గిదంతా రెడీమేడ్ల కాలం! రెడీమేడ్ బట్టలొచ్చె. వండకతినే కుక్కర్లు, మైక్రో ఓవెన్లు వచ్చె. ఆర్డరేస్తే ఫుడ్డొచ్చె. బెడ్డొచ్చె. బట్టలుతికే వాషింగ్ మిషిన్లొచ్చె. ఇగ ఎవలికే కట్టం లేకుండ పిల్లల్ని కనే పద్ధతులొచ్చె!? గట్లనే అన్నింట్ల ఇగ మిషిన్లే రాబట్టె.. ఇగ ఇల్లు కట్టి సూడు, పెండ్లి సేసి సూడు అన్నరు. ఇగ ఇల్లన్నంక బొచ్చెడు పనులుంటయి. గిదీంట్ల కూడ రెడీ మిక్స్ నుంచి మేడ్ మేడ్ మిషిన్లే పని శేత్తానయి. గట్లనే గొడలు కట్టే మిషిని కూడా వచ్చిందుల్లా!?

గా ట్రాక్టర్ ఉంటది కదా, గదానికి ఓ మిషిని అతికిచ్చిండ్రు. గా మిషిన్ల ఇటికెలు ఏస్తే సాలు… ఇగ గది గా గోడను పెట్టుకుంట పోతది. భలే గుంది గదా? గీ రెడీ మేడ్ మిషిన్ల సంగతి. ఇగ రాను రాను కొన్నేండ్లు పోయినంక.. ఇగ మనుసులతోటి పనే ఉండదంట. అన్నీ గా మిషిన్లే శేత్తయంట?

