హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేయిస్తూ, “పెట్టుబడుల చూసి కడుపు మంటా? వాడండి ENO!” అంటూ సీరియస్ విమర్శలు చేస్తున్న హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. దావోస్ పర్యటనలో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి రికార్డు సాధించిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి దిశలో దూసుకెళ్లుతుందని పేర్కొన్నారు. అలాగే, ఈనో ప్యాకెట్ల జోక్ వేయడం ద్వారా, కేసీఆర్, కేటీఆర్ వంటి నేతల పట్ల పరోక్షంగా విమర్శలు చేశారు. “Digest The Growth” అనే శీర్షికతో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.

