Wednesday, September 9, 2026
31.8 C
Hyderabad

ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణే అసలైన సవాళ్ళు!?|EDITORIAL

ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమం–అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. రుణాలపై అధికంగా ఆధారపడటం, ఆదాయ అంచనాల్లో అనిశ్చితి, వ్యయ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి సవాళ్ళుగా మారవచ్చు. ఉచిత పథకాలతో పాటు ఆదాయం పెంపు, వృథా ఖర్చుల నియంత్రణ, సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళిక ఇవే రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా నడిపించగలవు. లేదంటే, సంఖ్యల్లో ఘనంగా కనిపించే బడ్జెట్‌లు వాస్తవంలో భారంగా మారే ప్రమాదం లేకపోలేదు!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.3,24,234 కోట్లు! అందులో సంక్షేమానికి రూ. 1,45,591 కోట్లు. ఈ కేటాయింపు లెక్కలు ఓ ప్రశ్నను సంధిస్తున్నాయి. సంక్షేమం పేరుతో పెరుగుతున్న ఈ ఖర్చులు రాష్ట్రాన్ని రుణభారం నుంచి విముక్తి చేస్తున్నాయా, లేక మరింత అప్పుల ఊబీలో పడేస్తున్నాయా? ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌ ను కూలంకశంగా పరిశీలిస్తే, అభివృద్ధి కంటే వ్యయం అధికంగా, ఆర్థిక క్రమశిక్షణ తక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నదన్న విమర్శలకు బలం చేకూరుస్తున్నది.

రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పాలనలో, రుణాల నియంత్రణపై స్పష్టమైన దృష్టి కనబడడం లేదన్నది ప్రధాన అభ్యంతరం. గత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి రూ.64,539 కోట్లు రుణాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, వాస్తవానికి రూ.67,539 కోట్లు సమీకరించింది. ఇది అంచనాలకన్నా ఎక్కువగా అప్పులు తీసుకున్నట్టు స్పష్టం చేస్తోంది. ఇక రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.73,383 కోట్లు బహిరంగ మార్కెట్ నుంచి, మిగతాతో కలిపి మొత్తం రూ.82,870 కోట్లు కొత్త రుణాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోవడం ఆర్థిక భారం మరింత పెరిగే సూచనగా కనిపిస్తోంది.

ఇక ఆదాయ అంచనాల విషయానికి వస్తే, ప్రభుత్వం అదనంగా రూ.43 వేల కోట్లు సమీకరించగలమని భావిస్తోంది. ఇందులో పన్నుల ద్వారా రూ.14 వేల కోట్లు, కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.13 వేల కోట్లు, పన్నేతర ఆదాయంగా రూ.6,412 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.3,710 కోట్లు, కొత్త రుణాల రూపంలో రూ.5,325 కోట్లు రావచ్చని అంచనా వేసింది. అయితే ఈ అంచనాలు ఎంతవరకు వాస్తవం అవుతాయన్నది సందేహాస్పదం. గత బడ్జెట్‌లో కేంద్ర గ్రాంట్లుగా రూ.22,782.50 కోట్లు వస్తాయని భావించినా, వాస్తవంగా రూ.11,161 కోట్లు మాత్రమే లభించాయి. ఈ అనుభవం దృష్ట్యా, తాజా అంచనాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి రాష్ట్ర ఆదాయంలో పెద్ద భాగం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పులపై వడ్డీలు, కిస్తీల చెల్లింపులకే వెచ్చించబడుతోంది. దీంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు ప్రధానంగా కొత్త రుణాలపై ఆధారపడుతున్నాయి. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా మారే అవకాశముంది.

ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. పేదల అభ్యున్నతికి సంక్షేమం అవసరమే అయినా, వృథా ఖర్చులను నియంత్రించాల్సిందిపోయి, వాటినే కొనసాగించడం ఆందోళనకరం. డబుల్ పెన్షన్లు, అధిక వేతనాలు, సబ్సిడీల రూపంలో భారీగా ఖర్చులు పెరుగుతున్నాయి. బోగస్ రేషన్ కార్డులను తొలగించడం వంటి చర్యలు తీసుకుంటే ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కానీ, ఆ సాహసం ఈ ప్రభుత్వమే కాదు, మరే ప్రభుత్వం చేయడానికి సాహసించడంలేదు. ఇది ఓట్ల రాజకీయం. దానికి ఏ పార్టీ, ఏ ప్రభుత్వమూ మినహాయింపు కాదు.

అభివృద్ధిలో పరిస్థితి ఆశాజనకంగా, ఆశించినంతగా లేదు. రోడ్ల దుస్థితి, ప్రభుత్వ వైద్యశాలలపై నిర్లక్ష్యం, హాస్టళ్లలో అసౌకర్యాలు, అధిక ధరలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు ప్రజల నిత్యజీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్న అంశాలు. ఉన్న పాఠశాలలను మెరుగుపరచకుండా, కొత్తగా ‘ఇంటగ్రేటెడ్ స్కూళ్ల’ కోసం రూ.5 వేల కోట్లు కేటాయించడం ప్రాధాన్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యా వసతులు అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు, మరో అధునాతన విద్యా ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయించడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక గ్రామీణాభివృద్ధి, స్వయం సమృద్ధి వంటి అంశాలు కూడా బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత పొందలేదన్న విమర్శ ఉంది. దేవాదాయ భూముల పరిరక్షణ, స్థానిక మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ చూపించాల్సిన అవసరం ఉంది.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొన్ని పథకాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్య సేవల విస్తరణ వంటి చర్యలు సానుకూలమే. అయితే ఈ పథకాల అమలులో స్పష్టత, పారదర్శకత అవసరం. ఎవరు లబ్ధిదారులు? అమలు విధానం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు అవసరం.

మొత్తానికి, ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమం–అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. రుణాలపై అధికంగా ఆధారపడటం, ఆదాయ అంచనాల్లో అనిశ్చితి, వ్యయ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి సవాళ్ళుగా మారవచ్చు. ఉచిత పథకాలతో పాటు ఆదాయం పెంపు, వృథా ఖర్చుల నియంత్రణ, సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళిక ఇవే రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా నడిపించగలవు. లేదంటే, సంఖ్యల్లో ఘనంగా కనిపించే బడ్జెట్‌లు వాస్తవంలో భారంగా మారే ప్రమాదం లేకపోలేదు.

Latest News

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News