Tuesday, September 15, 2026
25.7 C
Hyderabad

మద్యం, మత్తు అదుపుతోనే నేరాలు చిత్తు!

పేరుకే ఎక్సైజ్ మద్య నిషేధ శాఖ. కానీ మద్య నిషేధం పక్కన పెట్టి భారీగా మద్యం అమ్మకాలు సాగాలన్నదే ఆ శాఖ లక్ష్యం. ప్రభుత్వాల లక్ష్యం కూడా అదే. మద్యంతో సంభవించే అనర్థాలు కంటే కూడా, సంపాదించే అర్థం (డబ్బు) మీదే ప్రభుత్వాద ధ్యాసంతా. ప్రజలేమైనా ప్రభుత్వాలకు, వాటిని నడిపే పార్టీలకనవసరం. తమ పదవులు, పీఠాలు పదిలంగా ఉన్నాయా లేదా అన్నదే వాళ్ళ ప్రథమ కర్తవ్యంగా మారింది. మద్యం ప్రభుత్వాల ప్రధాన ఆదాయ వనరై పోవడంతో, మద్యం పర్యవసనాలు ఎవరికీ పట్టడం లేదు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో ఉచిత పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. మద్య నిషేధాన్ని అమలు చేయాలన్న ఆలోచనే చేయడం లేదు. జనమేమైపోయినా, ఆదాయం పెరగాలన్న ధోరణిలో ప్రభుత్వాలు ఉన్నాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. నిజానికి ఉచిత పథకాలు ఆపితే మద్యాన్ని అమ్మాల్సిన అవసరమేలేదు. విచ్చలవిడి మద్యం అమ్మకాలపై అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మద్యం ధరలు పెంచినా అమ్మకాలు ఆగడం లేదు. బ్యాడ్ అయినా, బ్రాండ్‌ ఏదైనా డబ్బులు తెచ్చి పెడుతోంది. మద్యంతోపాటు మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండడంతో జులాయిల అకృత్యాలకు అంతు లేకుండాపోతోంది. మత్తులో ఉన్న వారిలో దూకుడు స్వభావం, విపరీత ధోరణి ఉంటుంది. ఈ మత్తే నేరాలకు హేతువవుతోంది. విపరీత ప్రవర్తన, సమాజంపై ద్వేష భావం ఉండేవారికి మద్యం మత్తు తోడైతే అది తీవ్రమైన నేరాలకు కారణమవుతుంది. అందుకే మద్యం సహా, మత్తు పదార్థాలను అరికట్టే మార్గాలు ఆలోచించాలి. అకృత్యాల కట్టడికి ఏం చేయాలన్నది చర్చించాలి. మహిళలపై లైంగిక నేరాలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో మద్యం మత్తులో ఉన్నవారే ఎక్కువ. అయితే, ఎక్కడపడితే అక్కడ మద్యం లభించడం మరింత ఆందోళన కలిగించే అంశం. చెడు సావాసాలతో మత్తులో మునిగి నేరాలకు పాల్పడుతున్నారు. దీనికంతటకీ నిరుద్యోగాన్ని కూడా ఒక కారణంగా చూడాలి. ఇవన్నీ అరికట్టేందుకు ఏం చూయాలో ఆలోచించి ముందుకు కదిలితేనే నేరాలను అరికట్టగలం.

ఇటీవల గంజాయి కూడా విపరీతంగా పట్టుబడుతోంది. ఎంతగా స్వాధీనం చేసుకున్నా అంతకంతకూ రవాణా ఆగడం లేదు. అంటే మార్కెట్లో గంజాయికి అంత డిమాండ్‌ ఉందన్నమాట. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం అమ్మకాలతో పాటు నేరాలు, ఘోరాలు కూడా పెరుగుతున్నాయి. మద్యం మత్తులోనే నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు ఇలా అనేక రకాలైన నేరాలకు మద్యం కారణం అవుతోంది.

సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని అధికారంలోకి వచ్చినప్పుడు నాటి సీఎం జగన్‌ హావిూ ఇచ్చి డొల్ల కంపెనీల బ్రాండ్లతో వేలకోట్లు సంపాదించారు. మద్యం కుంభకోణంపై ఇప్పుడు సిట్‌ విచారణ జరుగుతోంది. మద్యం అమ్మకాలు లేకపోతే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి లేదు. దీంతో మద్యం అమ్మకాలను బాహాటంగానే ప్రోత్సహిస్తున్నారు. ఇష్టం వచ్చిన బ్రాండ్లతో అమ్మకాలు చేసి ఖజానా నింపుకుంటున్నారు. అంతెందుకు పార్టీల మీటింగులకు కార్యకర్తలు రావాలంటే సుక్క, ముక్క పెట్టాల్సిందే. ఒక్క ఏపీ మాత్రమే కాదు, తెలంగాణతో పాటు యూపీ వంటి అన్ని రాష్ట్రాల్లనూ ఇదే వరస. కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న కేరళలోనూ ఇదే తంతు. ఇటీవలి అత్యాచార ఘటనలను చూస్తే సామాన్యలకు కూడా భయమేస్తోంది. బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలను కూడా వదలడం లేదు. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించి కొంత ఊరటను కలిగిస్తున్నాయి.

ఇలాంటి ఘటనలన్నింటిలో అరెస్టవుతున్న నిందితుల్లో 60 శాతం మద్యం మత్తులో ఉన్నప్పుడే ఆ పైశాచిక చర్యకు పాల్పడుతున్నట్లు వెల్లడవుతోంది. మత్తులో ఉన్నవారికి విచక్షణ ఉండదు. నియంత్రణ ఉండదు. అలాంటి సందర్భాల్లో బాధితులు ఎవరైనా వారిని ఎదిరించినా, వారి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినా మరింత రెచ్చిపోతారు. హింసాత్మక చర్యలకు దిగుతారు. వీటిని మానసిక నిపుణులు కూడా ధ్రువీకరిస్తున్నారు. మద్యం మత్తులో ఉండే వ్యక్తికి అదే మైకంలో ఉన్న మరో ఇద్దరు, ముగ్గురు తోడైతే వారి అరాచకాలకు అడ్డూ అదుపు ఉండదు. తాను ఒక్కడినే కాదని.. తనతో పాటు మరి కొందరు ఉన్నారన్న భరోసాతో మరింతగా రెచ్చి పోతారు. తమవల్ల వారికి ఏమవుతుందో అన్న భయం కానీ, తరవాత తామేవుతామో అన్న ఆలోచనకానీ ఆ సమయంలో ఉండదు. అందువల్ల మద్యంపై నియంత్రణ విధించడం అవసరం అని పాలకులు గుర్తించాలి.

మద్యం, మాదక ద్రవ్యాల విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోక పోవడం వల్లే ఇదంతా. యువత ఈ పెడ దారి పట్టకుండా చూడాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. మద్య, మత్తు మందు సంబంధ ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలను బలోపేతం చేయాలి. వాటిని పకడ్బందీగా అమలు చేయాలి. మద్యం వల్ల వచ్చే ఆదాయం కంటే అనర్థాలను గుర్తించి మద్యం అమ్మకాలను నిలిపేయాలి. మద్య నిషేధాన్ని అమలు చేయాలి. ప్రభుత్వాలు వ్యాపార వాణిజ్య సంస్థలు కావు. వాటి అధినేతలు ఆ కంపెనీలకు సీఇఓలు కాదు. ప్రభుత్వాలు, ప్రజల కేర్ టేకర్స్. అవి ఎప్పుడూ ప్రజల శ్రేయోభిలాషిలానే ఉండాలి.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News