Friday, October 9, 2026
25.6 C
Hyderabad

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం
ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం

రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల ఆనందోత్సాహాల్లో ప్రజలు మునిగి తేలనున్నారు. ఈ పండుగలు జరుపుకొనే దేశ, విదేశాల్లోని భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈనెల 11న మనం మహాత్మా పూలే ద్విశతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నాం. ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు అర్పించనున్నాం. మన హృదయాల్లో నవ స్ఫూర్తిని నింపే ఈ ప్రత్యేక సందర్భాలను ఆస్వాదించడంతో పాటు దేశం ఒక చారిత్రక ఘడియ ముంగిట నిలుచుంది. ఇది మన ప్రజాస్వామ్య పునాదుల్ని బలోపేతం చేసే అవకాశాన్ని ఇవ్వడంతోపాటు సమానత్వానికి, సశక్తీకరణకు మనందరం సమష్టిగా కట్టుబడి ఉన్నామని తెలిపే సందర్భాన్ని మన ముందు ఆవిష్కరించనుంది.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపేందుకు మన పార్లమెంటు ఈ నెల 16న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం దేశంలోని కోట్లాది మహిళల ఆకాంక్షలను ప్రతిఫలించనుంది. భారత జనాభాలో సగం మహిళలే. గడచిన కొన్నేళ్లలో మహిళా సాధికారికతకు అనువైన వాతావరణం సృష్టించేందుకు నిరంతర ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ సమాజంలో మహిళల కీలక స్థానానికి తగిన రీతిలో రాజకీయ ప్రపంచంలో, చట్ట సభల్లో వారి ప్రాతినిధ్యం లేకపోయింది. ఇది చాలా దురదృష్టకరం.

2029 లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలకు జంగా శాసనసభ ఎన్నికలన్నిటిలో మహిళా రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలుకావాలి. గడచిన అనేక దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మహిళలకు హక్కుగా దక్కాల్సిన స్థానాన్ని అందించేందుకు పలుమార్లు ప్రయత్నించాయి. కానీ అవేవీ ఫలవంతం కాలేదు. అయితే చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న విషయంపై అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. అదే ఏకాభిప్రాయంతో పార్లమెంటు 2023 సెప్టెంబరులో ‘నారీ శక్తి వందన్ అధినియమ్’కు ఆమోదం తెలిపింది. అది నా జీవితంలోని అతి ముఖ్య సందర్భాల్లో ఒకటి.

మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పం మన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ఈ ఘడియను మరికొంత కాలం వాయిదా వేసేందుకు వీలు లేదు. చట్టసభల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని దశాబ్దాలుగా అందరూ అంగీకరిస్తూనే ఉన్నారు. దానిపై చర్యల్ని మరింత వాయిదా వేయడం మనం సరిదిద్దగలిగిన ఒక అసమతౌల్యాన్ని మరికొంత కాలం కొనసాగించడమే అవుతుంది. మహిళల ఆకాంక్షల పూర్తికి నడుం కట్టడం అనివార్యం. మన ప్రజాస్వామ్యాన్ని అందరికీ ప్రాతినిధ్యం వహించేదిగా, అందరి ఆకాంక్షలకూ స్పందించేదిగా, ఉజ్వల భవితవ్యానికి బాటలు వేసేదిగా తీర్చిదిద్దే చారిత్రక అవకాశం నిజంగా ఇదే.

ఈ ఘడియలో మనందరం సమష్టిగా పనిచేయాలి. ఇది ఒక ప్రభుత్వానికో, పార్టీకో, వ్యక్తికో సంబంధించిన విషయం కాదు. జాతి యావత్తూ ఈ చర్య ప్రాధాన్యాన్ని గుర్తించి సమష్టిగా ఆశయ సాధన కోసం కదలాల్సిన అంశమిది. మన నారీ శక్తికి పట్టం కట్టి రుణం తీర్చుకోవాల్సిన తరుణమిది. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మనం తెలిపే ఆమోదం జాతీయ ప్రయోజనానికి పథనిర్దేశం చేస్తూ వీలైనంత విస్తృతంగా ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి.

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఉద్దేశించిన చారిత్రక సమావేశం దగ్గర పడుతున్న ఈ తరుణంలో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులందరికీ నా విన్నపం ఒకటే. భారత మహిళల కోసం తీసుకోనున్న ఈ చర్యకు అందరూ మద్దతు పలకండి. ఈ అవకాశాన్ని బాధ్యతగా, ఉద్దేశపూర్వకంగా అందిపుచ్చుకుందాం. అత్యున్నత ప్రజాస్వామ్య విలువల్ని ప్రతిబింబించేలా ప్రవర్తిద్దాం.

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

Latest News

బాబోయ్…! గిదేం థాలీ!?|ADUGU TRENDS

జివ్వకో రుసి, పుర్రెకో బుద్ధి అన్నరు. నాలుక రకరకాల రుసులను కావాలంటది. బుద్ధి కూడా గట్లనే రకరకాల ఆలోశనలు సేత్తది. గట్ల గా ఆలోశలన నుంచి కొత్త రుసులను అందించే, సరికొత్త ఆలోశనే...

నేడే నోబెల్ ప్రకటన…దక్కేదెవరికో!?|EDITORIAL

ప్రపంచ శాంతికి, అంతర్జాతీయ సహకారానికి, సంఘర్షణల పరిష్కారానికి విశేషంగా దోహదపడిన వ్యక్తి లేదా సంస్థను నోబెల్ గుర్తిస్తుంది. కమిటీ నిర్ణయం కేవలం ఒక వ్యక్తి ప్రచారం, రాజకీయ ప్రభావం లేదా నామినేషన్ల సంఖ్య...

అక్టోబర్ 09, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి చతుర్దశి రాత్రి 08.40 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తర రాత్రి 09.35 వరకు ఉపరి హస్త యోగం బ్రహ్మ రాత్రి 12.34 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 09.12 వరకు ఉపరి...

నానా పటేకర్ ఇక లేరు|NANA PATEKAR|FILM ACTOR

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని దవాఖానకి తరలించారు. అయితే...

మూగ జీవాలకో ఫుడ్ కోర్టు!?|ADUGU TRENDS

మూగ జీవాలను మనుసులతో సమానంగ సూత్తం. మంచి మంచి దేవుల్ల పేర్లు పెట్టి పిలుస్తం. గయి మనతో సమానంగ కలిసే జీవిత్తయి. కనీ, గీ మద్దెల గవాటిని పట్టించుకునుడే మానేసినం. గయ్యేమో ఆహారం...

నమో పాతికేళ్ళ అసాధారణ ప్రస్థానం!?|EDITORIAL

నమో పాతికేళ్ల అనుభవం నిజంగానే ఒక గొప్ప ఆస్తి. కానీ ప్రజాస్వామ్యంలో ఆ ఆస్తికి అసలైన యజమానులు ప్రజలే. కాబట్టి ఈ అనుభవానికి తుది కొలమానం అధికారంలో గడిపిన సంవత్సరాల సంఖ్య కాదు....

అక్టోబర్ 08, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి త్రయోదశి రాత్రి 09.40 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పుబ్బ రాత్రి 09.50 వరకు ఉపరి ఉత్తర యోగం శుక్ల రాత్రి 02.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 10.23 వరకు ఉపరి...

‘అన్న’మో రామచంద్రా!?|RICE|FARMER|RICE MILL|STATE|CENTRAL|GOVERNMENT

బియ్యమా? ధరలు పెరుగుతున్న దయ్యమా? ధాన్యం ఉత్పత్తిలో టాప్..ధరల నియంత్రణలో ఫ్లాప్ రైతుకు గిట్టుబాటు-సామాన్యుడికి అందుబాటేది? మిల్లర్ల మాయా? పరిపాలనా వైఫల్యమా? రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి! ధరల పెరుగుదలకు దరిద్రపు కారణాలెన్నో? అన్నపూర్ణ రాష్ట్రంలో ప్రజలు ‘అన్న’మో...

తాటిశెట్టుకు ఇనుప మెట్లు!?|ADUGU TRENDS

తాటి కల్లు మత్తుగున్నది.. నీ బాంచెన్ తాగుతుంటే ఎక్కుతున్నది. అనుకుంటనే గీ కల్లును మస్తుగ తాగుతుంటరు. తెలంగాణలనైతే ఊర్లల్ల ఆడోల్లు కూడా గీ కల్లు తాగుతరు. కనీ, గీ కల్లు గీసుడే మస్తు...

‘సర్’ సర్వేపై సర్వత్రా నిరసనలు.. భరోసా ఏది!|EDITORIAL

‘సర్’పై నెలకొన్న వివాదాన్ని విస్తృత ప్రజాస్వామ్య విశ్వాస సంక్షోభంలో భాగంగా చూడాలి. ఎన్నికల సంఘం నిష్పక్షపాతత్వంపై సందేహాలు రాకుండా ప్రతి అభ్యంతరానికీ పారదర్శకంగా సమాధానం చెప్పాలి. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా...

అక్టోబర్ 07, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.02 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ రాత్రి 10.32 వరకు ఉపరి పుబ్బ యోగం సాధ్య ఉదయం 07.05 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 11.55 వరకు ఉపరి...

గాడ దుర్గమ్మకు శేపల కూరే నైవేద్యం!?|ADUGU TRENDS

దేవీ శరన్నవరాత్రోత్సవాలు గదేనుల్లా.. దుర్గా నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. తొమ్మిది రోజులు జగన్మాత అయిన గా దుర్గాదేవిని రకరకాల రూపాలల్ల అర్చిస్తూ, పదో రోజున అంటే విజయదశమి దసరా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News