Friday, July 17, 2026
24.5 C
Hyderabad

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయాలి

-వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ పిలుపునిచ్చారు. హనుమకొండ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం వరంగల్ రీజినల్ మేనేజర్ డి విజయభాను అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ తో పాటు స్థానిక ప్రయాణ కండిషన్స్ కూడా గమనిస్తూ డ్రైవింగ్ చేయాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరంతో పోల్చితే ప్రమాదాల శాతం తగ్గిందని ఇందులో ముఖ్యంగా ఆర్టీసీ వారి పాత్ర గణనీయంగా ఉందన్నారు. సుమారు 40-50 మంది ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయన్న విషయాన్ని గమనిస్తూ డ్రైవింగ్ చేయాలన్నారు. ట్రాఫిక్ కూడళ్లలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ డి విజయ భాను మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ ఒత్తిడి లేకుండా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు నివారించి కార్పొరేషన్ మరింత సురక్షితమని తెలియజేయాలన్నారు. ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణమని,ఆ పేరును ఎల్లప్పుడూ కాపాడే బాధ్యత ప్రతి డ్రైవర్ పై ఉందన్నారు. తమ సర్వీస్ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సుదీర్ఘంగా డ్రైవింగ్ చేసిన రీజియన్ లోని ఉత్తమ డ్రైవర్లను అభినందించి, సన్మానించారు. వీరిని ప్రతి డ్రైవర్ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ మన్నన్ భట్, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఉదయభాను ,మాధవరావు, హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్, వరంగల్-1 డిపో మేనేజర్ వీ మోహన్ రావు, వరంగల్-2 డిపో మేనేజర్ వీ జ్యోత్స్న, పరకాల డిపో మేనేజర్ రవిచంద్ర, నర్సంపేట డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి, తొర్రూరు డిపో మేనేజర్ వి పద్మావతి, భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు, మహబూబాబాద్ డిపో మేనేజర్ శివ, జనగామ డిపో మేనేజర్ స్వాతి, పీఓ పి అర్పిత,వివిధ డిపోల అసిస్టెంట్ మేనేజర్స్, ట్రాఫిక్ సూపర్వైజర్స్, మెకానికల్ సూపర్వైజర్స్, సేఫ్టీ వార్డెన్స్,డీఐ లు, డ్రైవర్లు, మెకానిక్ లు,ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ ఉద్యోగులకు బహుమతులను అందజేశారు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News