ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు!

మనం పండ్లు కొంటే గ వాటికి ప్లాస్టిక్ డబ్బలొత్తానయి. మనమైతే గా డబ్బలను బయట పడేత్తం. కనీ, గీ అక్క ఏం శేసిందో సూడుండ్రి. గసొంటి ఓ డబ్బను తీసుకుంది. గదానికి మంచిగ రంద్రాలు శేసింది. గదాని యెన్క డబల్ ప్లాస్టర్ యేసింది. గదాన్ని గా వంటింట్ల గోడకు అతికింది. ఇగ గా రంద్రాలల్ల పండ్ల బ్రష్ లు పెట్టింది. సూసిండ్లా? గా అక్క తెలివి ఎట్లుందో!? మరి మీరూ శేసి సూడుండ్లి.

