సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో, తొర్రూరులో గల ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 180 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 60,73, 000ల చెక్కులను పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి అని అన్నారు.

నాబార్డ్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మటన్ షాప్ ప్రారంభం
తొర్రూరు పట్టణంలోని టీచర్స్ కాలనిలో పుడమి, నరసింహులపేట రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛమైన మాంస విక్రయ కేంద్రం (మటన్ షాప్)ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో NABARD DDM శ్రీ యల్. చంద్రశేఖర్ గారు, రైతు సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, పట్టణ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రజలతో మమేకం
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాలు ముగించుకొని వెళ్తున్న ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి (జె) తొర్రూరు గ్రామం వద్ద కూరగాయలు అమ్ముతున్న మహిళలు తమను చూసి “అక్క” అని పిలవడంతో, వెంటనే వాహనాన్ని ఆపించి వారి దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు..ఎమ్మెల్యే గారు కూరగాయ వ్యాపారుల వద్ద నిల్చొని “అందరూ బాగున్నారా అక్క?” అంటూ వారితో మాట్లాడారు. మహిళలు ఎమ్మెల్యే గారిని అత్యంత సంతోషంగా ఆహ్వానించి, తమ జీవన స్థితిగతులు గురించి వివరించారు. వారి సమస్యలు, వ్యాపారంలో ఎదుర్కొంటున్న సవాళ్లు గురించి తెలుసుకున్నారు.

వివాహ వేడుకల్లో కాంగ్రెస్ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వివిధ గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాల పలు వివాహ మహోత్సవాల వేడుకలకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.


