గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ జామ్‌నగర్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళతానని అన్నారు. రిలయన్స్ వారసత్వాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నానని, తన తాత ధీరూభాయ్ అంబానీ స్థాపించిన పునాదులను తన తల్లిదండ్రులు ముకేశ్, నీతా అంబానీ విజయానికి చేర్చారని చెప్పారు. తల్లి ప్రేరణతో వన్య ప్రాణుల సంరక్షణకు “వంతారా” ప్రాజెక్టు ప్రారంభించామని, మనుషుల్లానే వన్య ప్రాణుల సంక్షేమానికి రిలయన్స్ కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబానీ కుటుంబం, ఉద్యోగులు పాల్గొన్నారు.

