Wednesday, August 26, 2026
24.1 C
Hyderabad

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు)

లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు.
1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age).
2) చారిత్రక సంధియుగం (Proto-historic Age)
3) చారిత్రక యుగం (Historic Age)

1) చారిత్రక పూర్వయుగం :- లిపి లేని కాలము మరియు చరిత్ర అధ్యయనం చేయలేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటారు.

2) చారిత్రక సంధియుగం :- లిపి వుండి, లిపిని చదవలేని కాలం (పురావస్తు ఆధారాలు).

3) చారిత్రక యుగం :- లిపి వుండి, చరిత్రను సాహిత్యం ద్వారా అధ్యయనం చేయగలకాలం.

చారిత్రక పూర్వయుగం మానవ ఆవిర్భావంతో మొదలై లిపి వాడుకలోకి వచ్చేంత వరకు కొనసాగింది. భారతదేశములో మానవ ఆవిర్భావం ఖచ్చితంగా ఎప్పుడు జరిగిందో చెప్పడం కష్టతరం. 14 లక్షల సంవత్సరాల క్రితం తొలి మానవుడు మహారాష్ట్రలోని బోరి గుహల్లో జీవించాడని ఆధారాలు లభ్యమయ్యాయి.

చారిత్రక పూర్వయుగానికి 4 ప్రధాన సంస్కృతులు ఉన్నాయి. అవి
1) ప్రాచీన శిలాయుగ సంస్కృతి/ Paleolithic Culture (ఆది నుండి క్రీ.పూ. 10,000 వరకు)

2) మధ్య శిలాయుగ సంస్కృతి/ Mesolithic Culture (క్రీ.పూ. 10,000 నుండి 5000 వరకు)

3) నవీన శిలాయుగ సంస్కృతి/Neolithic Culture (క్రీ.పూ. 6000 నుండి 1500 వరకు)

4) తామ్ర శిలాయుగ సంస్కృతి/Chalcolithic Culture (క్రీ.పూ. 3000 నుండి 700 వరకు)

1) ప్రాచీన శిలాయుగ సంస్కృతి:

✓ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన తొలి ప్రదేశము రాబర్ట్ బ్రూస్ ఫూటే  1863 లో పల్లవరములో కనుగొన్నాడు. ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన మానవుడు స్ఫటిక శిల అనే రాయితో అనేక పనిముట్లు తయారుచేశాడు.

✓ ప్రాచీన శిలాయుగ మానవుడు హోమోసెపియన్ జాతి కంటే ముందున్న జాతికి చెందినవాడు. రామపుతికాస్ జాతికి చెందిన మానవ అవశేషాలు శివాలిక్ ప్రాంతంలో లభించాయి.

✓ ప్రాచీన శిలాయుగ అంతంలో (క్రీ.పూ. 10,000) ఆధునిక మానవుడైన ‘హోమోసెపియన్’ ఆవిర్భవించాడు. ఇది లాటిన్ పదం. దీనికి అర్థం వివేకవంతుడు లేదా పరిజ్ఞానం కలిగిన మానవుడు.

✓ ఈ కాలంలోని మానవుడు జంతువులను వేటాడుతూ మరియు పండ్లు, కాయలు, ఆకులు సేకరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకునేవాడు. ప్రాచీన శిలాయుగంలో ప్రజలు చిన్న చిన్న గుంపులుగా జీవిస్తూ సంచార జీవితాన్ని గడిపేవారు.

✓ ప్రాచీన శిలాయుగం ప్లిస్టాసిస్ లేదా మంచుయుగానికి చెందినది. క్రీ.పూ 10,000 కాలంలో మంచుయుగం అంతమై హోలీసిన్ యుగం ప్రారంభమైంది. దీని ద్వారా జీవనానికి కావాల్సిన పరిస్థితులు అనుకూలించాయి.

2) మధ్య శిలాయుగ సంస్కృతి:

మధ్య శిలాయుగంలో మానవుని జీవితంలో అనేక మార్పులు సంభవించాయి. ఆలోచనా పరిజ్ఞానం కలిగిన హోమోసెపియన్ మానవుడు ఆవిర్భవించడం మరియు జంతుజాల, వృక్షజాల అభివృద్ధికి అనుకూలమైన హోలీసిన్ యుగం ప్రారంభం కావడంతో అనేక మార్పులు ఈ కాలములోనే సంభవించాయి.

✓ ఈ కాలంలోనే కృత్రిమ గృహ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో కుండల తయారీ కూడా ప్రారంభమైంది. భారతదేశంలో తయారుచేసిన తొలి కుండలు ఉత్తరప్రదేశ్ లో బయటపడ్డాయి.

✓ పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ‘ క్వార్టజైట్’ శిలలతో వీరు పనిముట్లను తయారుచేసేవారు. మధ్య శిలాయుగంలో పనిముట్లు పరిమాణంలో చిన్నవిగా ఉండడంతో వీటిని సూక్ష్మ శిలలు అని పిలిచేవారు.

✓ పశు పోషణ ఈ కాలంలో ఇంకొక ప్రధానమైన పరిణామము. మధ్య శిలాయుగానికి చెందిన ‘బగోర్ ‘ లో పశుపోషణకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఇక్కడ ప్రజలు జంతువులను పోషించారు అని భావించవచ్చు. భారతదేశంలో ఇవే తొలి పశుపోషణకు సంబంధించిన ఆధారాలు.

3) నవీన శిలాయుగ సంస్కృతి:

ఈ యుగము భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వేరువేరు కాలాల్లో ప్రారంభమైంది. వాయువ్య భారతదేశంలో క్రీ.పూ. 7000, గంగా మైదాన ప్రాంతంలో  క్రీ.పూ. 5000, దక్షిణ భారతదేశంలో  క్రీ.పూ. 2000 లో నవీన శిలాయుగం ప్రారంభమైంది.

✓ ఇది భారతదేశంలో మధ్య శిలాయుగానికి మరియు తామ్ర శిలాయుగానికి మరియు సింధు నాగరికతలకు సమకాలీనంగా కొనసాగిందని భావించవచ్చు. ఈ కాలంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోవడంతో దీనిని నవీన శిలాయుగం అంటారు.

✓ మానవుడు ఈ కాలంలోనే వ్యవసాయాన్ని ప్రారంభించాడు. మానవుడు ఆహారాన్ని వేటాడే దశ నుండి ఉత్పత్తి చేసే దశకు ఈ కాలములోనే చేరుకున్నాడు.

✓ దీని వలన సంచార జీవితం అంతమై స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపాడు. గ్రామీణ వ్యవస్థలు ఈ కాలంలోనే ప్రారంభమయ్యాయి. నాగరికత ప్రారంభమవడానికి మార్గం సుగమమైంది. ఈ నవీన శిలాయుగం గురించి ‘సర్ జాన్ లుబ్బాక్ ‘ తను రాసిన “What Happened In History” అనే పుస్తకంలో పూర్తిగా ‘శిలాయుగ విప్లవం’ అని సంబోధించాడు.

నవీన శిలాయుగం నాటి కొన్ని ప్రధాన ప్రదేశాలు:

i) మెహర్ గర్: ఇది ప్రస్తుత పాకిస్తాన్ లో ఉంది. భారత ఉపఖండంలోనే వీరు తొలిసారిగా వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఇక్కడి ప్రజలు గోధుమలు, బార్లీ, పత్తిని పండించారు.
– ప్రపంచంలో పత్తిని పండించిన తొలి ప్రజలు వీరే అని భావించవచ్చు.
– తొలి కుమ్మరి చక్రం కూడా ఇక్కడే లభించింది. దీనితో పాటు చిరాండ్, దక్షిణ భారతదేశం, మహాగర, కొల్దీవ వంటి ప్రాంతాల్లో అవశేషాలు బయల్పడ్డాయి.

4) తామ్ర శిలాయుగ సంస్కృతి:

తామ్ర అనగా రాగి అని అర్థం. తామ్ర శిలాయుగం లోని మానవుడు శిలా పనిముట్లను మరియు రాగి పనిముట్లను వినియోగించడం ప్రారంభించాడు. మానవుడు మొదటిగా ఉపయోగించిన లోహం రాగి. అనేక లక్షల సంవత్సరాలు శిలాయుగంలో జీవించిన మానవుడు క్రమంగా లోహాలను వినియోగించడం నేర్చుకున్నాడు. శిలాయుగం నుండి లోహ యుగానికి మారడానికి మానవునికి లక్షల సంవత్సరాలు పట్టింది.

భారతదేశంలో లోహ యుగ సంస్కృతి బయల్పదిన ప్రాంతాలు:
i) మాల్వ సంస్కృతి: మధ్యప్రదేశ్ లోని మాల్వ ప్రాంతంలో లింగము, ఎద్దును పూజించడం మరియు యజ్ఞయాగాలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి.
ii) అహర్ సంస్కృతి: రాజస్థాన్ లో మొట్టమొదటిసారిగా అహర్ సంస్కృతికి సంబంధించిన అవశేషాలు బయల్పడ్డాయి. రాజస్థాన్ లోని ఖేత్రి ప్రాంతంలో ఆ కాలంనాటి ప్రజలు రాగి నిక్షేపాలను వినియోగించారు మరియు కాల్చిన ఇటుకలను కూడా ఉపయోగించారు. వీటితో పాటు
జోర్వే, హస్తినాపూర్, గంగా-యమున ప్రాంతాల్లో కూడా ఈ సంస్కృతికి సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి.

పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న చిత్రలేఖనాలలో మధ్యప్రదేశ్ లోని భీంభెట్కా గుహలలో ఉన్న చిత్రలేఖనాలు చారిత్రక పూర్వయుగానికి సంబంధించినవి. ఈ భీంభెట్కా గుహలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఇక్కడ ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం మరియు తామ్ర శిలాయుగానికి సంబంధించిన చిత్రాలు లభించాయి. ఇందులో ఏనుగులు, పులులు, చిరుతలు, వాటిని వేటాడే మానవుల దృశ్యాలు అధికంగా ఉన్నాయి.

ఆ కాలంలో రకరకాల రంగురాళ్లను ఉపయోగించి పొడిగా మార్చి రంగును తయారుచేసి ఈ చిత్రాల్లో వాడారు. కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా ఈ రంగులు చెక్కుచెదరకుండా ఉన్నాయి.

-బానోత్ కళ్యాణ్

Latest News

పనికి ఫార్చునర్ కారులో సఫాయి!?|ADUGU TRENDS

రోజులు మస్తుగ మారిపోతున్నయి. పేదా బక్క, బిక్కిబీదా తేడా లేకుండా పోతాంది. ఎవ్వలైనా హమ్ కిసీ సే కం నహీ అంటాండ్రు. గట్లనే గా సఫాయి కూడా అంటా0డు. గా సఫాయి రోజూ...

ఆర్థిక యుద్ధం అణుబాంబు కన్నా డేంజర్!?|EDITORIAL

యుద్ధానికి ఆయుధాలు అవసరం. ఆర్థిక యుద్ధానికి ప్రపంచ సహకారం అవసరం. అమెరికా ఆ సహకారాన్ని ఎంతవరకు సాధించగలదన్నదే అసలు పరీక్ష. ఇరాన్‌ను బలహీనపరచాలన్న అమెరికా ప్రయత్నం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచకుండా జాగ్రత్తపడాల్సిన...

ఆగస్టు 26, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి త్రయోదశి ఉదయం 06.53 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం శ్రవణ రాత్రి 01.03 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సౌభాగ్య ఉదయం 09.20 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 06.53 వరకు ఉపరి గరజి రాహుకాలం...

పార్టీ పెడితే పోలా!|ADUGU EXCLUSIVE|KONDA FAMILY|NEW PARTY

అడుగు ఎక్స్ క్లూజివ్ కొండా దంపతుల కొత్త పార్టీ? పాత పార్టీల్లో పొసగడం కష్టమే! కొత్త పార్టీతో ప్రయాణం స్పష్టమే! లక్ష్యం బీసీ సామాజిక న్యాయమే! ఇప్పటికే ప్రధాన పార్టీల్లో0చి బయటకు  కాంగ్రెస్ కాదంటే బీజేపీ ఛాన్స్? సిద్ధాంత రీత్యా కమలంలోనూ కష్టమే ఇప్పటికే...

పూర్వ ప్రేమికులకు.. అపూర్వ ప్రేమ రోజు!?|ADUGU TRENDS

యినడానికి గిది ఇబ్బందిగనే ఉన్నా, ఇది నిజమే మరి! కాకపోతే గిది మన దేసంల కాదు. పరాయి దేశంల. ఎవలైనా వయసొచ్చినంక పేమల పడ్తరు. అందరూ గా పేమల్ని గెలపించుకోలేరు. ఐటెంక వేరెవ్వల్నో...

వంటింట్లో మంట! తిరేదేలా తంటా?|EDITORIAL

ధరల పెరుగుదల కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. అది సామాజిక సమస్య కూడా. నెల ఆదాయం పెరగకుండానే నెలవారీ ఖర్చు పెరిగితే మధ్యతరగతి పొదుపులు కరిగిపోతాయి. పేద కుటుంబాలు పోషకాహారం, విద్య,...

ఆగస్టు 25, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు *శ్రావణమాసం* *శుక్లపక్షం* తిధి త్రయోదశి పూర్తిగా రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11.03 వరకు ఉపరి శ్రవణ యోగం ఆయుష్మాన్ ఉదయం 09.04 వరకు ఉపరి సౌభాగ్య కరణం కౌలవ సాయంత్రం 06.05 వరకు ఉపరి తైతుల రాహుకాలం పగలు 03.00...

ఆగస్టు 24, సోమవారం, 2026|RASHI PHALALU 

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి ద్వాదశి రాత్రి తెల్ల 05.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 08.43 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం ప్రీతి ఉదయం 08.32 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బవ సాయంత్రం 04.17...

మౌర్యుల చరిత్ర|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

(క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.180 వరకు) భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యంగా తొలుత మౌర్య సామ్రాజ్యము వెలిసింది. మౌర్యులు భారత ఉపఖండం(ప్రస్తుత భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్) మొత్తాన్ని ఇక చక్రాధిపత్యంగా...

నడుస్తున్న మనిషి|POETRY|PARVATHALU

నిలబడిన చోట పెళ్లున కొమ్మ విరిగి పడ్డట్లు మనుషులు కూలిపోతూ కుటుంబాలనొదిలి వెళ్ళిపోతున్నారు అనారోగ్యమిప్పుడు శత్రుదేశాల దాడిలా ప్రమాదకరమైంది వైరస్ ఎప్పుడు మాటుగాస్తుందో ఆరోరోగ్యం ఎప్పుడు మందగిస్తుందో నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్లే అయ్యో !ఇందాకనే ఫోన్ లో మాట్లాడిండని అంటూ...

మనిషి అంటే పర్వతాలే!|PARVATHALU|HUMANITY

పర్వతాలు... పేరుకు తగ్గట్లే, మేరు పర్వతం. అనేక పర్వతాల సరితూగే శక్తిగల మేరునగధీరుడు. ధీశాలి. కోరకున్నా వరాలిచ్చే అపర పరమేశ్వరుడు. ఆ భోళా శంకరుడి లాగే భోళా మనిషి. ప్రార్థించే పెదవులకన్నా, సాయం...

సీఎం సహాయ నిధికి 10 యేలిచ్చిన బిచ్చగాడు!?|ADUGU TRENDS

బిచ్చగాడే గదాని తీసి పారేయొద్దు. తక్కువ సూడొద్దు. ఒక్కొక్కటే వందలు, యేలైతయి. కానీ, గయి కూడబెట్టనీకే ఎంతో కట్ట పడాలె. బిచ్చమెత్తడం అంత అల్కనేం కాదు. అభిమానం సంపుకోవాలె. అవమానాలు భరించాలె. ఇచ్చినా,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News