Wednesday, October 14, 2026
25.2 C
Hyderabad

గుప్తుల పూర్వయుగం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

సుమారు 135 సంవత్సరాల మౌర్యుల పాలన తర్వాత భారత ఉపఖండంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడి మౌర్య సామ్రాజ్య పతనానికి కారణమైంది.

మౌర్యులు బ్రాహ్మణులు కారని పండితులు తిరుగుబాటు చేయడం, అవైదిక మతాలైన బౌద్ధ, జైన మతాలూ ఆవిర్భవించడం, ప్రజలు ఆ మతాలను బాగా ఆచరించడం వల్ల ప్రజల్లో మౌర్య సామ్రాజ్యం పట్ల వ్యతిరేకత మొదలైంది. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అశోక ధమ్మను ప్రారంభించి అహింసాయుత మార్గాన్ని ఎంచుకోవడం కొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు. క్రీ.పూ.200 నుండి క్రీ.శ.300 వరకు భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్య యుగం. మౌర్య అనంతర కాలంలో భారతదేశంలో అనేక స్వదేశీ మరియు విదేశీ రాజ్యాలు అవతరించాయి. వీరు రాజ్యాలను విభాగాలుగా పంచుకున్నారు.

స్వదేశీ రాజ్యాలు
1) కణ్వ రాజ్యం: మత్స్య, వాయు పురాణాల ప్రకారం వీరు కణ్వాయన గోత్రానికి చెందిన బ్రాహ్మణులు అని తెలుస్తుంది. పాటలీపుత్రము (ప్రస్తుత బీహార్ ప్రాంతం) వీరి రాజధాని. వాసుదేవ కణ్వ తొలి రాజు మరియు వంశ స్థాపకుడు. చివరి కణ్వ రాజైన సుశర్మను ఒక ఆంధ్ర రాజు అంతమొందించినట్టు పురాణాలు తెలియచేస్తున్నాయి.

2) శాతవాహన రాజ్యం: మొర్యుల పతనం తర్వాత దక్కన్ ప్రాంతం మొత్తాన్ని ఏకం చేసి ఏకచక్రాధిపత్యంగా వీరు పాలించారు. ప్రస్తుత మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లు వీరి రాజ్యంలో భాగం. వీరికి అనేక రాజధానులు ఉన్నట్లుగా సాహిత్యం మరియు శాసనాల ద్వారా తెలుస్తుంది.
రాజధానులు: కోటిలింగాల (ప్రస్తుత జగిత్యాల, తెలంగాణ); శ్రీకాకుళం (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్); ధాన్యకటకం (గుంటూరు జిల్లాలోని అమరావతి, ఆంధ్రప్రదేశ్); ప్రతిష్టానుపురం (మహారాష్ట్ర లోని ఔరంగాబాద్).
క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 వరకు సుమారు 450 సంవత్సరాలు దక్కన్ ప్రాంతాన్ని శాతవాహన వంశంలో 30 మంది రాజులు పాలించినట్లుగా మత్స్య పురాణం తెలియచేస్తుంది.
వీరి రాజ్య స్థాపకుడు సిముఖుడు. ఇతను కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పాలించినట్లు అక్కడ లభించిన నాణాలు, పురాణాలు తెలియచేస్తున్నాయి.

3) మహామేఘవర్ష వంశం: ప్రస్తుత ఒడిశా ప్రాంతంలోని ఉదయగిరి కొండల్లో ఒక జైన గుహాలయంలో ఖారవేళుడు రాసిన హతిగుంఫా శాసనం ఈ వంశం గురించి తెలియచేస్తుంది. ఈ శాసనం ప్రకారం తమ రాజధాని అయినా కళింగనగరి (ప్రస్తుత ఒడిశా ప్రాంతం) వరదల్లో ధ్వంసం అయితే ఖారవేళుడు దాన్ని పునర్నిర్మించాడని, పంట కాలువలకు మరమ్మత్తులు చేయించాడని ఈ శాసనము తెలియచేస్తుంది. ఇతను జైన మతాన్ని ఆచరించి రాణిగుంప, గణేశగుంప అనే జైన గుహాలయాలను నిర్మించి జైనులకు కానుకగా ఇచ్చాడు. దక్షిణ తమిళ రాజ్యాలైన చోళ, పాండ్య , చేరా లను ఓడించి సంపదను దోచుకున్నాడని ఇతని రెండవ శాసనం తెలియచేస్తుంది.

తమిళ రాజ్యాలు (చోళ, పాండ్య, చేరా)

దక్షిణ భారతదేశంలో తమిళ సాహిత్యం, భాషను ఆదరికిఞ్హి అభివృద్ధి చేసినందువల్ల ఈ మూడు రాజ్యాలను తమిళ రాజ్యాలు అంటారు.

1) చోళ: వీరు పాలించిన ప్రాంతం ఉత్తర తమిళనాడు. రాజధాని కావేరి పట్టణంగా ఉండేది. వీరి రాజా చిహ్నం పులి.
కరికాల చోళుడు ఈ వంశంలో గొప్పవాడు.

2) పాండ్య: వీరు దక్షిణ తమిళనాడును పాలించారు. మథురై వీరి రాజధానిగా కొనసాగింది. వీరి రాజచిహ్నం చేప. నెడుంజెళియన్ వీరిలో గొప్పవాడు.

3) చేర: వీరు కేరళ ప్రాంతాన్ని పరిపాలించారు. వంజి వీరి రాజధాని. సెంగుత్తవాన్ ఈ వంశంలో గొప్పవాడు. విల్లు వీరి రాజచిహ్నం.

శుంగరాజ్యం
మధ్య భారతదేశాన్ని మధ్యప్రదేశలోని విధీశాను రాజధానిగా చేసుకొని పరిపాలించారు .వీరు మొదట్లో మౌర్యుల దగ్గర ఉన్నతాధికారులుగా ఉంటూ తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు.

పుష్యమిత్ర శుంగుడు: ఇతను ఈ రాజ్య స్థాపకుడు. మౌర్య చక్రవర్తి అయిన బృహద్రద దగ్గర సేనాపతిగా పనిచేస్తూ అతనిని హత్య చేసి శుంగ వంశాన్ని స్థాపించాడు. ఇతను బౌద్ధ మాత వ్యతిరేకి అని అధికుడు నిర్మించిన 24000 స్థూపాలను ధ్వంసం చేసాడని బౌద్ధ గ్రంథమైన దివ్యవదన తెలియచేస్తుంది. కానీ పండితులు, చరిత్రకారులు ఈ వాదనతో ఏకీభవించట్లేదు.

విదేశీ రాజ్యాలు
భారతదేశంలో మౌర్యుల అనంతరం కొన్ని విదేశీ తెగలు దండెత్తి వచ్చి అనేక రాజ్యాలను స్థాపించారు. అందులో ఒకటి ఇండో-గ్రీకులు (యవనులు), స్కిథియన్లు (శకులు).

1) ఇండో-గ్రీకులు (యవనులు): ఉత్తర ఆఫ్ఘానిస్తాన్ కు చెందిన గ్రీకులు భారతదేశంలో ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి ఇక్కడే శాశ్వతంగా స్థిరపడి భారత సంస్కృతిలో కలిసిపోయారు. కాబట్టి వీరిని ఇండో-గ్రీకులు లేదా యవనులు అని పిలుస్తారు. వీరు గ్రీకుల్లో అయోనియన్ తెగకు చెందినవారు. క్రీ.పూ.165 నుండి సకల (పాకిస్థాన్) రాజధానిగా మినాండర్ (మిళిందుడు) అనే రాజు పరిపాలించాడు. వీరు ఈ సకల రాజ్యాన్ని భూతాల స్వర్గంగా పేర్కొన్నారు. మిళిందుడు బౌద్ధ మతాన్ని ఆచారించాడు. ఇతని ఆస్థానకవి అయిన నాగసేనుడు చెప్పిన విషయాలను గ్రంథస్థం చేయించి “నాగసేనభిక్షుసూత్ర” అనే పేరుతో ప్రచురించాడు. ఇది పాళీ భాషలో రాయబడింది. ఇది బౌద్ధులకు పవిత్ర గ్రంథంగా కొనసాగుతుంది.
భారతదేశంలో ఇండో-గ్రీకులు నాణెముల ముద్రణలో చాలా మార్పులు తీసుకువచ్చారు. రెండువైపులా ముద్రించిన నాణాలను ప్రవేశపెట్టడంతో అప్పటివరకు వినియోగించిన Punchmarked Coins అదృశ్యమయ్యాయి.

2) స్కిథియన్లు (శకులు): మధ్య ఆసియాలోని స్కిథియన్ గిరిజన తెగకు చెందిన వీరిని భారతదేశంలో శకులు అంటారు. వీరు 5 స్వతంత్ర రాజ్యాలను స్థాపించి భారతదేశాన్ని పాలించారు. అవి కపిస రాజ్యం(ఆఫ్ఘానిస్తాన్ లోని కపిస రాజధానిగా పాలించారు), తక్షశిల రాజ్యం (పాకిస్థాన్ లోని తక్షశిల రాజధానిగా మరొక శక రాజ్యం కొనసాగింది), మథుర రాజ్యం (ఉత్తర ప్రదేశ్ లోని మథుర వీరి రాజధాని), ఉజ్జయిని రాజ్యం (మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని రాజధానిగా మాల్వా మరియు గుజరాత్ లని ఏకం చేసి రుద్రదమనుడు అనే రాజు పరిపాలించాడు. ఇతను వేసిన జునాఘడ్ శాసనం భారతదేశంలో తొలి సంస్కృత శాసనంగా చెప్పవచ్చు), దక్కన్ శక రాజ్యం (వీరు మధ్యప్రదేశ్ లోని మాండసోర్ రాజధానిగా సహపాణుడు అనే రాజు పరిపాలించాడు.

-బానోత్ కళ్యాణ్

Latest News

గియేం పోస్టాపీసుల్రా నాయినా!?|ADUGU TRENDS

మనం సూసిన పోస్టాపీసులకు గీ పోస్టాపీసులకు పోలికలే లేవు. ఒకటేమో నీల్ల మీద. ఇంకోటేమో నీల్ల లోపల, మరోటేమో ఎత్తనై భూమ్మీద, ఇంకా గుహల్ల, రైలు పట్టాల మద్దెల... గిట్ల గీ పోస్టాపీసులన్నయి....

ప్రపంచానికి పెను ముప్పు!?|EDITORIAL

క్షిపణుల మోతతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది! విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులు.. చమురు కేంద్రాలపై ప్రతీకార దాడులు.. కీలక సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు! అగ్రరాజ్యాల జోక్యంతో యుద్ధం మరింత విస్తరిస్తుందా? చమురు ధరల నుంచి...

అక్టోబర్ 15, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకరణ తిధి పంచమి రాత్రి 01.00 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 05.41 వరకు ఉప6 మూల యోగం సౌభాగ్య రాత్రి 09.28...

బంగారం సొరంగంలకి!?|ADUGU TRENDS

ఆశకు అంతుండాలంటరు. అత్యాశకు పోతే ఒక్కోపాలి పానమే పోతది. గట్లనే అయింది గీ ఇద్దరి దోస్తుల పని. యూ ట్యూబ్ సూసి, బంగారం కోసం ఓ సొరంగంలకి పోయి పానం మీదికి తెచ్చుకున్నర...

మానవాళి మనుగడకు ముప్పు!?|EDITORIAL

సాంకేతికత సృష్టిస్తున్న అద్భుతాల మాటునే వినాశనపు ఛాయలు కమ్ముకుంటున్నాయి! ఒకవైపు ఏఐ దుర్వినియోగం.. మరోవైపు అణుయుద్ధ భయాలు.. వెరసి మానవాళి మనుగడకే పెను సవాలు! వీటికి తోడు వాతావరణ మార్పులు, ఆహార సంక్షోభం...

అక్టోబర్ 14, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ తిధి చవితి రాత్రి 11.10 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనురాధ రాత్రి తెల్ల 03.18 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 09.08 వరకు ఉప6 సౌభాగ్య కరణం...

జాగిలాల కాలమిది!?|ADUGU TRENDS

అవుమల్ల.. కుక్కలకు కాలం చెల్లాలని ఒకకెల్లి ఆందోళనలు చెలరేగుతున్నయి. మరోకెల్లి గా ముధోళ్ ల గా జాగిలాల కాలమే నడుత్తాంది. గిదేందనుకుంటున్నరా? నిజమేనుల్లా... కుక్కలతోటి మనుసులది యిడదీయరాని అనుబంధం. మనిసితోటే కుక్కలు కూడా ఎదిగినయి....

ఎస్ఐఆర్ వెనుక రాజకీయ మర్మమేమిటి?|EDITORIAL

ఓటరు జాబితాల ప్రక్షాళన.. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు! ఎస్‌ఐఆర్‌ చుట్టూ ముదురుతున్న వివాదం.. వీధుల్లోకి విపక్షాలు.. ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనలు! ఓటు హక్కు రక్షణ పేరుతో రాజకీయ సమరం ఉధృతమవుతుంటే, నిరుద్యోగం,...

అక్టోబర్ 13, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ అన్నపూర్ణా దేవి రూపం తిధి తదియ రాత్రి 09.43 వరకు ఉపరి చవితి నక్షత్రం విశాఖ రాత్రి 01.14 వరకు ఉపరి అనురాధ యోగం ప్రీతి రాత్రి 09.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం...

అక్టోబర్ 12, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ గాయత్రి దేవి తిధి విదియ రాత్రి 08.41 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 11.40 వరకు ఉపరి విశాఖ యోగం విస్కంబ రాత్రి 09.21 వరకు ఉపరి ప్రీతి కరణం బాలవ...

బతుకమ్మ పాట విడుదల|BATHUKAMMA|SONG|KALVAKUNTLA KAVITHA

హైదరాబాద్, నందీనగర్‌లో తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘సిరిసిరి మువ్వల సిరుల బతుకమ్మ’ పాట సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు...

గుప్తానంతర యుగం (క్రీ.శ.550-750)|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

క్రీ.శ. ఆరవ శతాబ్దం మధ్యభాగంలో గుప్త సామ్రాజ్యం అంతమై మరోసారి భారత చరిత్రలో రాజకీయ అనైక్యత చోటుచేసుకుంది. దీనిని ఆసరాగా చేసుకొని కొన్ని స్వతంత్ర రాజ్యాలు భారతదేశంలో వెలిశాయి. అవి పుష్యభూతి రాజ్యం,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News