Tuesday, September 22, 2026
24.7 C
Hyderabad

అహ్మదాబాద్ సీడబ్ల్యూసీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

అహ్మదాబాద్‌లోని సబర్మతి నది ఒడ్డున జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ (CWC) విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి  మహానేతలు పుట్టినగడ్డపై జరుగుతున్న ఈ “చింతన్ బైఠక్” రెండు రోజుల పాటు ప్రజా సమస్యలపై గంభీర చర్చలకు వేదికగా నిలిచిందన్నారు. దేశంలో ప్రధాని మోదీ చేస్తున్న విభజన రాజకీయాలకు ప్రజల అండతో గట్టి బదులివ్వాలన్నదే ఈ సమావేశ లక్ష్యమని పేర్కొన్నారు.

గాంధీజీ ఆలోచనలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నాయకత్వం లో కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. దేశంలో గాడ్సే భావజాలాన్ని వ్యాప్తి చేసే మోదీ కూటమికి వ్యతిరేకంగా ప్రతి గాంధేయవాది పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ పాలనలో రైతులపై నల్లచట్టాలు, మణిపూర్‌లో మత విభేదాల మంటలు, యువతకు ఉద్యోగావకాశాల లోపం వంటి అనేక విషమ స్థితులను సీఎం రేవంత్ వివరించారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి గుర్తు చేస్తూ, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, రైతు సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, మహిళల రక్షణపై హామీలు ఇచ్చారని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది లోపలే నెరవేర్చిందని సీఎం చెప్పారు. ఇప్పటికే రూ. 21,000 కోట్ల రైతు రుణమాఫీ, కుల గణన చేపట్టడం, నిరుద్యోగులకు మద్దతు వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని వెల్లడించారు.

మోదీ వాగ్దానాలన్నీ వాయిదాలుగా మారాయని, 11 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాల ప్రస్తావన శూన్యమైందన్నారు. కేవలం మోదీ, అమిత్ షాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయంటూ విమర్శించారు. దేశంలోని గాంధేయవాదులు ఇప్పుడు మోదీ వ్యతిరేక పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని రేవంత్ పిలుపునిచ్చారు.

తెలంగాణకు స్వాతంత్రం వల్లభాయ్ పటేల్ ఇచ్చారని, రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ కారణమన్నారు. గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజల మధ్య భావోద్వేగ సంబంధం ఉందన్నారు. గుజరాత్ గడ్డ నుంచే బీజేపీని అడ్డుకుంటామని, మోదీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాలని కోరారు.

 

Latest News

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News