జనగామ జిల్లా జూనియర్ సివిల్ కోర్ట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ గా పాలకుర్తి నియోజకవర్గం,పాలకుర్తి మండలం, వాల్మీకి గ్రామానికి చెందిన చెరుకు చంద్రశేఖర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ… తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు.

