జివ్వ కో రుసి, పుర్రె కో బుద్ధి అన్నరు. ఒక్కొక్క లు ఒక్కో తీరన్న మాట! మొన్నీ మద్దెల ఓ పొల్ల, కాల్లకు గిర్రలు కట్టుకొని, గుడికిపోయింది. గది గూడ బోనమెత్తింది.

ఇగో గీ అమ్మాయి పేరు తన్విక. 9 ఏండ్లు. ఊరు జోగులాంబ గద్వాల జిల్లా బుర్ధ పేట. గా ఊరు నుండి, అమ్మ వారి గుడి దాకా, కాల్లకు గిర్రలు కట్టుకొని ఉరుకుతరు సూడు, గదెనుల్లా.. స్కేటింగు.. గా స్కేటింగు సేసుకుంట, నెత్తిల బోనం ఎత్తుకొని గుడికి పోయింది. ఇగ గిదీన్ని నెట్టింట్ల మస్తుగ సూత్తాండ్లు.

