Friday, April 24, 2026
37.2 C
Hyderabad

గా కుక్కలకు గూడ సర్కారోల్ల శిచ్చలా!?|ADUGU TRENDS

కుక్క బత్కు. కుక్క సావు. కుక్క పీకులాట, అసొంటి తిట్లే కాదుల్లా, బతికితే కుక్కలా బతకాలి. ఊల్ల పెల్లికి కుక్కల హడావుడి యెక్కువ. కుక్క యిశ్వాసం గల్ల జంతువు. ఊరికి కాపలగా దర్జాగా ఉంటయి గన్క, గ్రామ సింహం అని గూడా కుక్కలను పిలుస్తరు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ…అన్నరు. ఇట్ల కుక్క మీద లెక్కలేనన్ని సామెతలు ఒచ్చినయి.

ఈధి కుక్కల సంగతి పక్కన పెడితే, పెంపుడు జంతువులుగ గూడ కుక్కలకు మించిన నమ్మకైన జంతువే గీ బూమ్మీద లేదు. జగముల పుట్ట లే. గందుకే శాలా మంది కుక్కలను మనుసుల కంటే ఎక్కవగ పేమిస్తరు. కక్కలను పావురంగ, తమకు పుట్టిన బిడ్డల కంటే గూడ ఎక్కవగ పేమగా పెంచుకుంటున్నరు.

కుక్క మనిషిని కరిస్తే కాదు, మనిషే కుక్కను కరిస్తేనే వార్త అని గూడ అన్నరు. ఎందుకంటె కరవడం దాని లచ్చనం. గందుకే గద కనకపు సింహాసనం మీద శునకమును కూర్చండబెట్టిన యెనుకటి గుణమేల బోతదన్నరు. యే దిదంత ఎందుగ్గనీ, కుక్క కుక్కే. మనిషి మినిషే.

కుక్కకు మనిషికి గంత దగ్గరి సంబందం ఉన్నది గాబట్టే గీ గిన్ని ముచ్చట్లొచ్చినయి. యే ఇగ గిదంత గా కుక్కల గురించెందుకని గద మీ అనుమానం. యిమానంగ శెప్తాన.. గిది మీరు సదివి తీరాల్సిందే.

మన దేశంల ఉత్తర పదేశ్ రాస్ట్రం ఉంది గద. గాడ కుక్క రోండోసారి కరిసిందనుకోండ్లి. ఇగ కుక్కకు గూడ జీవిత ఖైదు యిధిస్తరట. గాడ గా సర్కారోల్లు గిట్ల బాజాప్తా ఓ జీవోనే తీసిండ్లంట. గా యీధి కుక్కలను కట్టడి శేయడాన్కి జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని కూడా పత్యేకంగా పెట్టిండ్లంట. ఫస్టుసారి మనిషిని కర్సిన కుక్కను 10 రోజులు గా జంతు జనన నియంత్రణ కేంద్రంలో ఉంచుతరట. ఇగ గా కుక్కలకు మనుసుల్లెక్కనే టీకా యేస్తరట. గంతేగాదుల్ల.. దాని పెయిల ఓ మైక్రో చిప్‌ను పెట్టి, ఇగ గా కుక్కను బయటికి వదుల్తరు. ఇగ గా కుక్క రొండో సారి గిన యెవల్నన్న కరిసిందనుకోండ్లి. ఇగ గా కుక్కను గదే కేంద్రంల జీవితాంతం ఉంచేటట్లు ఏర్పాట్లు చేసిండ్లంట.

గీడికే అయిపోలే. ఇగ గా కుక్క కాటు యేసిందా? లేదా? యాడేసింది? ఎంత లావు యేసిందనేదాన్ని గా సర్కారోల్ల పశుసంవర్ధక సాక అధికారులు, సుట్టుముట్టు ఉండే సంస్థల ప్రతినిధులు, ఎస్పీసీయే సభ్యుల కమిటీ ఒకటి దర్యాప్తు చేస్తదట. ఇగ గా దర్యాప్తుల కుక్క కర్సినట్లు పూర్తి ఆధారాలుంటేనే కుక్కకు గా జీవిత ఖైదు సిచ్చేస్తరట. లేకపోతే లేదట!

వోర్నీ…! గీ కుక్కల తక్కెడ సల్లగుండ… గింత పెద్దగున్నాది. గా సర్కారే గింత సేత్తాందంటే సేయదా మరి?. గా పొద్దు పెద్ద అదాలతోల్లు కుక్కలను కట్టడి సేయాల్సిందేనంటే, గా జంతు పేమికుల పేరుతోని గంతగనం గయ్! మని లేస్తిరి. గిదంతా సేయకపోతే ఎట్ల? అనుకున్నట్లున్నది గా సర్కరోల్లు. కుక్కలను ఒక్కతీర్గత కట్టడి సేయకపోతే, శాలనే కట్టాలున్నట్లున్నయి గద!

Latest News

ఏయేయి ఎప్పుడు కొనాల్నో తెలుసా!?|ADUGU TRENDS

మనకు అవసరం ఉన్నప్పుడే యే వస్తువునైనా కొంటం. ఎప్పుడు పడితే గప్పుడు గా వస్తువలను కొంటే ఎక్కువ ధర పడ్తయి. ఇగ తక్కువ ధరకే గవాట్ని కొనాల్నంటే గవాటి సీజన్లను బట్టి గాకుండ,...

ప్రయాణ ప్రగతి రథ చక్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం!|EDITORIAL

ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి...

24-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 11.34 వరకు ఉపరి నవమి నక్షత్రం పుష్యమి రాత్రి 12.18 వరకు ఉపరి ఆశ్లేష యోగం ధృతి ఉదయం 07.51 వరకు ఉపరి శూల కరణం భద్ర మధ్యాహ్నం...

ఖరీదైన కారుతోటే గా రోడ్డును బాగుశేసిండు!?|ADUGU TRENDS

మనసుంటే మార్గమున్నట్లే గద! మరి గా మార్గమే బాగా లేకపోతే? ఒకాయినె గా బాగా లేని రోడ్డును కోట్ల యిలువ శేసే ఖరీదైన కారుతోటి ఎట్ల బాగు శేసిండో సూడుండ్రి? బెంగళూరులో ఒకాయినె రోజూ...

ఒకటి ఒకటి ఒకటి! రెండు రెండు రెండు!!|EDITORIAL

దేశంలో ప్రతి ఏటా కోటిన్నర మంది విద్యార్థులు పది, ఇంటర్ వంటి కీలక పరీక్షలకు హాజరవుతున్నారు. వీళ్ళంతా ర్యాంకుల పోటీలో చిక్కుకుని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల...

23-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు సప్తమి రాత్రి 01.32 వరకు ఉపరి అష్టమి నక్షత్రం పునర్వసు రాత్రి 01.30 వరకు ఉపరి పుష్యమి యోగం సుకర్మ ఉదయం 10.41 వరకు ఉపరి ధృతి కరణం గరజి మధ్యాహ్నం...

గా కార్ బిల్డింగును సూద్దాం పాండ్రి!?|ADUGU TRENDS

ఒక్కొక్కలు ఒక్కో రకం. ఒక్కొక్కలిది ఒక్కో టేస్టు. ఎవ్వలిట్టం వాల్లది. గా హైదరాబాద్ పట్నంల ఫిష్ హౌజ్, రెడ్ బిల్డింగ్ వంటి ల్యాండ్ మార్క్ లను సూసినం. శేప ఆకారంలనే గా సర్కార్...

మండుటెండల గుణ‘పాఠాలు’! |EDITORIAL

ఈ ఏడాది వేసవి తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ, వాటి నివారణకు చర్యలు...

22-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 06.05 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 02.55 వరకు ఉపరి పునర్వసు యోగం అతిగండ మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి సుకర్మ కరణం బాలవ...

గోడలకు గట్టిగ నీల్లు గొట్టే శిట్కా!?|ADUGU TRENDS

పెండ్లి శేసి సూడు... ఇల్లు కట్టి సూడన్నరు. గివి రెండు శేసుడు అంత వీజీ కాదన్నట్లు. గందుకే పండ్లి అన్నా, ఇల్లన్నా కనా కట్టమన్నట్లు. గట్లనే ఇల్లు కట్టాల్నంటే గా ముగ్గు పోసి...

కవిత పార్టీతో బీఆర్‌ఎస్‌కు లాభమా? నష్టమా?|EDITORIAL

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వస్తున్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కేవలం కొత్త...

21-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం శ్రీ ఆదిశంకరాచార్య జయంతి తిధి శు చవితి ఉదయం 08.31 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి ఉదయం 06.14 వరకు ఉపరి మృగశిర యోగం శోభ సాయంత్రం 04.45 వరకు ఉపరి అతిగండ కరణం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News