Tuesday, September 15, 2026
25.7 C
Hyderabad

మౌర్యుల చరిత్ర|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

(క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.180 వరకు)

భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యంగా తొలుత మౌర్య సామ్రాజ్యము వెలిసింది. మౌర్యులు భారత ఉపఖండం(ప్రస్తుత భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్) మొత్తాన్ని ఇక చక్రాధిపత్యంగా పాలించారు. మౌర్య సామ్రాజ్యాన్ని మగధ సామ్రాజ్యం అని కూడా అంటారు. మౌర్య అనేది వంశం పేరు.

కల్హణుడు రాసిన రాజతరంగిణి ప్రకారం మౌర్యులలో ముఖ్యుడైన అశోకుడు శ్రీనగర్ అనే పట్టణాన్ని నిర్మించాడని తెలుస్తుంది. కర్నూల్ జిల్లాలోని ఎర్రగుడి ప్రాంతం మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో అశోకుని శాసనాలు లభ్యమయ్యాయి. దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు రాజ్యాలు మినహా భారత ఉపఖండం అంతా మౌర్యుల ఆధీనంలో ఉండేది. ఆ సమయంలో కేరళ, తమిళనాడును చోళ, పాండ్య, చేర అనే వంశాలు పాలిస్తున్నాయని అశోకుని శాసనాలు తెలియజేస్తున్నాయి.

మౌర్యుల చరిత్రకు ఆధారాలు
మౌర్యుల చరిత్రను తెలియజేయడానికి స్వదేశీ సాహిత్యం, విదేశీ సాహిత్యం, అశోకుని శాసనాల మీద ఆధారపడవలసివస్తుంది.

స్వదేశీ సాహిత్యం

నాలుగవ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం మౌర్యుల పరిపాలన గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. ఇతను చంద్రగుప్త మౌర్యుని కాలంలో ప్రధానమంత్రిగా పనిచేశాడని పండితుల అభిప్రాయం. కౌటిల్యుడి మరొక పేరు చాణక్యుడు. ఇతనిని “ఇండియన్ మాకియవెల్లి” అని పిలుస్తారు.

అయిదవ శతాబ్దంలో వికాసదత్తుడు రాసిన ముద్రారాక్షసంలో మౌర్య సామ్రాజ్యపు విస్తరణ గురించి, యుద్ధాల గురించి సమాచారం ఉంది.

ఏడవ శతాబ్దంలో భానుడు రాసిన హర్షచరిత ప్రకారం మౌర్య సామ్రాజ్యం యొక్క పతనం, అంతం గురించి తెలియజేస్తుంది.

విదేశీ సాహిత్యం

నిజానికి స్వదేశీ సాహిత్యం కంటే విదేశీయులు రాసిన సాహిత్యం ద్వారానే మౌర్యుల సమాచారం ఎక్కువగా లభిస్తుంది.
నాలుగవ శతాబ్దంలో మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో మౌర్యుల యొక్క సైనిక పాలన, ప్రజాపాలన గురించి వివరాలు లభిస్తున్నాయి. ఈ గ్రంథం గ్రీకు భాషలో రాయబడింది. ఈ కాలంలో భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు కానీ, సమాజంలో కులాలున్నాయని, చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగిందని స్పష్టంగా సమాచారం ఉంది.

ఒకటవ శతాబ్దంలో ప్లిని రాసిన నాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో మౌర్యుల యొక్క సైనిక బలం గురించి పూర్తి సమాచారం ఉంది. మౌర్యులకు ఆరు లక్షల సైనికులు, ముప్పైవేల అశ్వదళం, తొమ్మిదివేల గజబలం, ఎనిమిదివేల రథబలం ఉందని, వీటిని మౌర్యులు చతురంగ బలాలు అని పిలిచేవారు.

అశోకుని శాసనాలు
అశోకుడు మౌర్య చరిత్రలో, ప్రాచీన ప్రపంచ చరిత్రలో అశోకుడు గొప్ప చక్రవర్తి. ఇతను వేసిన శిలాశాసనాలు, స్తంభశాసనాలు, గుహాలయశాసనాల ద్వారా మౌర్య సామ్రాజ్య చరిత్ర అధ్యయనానికి అత్యంత కీలకం. భారతదేశంలో ప్రస్తుతం వరకు 180 శిలాశాసనాలు 47 ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. ఈ శాసనాలన్నింటిలో అశోకుడు బ్రహ్మి లిపినే ఉపయోగించాడు.

మౌర్యుల రాజకీయ చరిత్ర

చంద్రగుప్త మౌర్యుడు (క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.295 వరకు)
ఆనాటి చక్రవర్తుల్లో గొప్పవాడైన అలెగ్జాండర్ ప్రపంచాన్ని ఏకం చేసి పాలిస్తూ రాజ్యాలపై గవర్నర్ లను నియమించేవాడు. వాయువ్య భారతదేశంలో సెల్యుకస్ నికేటర్ తో చంద్రగుప్తమౌర్యుడికి ఘర్షణ ప్రారంభమైంది. తర్వాత కాలంలో వీరిద్దరి మధ్య దౌత్య సంబంధాలు, స్నేహ సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఈ సంబంధాలు వీరి వారసుల కాలంలో కూడా కొనసాగాయి. చంద్రగుప్తుని కుమారుడైన బిందుసారుడికి సామ్రాజ్యాన్ని అప్పగించి శ్రావణబెళగొళకు వెళ్ళి సల్లేఖన వ్రతం (నిద్రాహారాలు మానేయడం) ఆచరించి మరణించాడు.

బిందుసారుడు (క్రీ.పూ.295 నుండి క్రీ.పూ.272 వరకు)
పదహారవ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన బౌద్ధ గురువు తారనాథ్ రాసిన హిస్టరీ అఫ్ టిబెట్ అనే గ్రంథంలో బింబిసారుడు దక్షిణ భారతదేశాన్ని జయించాడని తెలుస్తుంది. ఇతను అజీవికమతాన్ని ఆదరించాడు. ఇతనికి అమిత్రఘాత అనే బిరుదు ఉంది. ఇతని ఆస్థానంలో డైమకస్, డయనోసియస్ అనే ఇద్దరు గ్రీకు రాయబారులుండేవారు. బౌద్ధ గ్రంథమైన దివ్యవదన ప్రకారం బిందుసారుడి కాలంలో జరిగిన తిరుగుబాటును అణచివేయడానికి ఉజ్జయినికి గవర్నర్ గా పనిచేస్తున్న తన కుమారుడు అశోకుడిని పంపించాడని ఈ గ్రంథం తెలియచేస్తుంది.

అశోకుడు (క్రీ.పూ.268 నుండి క్రీ.పూ.232 వరకు)
బిందుసారుడి మరణం తర్వాత సుమారు నాలుగు సంవత్సరాల పాటు వారసత్వ యుద్ధం కొనసాగింది. అశోకుడు తన సోదరులందరినీ అంతమొందించి రాజ్యానికి వచ్చాడని మహావంశ అనే గ్రంథం తెలియచేస్తుంది. అశోకుడి పాలనలో ఏకైక ప్రముఖ సంఘటన కళింగ యుద్ధం. ఈ యుద్ధం క్రీ.పూ. 261 నుండి 260 కాలంలో కళింగతో యుద్ధం చేసాడు. ఈ యుద్ధంలో లక్షమంది చనిపోయారు, లక్షాయాభైవేలమంది కళింగ రాజ్యానికి బానిసలుగా చిక్కారు. ఈ సంఘటనతో కలత చెందిన అశోకుడు యుద్ధాలను ఆపేసి ధర్మప్రచారాన్ని ప్రారంభించాడు.

 

-బానోత్ కళ్యాణ్

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News