Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

మార్గం ఇంటికి మంద కృష్ణ|MANDA KRISHNA MADIGA

చిరకాల మితృత్వానికి ప్రతీక
కుటుంబంతో కలిసి పంచుకున్న ఙ్ఞాపకాలు
PADMA SHREE|పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకు సత్కారం
‘అడుగు’ |ADUGU అభివృద్ధి చెందాలని ఆశీర్వాదం

అవును అతడు దళిత దీన జనోద్ధారకుడు. ఆపన్నుల హస్తం, పేదల పెన్నిధి. దళితుల గుండె చప్పుడు. ఉద్యమాలకు ఊపిరి, అసాధ్యాలకు సుసాధ్యమైన సారథి. ఎమ్మార్పీఎస్ రథసారథి. ప్రధాని మనసు దోచి, వర్గీకరణ బిల్లుకు ఎస్ అనిపించిన కార్యసాధకుడు. పద్మశ్రీని వరింప చేసుకున్న వరదాత. అతడెవరో కాదు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ.

పాలకుర్తి, ఆగస్టు 12 (అడుగు న్యూస్):

మందకృష్ణ మంగళవారం ఒక కార్యక్రమంలో భాగంగా పాలకుర్తికి వచ్చారు. ఈ సందర్భంగా పాలకుర్తిలోనే ఉన్నాడని తెలిసి తన చిరకాల మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు, ప్రజా సంబంధాల నిపుణుడు, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. తేనీరు సేవించారు.

ఈ సందర్భంగా ఆనాటి తన ఉద్యమ ప్రస్థానంలోని కొన్ని ఘట్టాలను మార్గంతో పంచుకున్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడుగా మంద కృష్ణ, జర్నలిస్టు ఉద్యమకారుడిగా మార్గంలకు, వృత్తి రీత్యా ఎదురైనప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా వరంగల్ ఎస్సీ రిజర్వు కావడానికి అగ్రకులాలను ఎదురించిన సందర్భాలను మననం చేసుకున్నారు. ఉద్యమాలు, ఉద్యోగాల కారణంగా కొంత కాలంగా కలుసుకోలేకపోయిన వారు కలిసి గత జ్ఞాపకాలను కలబోసుకున్నారు. అనుబంధాన్ని పంచుకున్నారు.

మార్గం అడుగు డిజిటల్ మీడియా ఏర్పాటు చేశారని తెలుసుకొని అడుగు వార్తాపత్రికను, డిజిటల్ మీడియా వెబ్ సైట్ ని చూసి ప్రత్యేకంగా అభినందించారు. పాఠాలు రాసి, బోధన చేసి ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేసిన మార్గం ఆ అనుభవంతో డిజిటల్ మీడియాను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డిజిటల్ మీడియా దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అడుగు డిజిటల్ మీడియా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మార్గం కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడిపారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా మంద కృష్ణ ను మార్గం కుటుంబం శాలువాతో సత్కరించింది.

ఈ సందర్భంగా మార్గం కుటుంబ సభ్యులు మార్గం సతీమణి రమ, కుమారుడు సాయి సందీప్ తేజ, కూతురు సాత్విక, పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గూడూరు లెనిన్, చెరిపెల్లి అశోక్, ప్రముఖ వాస్తు, హస్త సాముద్రిక, జోతిష్య శాస్త్ర నిపుణులు మద్దికుంట్ల సోమయ్య, అందె రవి, గాదెపాక సెక్రటరీ యాకయ్య, కోతి సుధాకర్, ఎమ్మార్పీఎస్ నాయకులు, వికలాంగులు, అభిమానులు, తదితరులు ఉన్నారు.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News