అల్లు అర్జున్ నీ పుష్ప సినిమా కలెక్షన్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీలో వేయండి
శ్రీ తేజ్ కోలుకోవాలని మృత్యుంజయ యాగం చేయమని సూచన
మీడియాతో మాజీ ఎంపీ వి. హనుమంత రావు
మాజీ ఎంపీ వి. హనుమంత రావు అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌కు ప్రెస్ మీట్ పెట్టమని సలహా ఇచ్చిన వాళ్లకు తెలివి వుందా… అంటూ విరుచుకుపడ్డారు. అలాగే అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేసి, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించాలని హనుమంత రావు సూచించారు. పుష్ప సినిమా టికెట్ రేట్ల విషయానికి వస్తే హోమ్ మంత్రిగా రేవంత్ రెడ్డి పెంచారని అనుకుంటున్నాను అని వి. హనుమంత రావు అన్నారు. అల్లు అర్జున్ ఆలోచించి, పుష్ప సినిమాకు వచ్చిన డబ్బులను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి హుండీలో వేయాలని మరో సూచన చేశారు. ఇదే సందర్భంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు ఆపాలి అని హితవు పలికారు.
మణిపూర్‌లో 90 మంది చనిపోయిన విషయం ప్రస్తావిస్తూ, అక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. అయితే, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉన్నందుకు సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాను అన్నారు. మా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని హనుమంత రావు స్పష్టం చేశారు. నటుడు సంజయ్ దత్ విషయంలో సునీల్ దత్ తన కొడుకు తప్పును ఒప్పుకున్నట్టే, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఆలోచించాలని సూచించారు.

