రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి.

యెద్దు, యెవుసం ఎంత కట్టమో అందరికీ ఎర్కె. వడ్లు పండినంక.. గవాటిని ఆరబోసుడు, తర్పాల పట్టుడు, తాలు తట్ర తీసుడు, తోలు తీసినంత పనైతది. గిదీనికి ఓ అన్న తెలివైన ఉపాయం శేసిండు. రోడ్ వేటర్ లేక్కనే ఇనుప ప్లేట్లు పెట్టి, ఓ మిషిని శేపిచ్చిండు. ఇగ గదాన్ని గా ట్రాక్టర్ కు బిగిచ్చి, వడ్లల్ల తిప్పిండు. గా మిషిని నడుత్తాంటే, గా వడ్లు గాలికి లేసి దుమ్ము ధూలి కొట్టుకపోతాంది. గట్లనే గయి ఆరిపోయి గండ్ల తేమ తగ్గుతాంది. ఇగ రైతుల పని తగ్గుతాంది గనీ, గా కర్సులే పెర్గుతానయి.

