Sunday, November 1, 2026
28.8 C
Hyderabad

పట్టా శాశ్వతం.. ఓటు మాత్రం తాత్కాలికమా!?|ESSAY|GRADUATES

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. అర్హులైన ప్రతి పౌరుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటును వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థ ఉండాలి. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు విధానం మాత్రం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒకసారి డిగ్రీ పూర్తి చేసి, గతంలో పట్టభద్రుల ఓటరుగా నమోదైన వ్యక్తి ప్రతి కొత్త ఓటర్ల జాబితా తయారీ సమయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇప్పటికే ధ్రువీకరించిన విద్యార్హతను పదేపదే నిరూపించుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ విధానం అర్హులైన పట్టభద్రులకు అదనపు భారంగా మారడం లేదా?

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి ఓటరుగా నమోదైన వ్యక్తి పేరు సాధారణంగా ఓటర్ల జాబితాలో కొనసాగుతుంది. చిరునామా మారినప్పుడు లేదా ఇతర వివరాల్లో మార్పులున్నప్పుడు సవరణలకు అవకాశం ఉంటుంది. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం ప్రత్యేక ఓటర్ల జాబితాలను నిర్ణీత వ్యవధిలో కొత్తగా రూపొందిస్తారు. దీంతో గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు సైతం తిరిగి నమోదు చేసుకోవాల్సి వస్తోంది. సాధారణ ఓటర్లకు ఒక విధానం, పట్టభద్రులకు మరో విధానం ఎందుకు? ఈ వ్యత్యాసానికి కారణాలను ఎన్నికల సంఘం ప్రజలకు మరింత స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉంది.

ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 27, ఓటర్ల నమోదు నిబంధనలు–1960 ప్రకారం పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రత్యేక ఓటర్ల జాబితాలు రూపొందుతాయి. ఆరేళ్లకొకసారి కొత్తగా జాబితాలను తయారుచేసే విధానం చట్టబద్ధంగా అమలవుతోంది. అయితే చట్టం నిర్దేశించిన విధానాన్ని కాలానుగుణంగా మెరుగుపరిచే అవకాశాలను కూడా పరిశీలించాలి. గతంలో ధ్రువీకరించిన విద్యార్హత వివరాలను భద్రపరిచి, తిరిగి వినియోగించుకునే డిజిటల్ వ్యవస్థను ఎందుకు అభివృద్ధి చేయకూడదు? పట్టభద్రుడైన కాలం, సంబంధిత నియోజకవర్గంలో సాధారణ నివాసం వంటి అర్హతలను పరిశీలిస్తూనే నమోదు ప్రక్రియను సరళీకరించవచ్చు కదా!

గ్రామీణ ప్రాంతాల్లోని పట్టభద్రులు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, నమోదు గడువులపై అవగాహన లేనివారు ఈ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అర్హత ఉన్నప్పటికీ గడువులోగా దరఖాస్తు చేసుకోలేక ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తోంది. అందుకే గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం, సులభమైన ఆన్‌లైన్ నమోదు, దరఖాస్తుల స్థితిని తెలుసుకునే సదుపాయాలు కల్పించాలి.

ఒకసారి ధ్రువీకరించిన విద్యార్హతను మళ్లీ సమర్పించాల్సిన అవసరాన్ని తగ్గించలేమా? గతంలో నమోదైన పట్టభద్రుల వివరాలను ఆధారంగా చేసుకుని అర్హతలను నవీకరించే విధానం ప్రవేశపెట్టలేమా? ఈ ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. అవసరమైతే చట్టపరమైన మార్పులపైనా చర్చ జరగాలి.

ప్రజాస్వామ్యానికి బలం ఓటరు. ఆ ఓటరుకు సౌలభ్యం కల్పించడం వ్యవస్థ బాధ్యత. డిగ్రీ ఒక్కసారే సాధిస్తారు. కానీ ఓటు కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు ఎందుకు? అర్హతను నిర్ధారించాలి.. ఓటు హక్కును సంక్లిష్టం చేయకూడదు. పట్టభద్రుల అర్హతకు తగిన గుర్తింపు, నమోదు ప్రక్రియకు సరళమైన విధానం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యంపై విశ్వాసం మరింత బలోపేతమవుతుంది.


నల్ల విక్రమ్ కుమార్
8886744481

Latest News

కరెంట్ అఫైర్స్|CURRENT AFFAIRS|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|EDUCATION

1) లడఖ్‌లోని పుగా వ్యాలీలో భారతదేశపు మొట్టమొదటి జియోథర్మల్ బావులు తూర్పు లడఖ్‌లోని పుగా వ్యాలీలో 1,000 మీటర్ల లోతు కలిగిన భారతదేశపు మొట్టమొదటి మరియు అత్యంత లోతైన జంట జియోథర్మల్ (భూగర్భ ఉష్ణ)...

గీ బూరు మిఠాయి గింత పని శేసిందా!?|ADUGU TRENDS

యెనకటికి ఓ సైకోలు మీదనో, మూడు గిర్రల బండి మీదనో.. ఓ గంట మోగేది. గది మెల్లెగా మన వాడల్లోకి వచ్చేది. ఇగ గది సూద్దుం గదా? గావాటి మీద ఎర్రగనో, గులాబీలోనో...

పేదరికంపై భారత్ విజయం|EDITORIAL

ఒకప్పుడు పేదరికం భారత్‌ను వెంటాడింది.. ఇప్పుడు అదే పేదరికంపై దేశం గణనీయమైన విజయం సాధిస్తోంది! 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి ఊరట. ఇది అభివృద్ధికి సంకేతమేనా? అసమానతల అంతానికి ఇంకా ఎంత...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 01 నుండి నవంబర్ 07 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు తగిన...

ఉపవాసం లేదని యిడుపు కాయితం!?|ADUGU TRENDS

ఆలుమొగల బంధం పాలునీల్ల లెక్క కలిసిపోయేది. ఎంతో యిలువైంది. వందేండ్ల పానాలకు నూరేండ్ల అనుబంధం. కానీ గా పెనిమిటి, పెండ్లాంల జీవితాలు కుక్కలు శింపి, ఇసిరేసిన ఇస్తరిలెక్కైతానయి. శీటికి మాటికి శిల్లర పంచాయితీలు,...

ప్రతి నీటి చుక్కా విలువైనదే!|EDITORIAL

ఎల్‌నినో హెచ్చరికలు.. అడుగంటుతున్న జలాశయాలు.. పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌! భాగ్యనగరానికి జలగండం ముంచుకొస్తోందా? రేపటి దాహాన్ని తీర్చేందుకు నేడే మేల్కోవాలి. ప్రభుత్వ ముందుచూపుతో పాటు ప్రజల నీటి పొదుపే మహానగరానికి శ్రీరామరక్ష! మార్గం -...

అక్టోబర్ 31, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 09.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర పగలు 12.05 వరకు ఉపరి పునర్వసు యోగం సిద్ద రాత్రి 10.57 వరకు ఉపరి సాధ్య కరణం గరజి ఉదయం 10.24 వరకు ఉపరి...

గీ కుక్క-కోతిని సూసి నేర్సుకోవాలె!?|ADUGU TRENDS

కుక్క-కోతిలది పుట్టుకతోనే వైరం. వాటి స్వభావికం కూడా. కోతులను తరిమికొట్టడానికి కుక్కలను సాదుతరు. గాడాడ గా కుక్కలు, కోతులు కలిసి మెలిసి కూడా ఉంటయి. గట్లనే గా ఒడిశా రాష్ట్రం కలహండి జిల్ల కేంద్రం...

గ్రహణం వీడేనా? గూడూరు కు హాస్టల్ తిరిగి వచ్చేనా?|PALAKURTHI|EDUCATION

-అడుగు కథనంతో కదిలిన అధికార యంత్రాంగం -ప్రజా ప్రతినిధుల్లోనూ కదలిక దాతలు కీ.శే బొబ్బల రంగారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు బొబ్బల రమణారెడ్డి, బొబ్బల అశోక్ రెడ్డి లు స్వచ్ఛందంగా, ఉచితంగా పేద విద్యార్థుల భవిష్యత్తు...

అన్నం అందనంత ఎత్తులో…|EDITORIAL

అన్నం పెట్టే బియ్యమే ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది! బస్తా ధర రూ.2 వేలు దాటుతుంటే, పప్పులు, పంచదార ధరలూ మండిపోతున్నాయి. వర్షాభావం ప్రభావమా? వ్యాపారుల ధరల మాయాజాలమా? మార్కెట్‌పై నిఘా ఏదీ? మార్గం...

అక్టోబర్ 30, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి పంచమి రాత్రి 11.37 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం మృగశిర పగలు 01.45 వరకు ఉపరి ఆరుద్ర యోగం శివ రాత్రి 02.04 వరకు ఉపరి సిద్ద కరణం కౌలవ పగలు 12.47 వరకు ఉపరి...

తుఫాన్లే.. గి పొల్లగాండ్ల పేర్లు!?|ADUGU TRENDS

తుఫాన్లు, వరదలు, భూకంపాలు పకృతి వైపరీత్యాలప్పుడు పుట్టిన పిల్లలకు, గా కట్టాలను తట్టుకుని బతికి బట్టకట్టినందుకు గురుతుగనో లేకపోతే, గా ఘటనల జ్ఞాపకార్థమో గనీ, గా తల్లిదండ్రులు గా తుఫాన్ల పేర్లను పెట్టడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News