Wednesday, June 10, 2026
25.4 C
Hyderabad

ఎప్పటికైనా… తెలంగాణను కాపాడేది మేమే

భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ భరోసానిచ్చారు. కేసీఆర్ గారికి, పార్టీ కార్యకర్తలకు తాను వారధిగా ఉండి, వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను చేపడతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ చిన్న అవసరమైనా నేరుగా తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడం తాను వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం బీఆర్ఎస్ కార్యకర్తల ప్రథమ కర్తవ్యం అని, కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్‌పైనే ఉందని చెప్పారు.

ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా ఒక్క నిర్ణయం కూడా ప్రయోజనకరం కాలేదని విమర్శించారు. “ఆత్మీయ భరోసా” పేరుతో పేదలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్, డబ్బులు ఇవ్వకుండా ప్రజల నమ్మకాన్ని వంచించిందని అన్నారు. “మన కళ్లముందే తెలంగాణ ఆగిపోతుంటే చూస్తూ ఊరుకోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉంది” అంటూ ఆమె పిలుపునిచ్చారు. అప్పులపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, 2004లో అస్తిత్వమే లేని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ పదేళ్లపాటు తెలంగాణ ప్రజలను ఏడిపించి, చివరకు వందలాది మంది యువకులను కోల్పోయిన తర్వాతే తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. ఈ రోజు లక్షా 60 వేల కోట్ల అప్పు తెచ్చిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని, తెచ్చిన అప్పును ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. రూ. 40 వేల కోట్ల విలువైన భూములను కేవలం రూ. 10 వేల కోట్లకే తాకట్టు పెట్టిన ప్రభుత్వాన్ని నిలదీయాలని, రైతు భరోసా, రుణమాఫీ పేరుతో చేసిన ప్రకటనలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. 60 శాతం రైతులకు రుణమాఫీ రాకపోగా, 50 శాతం మందికి రైతు భరోసా అందలేదని అన్నారు. మరి ఈ రూ.10 వేల కోట్లు ఎక్కడికి పోయాయో ప్రభుత్వం చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు బయటకు తెలంగాణ వ్యక్తుల్లా కనిపించినా, వారి చర్యలు తెలంగాణ వ్యతిరేకంగానే ఉన్నాయని ఆరోపించారు. 16 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారని, కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి హామీలే ఇచ్చిందని విమర్శించారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టిన ఘనత పూర్తిగా కేసీఆర్‌దేనని, ఆయన ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా పని చేశారని కొనియాడారు.

సీతారామ ప్రాజెక్టును నిర్మించి 3.5 లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత కూడా కేసీఆర్‌కే చెందుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి శ్రీరామరక్ష లాంటి బీఆర్ఎస్ పార్టీ అవసరమని, ఈ ఉద్యమం ఖమ్మం జిల్లాలో పుట్టి రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిందని గుర్తు చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు కాంగ్రెస్ పార్టీలోకి మారిన డబ్బా నాయకుడిగా పేర్కొంటూ, ఉప ఎన్నిక వస్తే గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.

ద్రోహులు, కుట్రలు కనిపించాయి, ఎదురయ్యాయి కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ మోసం చేస్తుందని కేసీఆర్ పదే పదే చెప్పారని, మోసం చేయడం కాంగ్రెస్ స్వభావమని తేల్చిచెప్పారు.

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News