Saturday, July 11, 2026
26.5 C
Hyderabad

రైలు డైబర్ మానవత్వం!?|ADUGU TRENDS

మనకు ముక్క లేనిదే బుక్క దిగది. శియ్య లేనిదే పెయ్యి నిమ్మలంగ ఉండది. కౌసు కోసం నౌస్తం. పండుగలు, పబ్బాలొత్తే ఏం శేత్తం? మంచిగ పెంచుకున్న మూగ జీవాల్ని ఏడికాడికి కోసుకుని తింటం. ఎవలేమన్న అంటే గది మన సంప్రదాయం, ఆచారమంటం. బొక్క బోషాణమని ఏదేదో శెప్తం. గిది సరే గని, గా మూగ జీవాల పట్ల గా రైలు డైబర్ సూపిన మానవత్వాన్ని సూడుండ్రి. ఎంత మంచిగున్నదో!

గా రైలు పీడ్ గ పోతాంది. ఇగ గా పట్టాల మీదనే గా బర్లు మంచిగ మేసుకుంట నిలుసున్నయి. గా రైలు డైబర్ గదేనుల్లా లోకో డైబర్ గట్టిన ఆరన్ కొట్టిండు. గయి కదుల్త లేవు. గిదంత పని కాదని, ఇగ గా డైబర్ రైలును ఆపిండు. తనే రైలు దిగి గా బర్లను గా పట్టాల మద్దెల నుంచి బయటకి పోయే దాకా గెదిమిండు. ఐటెంక గా రైలును పోనిచ్చిండు. గీ ముచ్చట ఎక్కడ జరిగిందో గనీ, నెట్టింట తెగ వైరల్ అయితాంది. గొర్లను తింటోల్లే కాదుల్లా… గా బర్లను తింటోల్లు కూడా లైకులు కొడతాండ్రు. గ వాళ్ళు కాకపోయిన, గసొంటోల్లు తినడానికి బర్లు బతికినయి కదా!?

Latest News

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

కానరాని వాన జాడ..!?|RAIN|FARMER

కరువు కోరల్లో రాష్ట్రాలు కోరలు చాచిన సూపర్ ఎల్‌నినో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు అడుగంటిన భూగర్భ జలాలు ఇక మంచినీళ్ళకూ తిప్పలే కరువు కోరలు చాస్తోందా? మంచినీటికి కూడా దిక్కులేని పరిస్థితి దాపురిస్తుందా? ఎల్ నినో...

సిల్లరే కదాని సిన్నగ సూడొద్దు!?|ADUGU TRENDS

ఒక్కొక్కటి కలిత్తేనే వందైతయి. వేయైయితి. లచ్చలైతయి. గందుకే ఒక్కటే కదాని సిల్లరగ సూడొద్దు. సిల్లరే కదాని తక్కువ సేయొద్దు. సిల్లరగాడని తిడ్తం. సిల్లరని తక్కువ శేత్తే మాత్రం మనం సిల్లరైపోతం. కోట్లైనా ఒక్కటితో...

కాళేశ్వరం కథ కంచికి చేరేనా!?|EDITORIAL

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రజా పెట్టుబడుల్లో ఒకటి. దాన్ని పూర్తిగా విస్మరించడం కూడా మరింత నష్టం. జరిగిన లోపాలను విస్మరించడం అంతకంటే పెద్ద తప్పు. అందువల్ల ఒకవైపు అవినీతి,...

జూలై 09, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి నవమి ఉదయం 05.47 వరకు ఉపరి దశమి నక్షత్రం అశ్విని ఉదయం 11.14 వరకు ఉపరి భరణి యోగం సుకర్మ ఉదయం 07.23 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 05.47 వరకు ఉపరి...

కొండా వర్సెస్ కాంగ్రెస్!?|KONDA SUREKHA|CONGRESS

సీఎం రేవంత్ పై కినుక|CM|REVANTHREDDY కడియంపై సీఎం కు లేఖ|KADIYAM SRIHARI అధిష్ఠానానికి ఫిర్యాదు?|AICC గతంలోనూ అవమానాలే క్రమశిక్షణా సంఘంతో విచారణకు డిమాండ్|DISIPLINERY COMMITTEE హైదరాబాద్, జూలై 7 (అడుగు న్యూస్): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారిగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News