ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడి చేసిన ఘటన పై ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గరమయ్యారు. ఈ ఘటన పై పోలీసులు అలసత్వం వహిస్తున్నారన్న సమాచారంపై పవన్ వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఈ అంశంపై స్పందించి, “దాడికి పాల్పడినవారిపై శిక్ష తప్పనిసరి” అని తెలిపారు. ప్రస్తుతం, పోలీసులు సుదర్శన్ రెడ్డి పై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. పలు ఆరోపణల ఆధారంగా అతనిపై విచారణ కొనసాగుతోంది.

