కూడా తామే ఆరోగ్యరంగ సర్వస్వం అనే భావన ప్రబలంగా నిండి ఉంది. ఫార్మసిస్ట్ ల తోడ్పాటుతో అందరికి ఆరోగ్యం, నాణ్యమైన వైద్యం అందించవచ్చు అనే పరిష్కార వాస్తవికత కంటె వారి అభిజాత్యమే రాజ్యమేలుతున్నది.

నేషనల్ మెడికల్ కమీషన్, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కళాశాలల అనుమతి ఇచ్చేటప్పుడు అనుబంధ హాస్పిటల్ లలో ఫార్మసీ డిపార్ట్మెంట్స్ ప్రాధాన్యతను విస్మరిస్తున్నాయి. అన్ని వైద్యశాలల్లో ఫార్మసీ డిపార్ట్మెంట్స్ నెలకొల్పాలని సుప్రీం కోర్ట్ నిర్దేశాలు ఇచ్చినా ప్రభుత్వాలకు, ఆరోగ్య శాఖ అధికారులకు చీమ పారినట్టు కూడా లేదు. ఫలితంగా అహేతుక ఔషధ వినియోగం, ఆంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ జటిలమైన ప్రజారోగ్య సమస్యలుగా మారినాయి.

డబ్బున్న వారు యజమానులుగా మెడికల్ షాప్/ కమ్యూనిటీ ఫార్మసీ, చెయిన్ ఫార్మసీ, ఆన్ లైన్ ఫార్మసీ లు నెలకొల్పుతున్నందున ఫార్మసిస్ట్ ల పాత్ర చాలా సందర్భాలలో కాగితాలకు పరిమితం అయిపోతున్నది. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ల సంఖ్య తక్కువ ఉండి, సహాయక సిబ్బంది, అనువైన కార్యాలయాలు లేక వారు ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవలి కాలంలో క్షేత్రస్థాయిలో ఇతర శాఖలకు చెందిన అధికారుల జోక్యం పెరుగుతున్నది. ఇది డ్రగ్స్ కంట్రోల్ శాఖ ప్రత్యేకతకు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ల ఆత్మగౌరవానికి, ఫార్మసీ నిర్వాహకుల ఆత్మ స్థైర్యానికి విఘాతం కలిగించే అంశం.

అభివృద్ధి చెందిన దేశాలలో ఫార్మసిస్ట్ లకు సెకండరీ ప్రిస్క్రైబర్ అధికారాలు ఉంటాయి. ఇక్కడ ప్రజావసరం ఉన్నా, సాంప్రదాయకంగా చికిత్సా సేవలు అందిస్తూనే ఉన్నా ఔషధ నిపుణులైన ఫార్మసిస్ట్ లకు ఆంక్షలే ఎక్కువ.

మరి పరిష్కార మార్గాలు ఏమిటి?

  • ఫార్మసీ విద్యార్థులకు స్టైపండ్ తో కూడిన నాణ్యమైన అభ్యాస శిక్షణ సక్రమంగా అందించాలి.
    ఫార్మసిస్ట్ లకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కాలానుగుణంగా నిర్వహించాలి.
  • అన్ని హాస్పిటల్ లలో పూర్తి స్థాయి ఫార్మసీ డిపార్ట్మెంట్స్ నెలకొల్పే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
  • ఔషధాలు, వ్యాక్సిన్స్ ఉన్న అన్ని చోట్ల ఫార్మసిస్ట్ లను నియమించాలి.
  • 24 గంటలు నడిచే వైద్యశాలల్లో ప్రతి షిఫ్ట్ కు సరిపడే విధంగా ఫార్మసిస్ట్ లను నియమించాలి.
    ఫార్మసిస్ట్ లు సొంత ఫార్మసీ పెట్టుకోవటానికి బ్యాంక్ రుణాలు, ఇండెమ్నిటి ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించాలి.
  • పెద్దల వ్యాక్సినేషన్ పట్ల అవగాహన కల్పించి కమ్యూనిటీ ఫార్మసీలను వ్యాక్సినేషన్ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. తద్వారా సాంక్రామిక వ్యాధులను నివారించటంతో పాటు ఆంటీ మైక్రోబియల్ వాడకంను నియంత్రించవచ్చు.
  • ఫార్మసిస్ట్ లు స్వయంగా కమ్యూనిటీ/ సోషియల్ ఫార్మసీ ప్రాక్టీస్ చేపట్టి ప్రైమరీ కేర్, మెడికేషన్ మేనేజ్మెంట్, దీర్ఘవ్యాధుల నిర్వహణ, వ్యాధి నిరోధకత, ఆహారం, జీవన శైలి, పోషణ వంటి సేవలు అందించి ప్రజల ఆదరం పొందాలి.
  • ఫార్మకోవిజిలెన్స్ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ ల పాత్ర పెంచాలి.
  • పరిశ్రమలో ప్రతి దశలో ఫార్మసిస్ట్ పర్యవేక్షణ ఉండాలి.
  • ఫార్మసీ కళాశాలలలో ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ (ఐ పి ఎ) స్టూడెంట్ ఫోరంను బలోపేతం చేయాలి.
  • ఫార్మసిస్ట్ లందరూ ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ (ఐ పి ఎ) సభ్యత్వం స్వీకరించి ఆరోగ్య వైజ్ఞానిక సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి.
  • ఐ ఎం ఎ, ఐ డి ఎ వంటి సహ సంఘాలతో కలిసి సమన్వయంతో పనిచేయాలి.

ఆరోగ్య వ్యవస్థకు ఆధార స్తంభాలైన ఫార్మసిస్ట్ లను బలోపేతం చేసి, వారి విజ్ఞానాన్ని, సేవలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా వినియోగించుకొంటే ఆరోగ్య భారత్ సాకారం సులభసాధ్యం! అందుకే ఐ పి ఎ ఈ 65వ జాతీయ ఫార్మసీ సప్తాహానికి “ఆరోగ్యవంతమైన భవితకు ఫార్మసిస్ట్ ల సశక్తీకరణ” (ఎంపవరింగ్ ఫార్మసిస్ట్స్ ఫర్ హెల్దియర్ ఫ్యూచర్) అనే నినాదాన్ని ఎంపిక చేసింది.

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

(వ్యాసకర్త ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు)

Latest News

భారతదేశానికి ముస్లింల ఆగమనం|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

తొలిమధ్య యుగంలో (8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు) భారతదేశాన్ని రాజపుత్ర రాజ్యాలు పాలించగా ఇదే సమయంలో అరబ్బు మరియు తురుష్క ముస్లింలు భారతదేశంపై దండెత్తి వచ్చారు. భారతదేశంలో పాలన అంతా...

ఇంటర్నెట్ లేకుండనే వాతావరణం!|ADUGU TRENDS

అవసరాలు, ఆలోశెనలే కొత్త కొత్తయి కనిపెట్టేలా శేసింది. గీ కొత్త ఆవిష్కరణలే మానవ మనుగడును నిత్య నూతనం, దేదప్యమానం శేత్తానయి. గట్ల కనిపెట్టిన వాటితోటే మనం గిప్పుడు గిట్ల బతుకుతున్నం. మరి గీ...

సమ్మిట్ పై రాజకీయ రచ్చ|EDITORIAL

అంతర్జాతీయ వేదికగా తెలంగాణ ప్రతిష్ఠను చాటాల్సిన భారత్ సమ్మిట్‌ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కింది. అభివృద్ధి చర్చల స్థానంలో రాజకీయ రచ్చ చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. సమ్మిట్‌ విజయానికి అసలైన కొలమానం ఏమిటి? మార్గం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 15 నుండి నవంబర్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. వ్యాపారస్తులకు...

జంగు.. పటేల్!|ADUGU TRENDS

పటేల్ అంటే గ్రామాధికారి లేదా గ్రామ పెద్ద. సంస్కృత పదం ‘పట్టకిల’ అంటే, రాచరిక భూమికి యజమాని. గా గుజరాతీ పదం 'పాట్' అంటే భూమి ఆధారంగా గీ పదం పుట్టింది. గుజరాత్‌ల...

కుప్పకూలిన ఎన్విడియా షేర్లు!|EDITORIAL

ఎన్విడియాలో ఊహించని సంక్షోభం నెలకొంది. సీఈఓ జెన్సన్ హ్వాంగ్ వివాహేతర సంబంధాల వివాదంతో రాజీనామా చేయగా, షేర్లు పతనమై ఏఐ మార్కెట్‌లో తీవ్ర కలకలం రేగింది. మార్గం - అడుగు, ఎడిటోరియల్ కృత్రిమ మేధస్సు ఏఐ...

నవంబర్ 14, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు.పంచమి రాత్రి 07.39 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 06.04 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శూల రాత్రి తెల్ల 04.54 వరకు ఉపరి గండ కరణం బవ ఉదయం 06.35...

మగాడురా బుజ్జీ!?|TELANGANA|CM|REVANTH REDDY|NAGARJUNA AKKINENI

సీఎం సంధించిన ‘నాగార్జు‘నా’స్త్రం’ తెగిడిన నోటి నుండే పొగడ్తలు సంఘర్షించకుండా సహకారం అది మంచి పనేనని అంగీకారం సీఎంకు, హైడ్రాకు చేకూరిన బలం హైడ్రాకు ఆయనే బ్రాండ్ అంబాసిడరా? కూల్చిన చోటే కొత్త రూపుదాల్చిన కుంట ప్రారంభోత్సవంలో పల్లవించిన పలు అంశాలు కాదన్న చోటే,...

గీ తాపీ మేస్త్రీలు ఖాకీలే!|ADUGU TRENDS

ఖాకీలంటే కరడుగట్టిన మనసులు. చేతిల లాఠీలు, నోటి నిండా బూతులనే గిప్పటి దాకా మనకు తెలుసు. కానీ, గా బెంగళూరుల పోలీసులు గట్ల కాదని నిరూపించిండ్రు. గదేందో సూద్దాం పదండ్రి. గా బెంగళూరుల జ్ఞాన...

భారత్ కు సవాల్ గా హసీనా అప్పగింత!?|EDITORIAL

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు హసీనాను ఆ దేశానికి అప్పగించాల్సిందేనా? బంగ్లాదేశ్ ఒత్తిడికి భారత్ తలొగ్గుతుందా? లేక దౌత్య, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుందా? హసీనా భవితవ్యం మాత్రమే కాదు. దక్షిణాసియాలో...

నవంబర్ 13, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం నాగుల చవితి తిధి శు.చవితి సాయంత్రం 05.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం మూల పగలు 03.23 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ధృతి రాత్రి తెల్ల 04.22 వరకు ఉపరి శూల కరణం భద్ర రాత్రి...

పాపం… పవన్ కళ్యాణ్!?|PAWANKALYAN|PSPK|AP|DEPUTY CM|PERSONAL ISSUE

-అచ్చిరాని ‘మూడు ముళ్ళు’! -మూన్నాళ్ళ ముచ్చటగా పెళ్ళిళ్ళు!! -ముచ్చటగా.. మూడో ‘సారీ..’!!! పాపం పవన్ కళ్యాణ్! మూడు పెళ్లిళ్లు.. రెండు విడాకులు.. ఇప్పుడు మూడో బంధానికీ ముగింపు! ఎందుకనో?, సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News