హైదరాబాద్, జూలై 2(అడుగు న్యూస్):
MINISTER| మంత్రి KONDA SUREKHA| కొండా సురేఖ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు AFFIDAVIT| అఫిడవిట్‌ను సమర్పించారని ఆరోపిస్తూ, ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత, అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి ERRABELLI PRADEEP RAO| ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ప్రదీప్ రావు, కొండా సురేఖ తన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు సరైనవిగా ఇవ్వలేదని పేర్కొన్నారు.
సురేఖ భర్త KONDA MURALI| కొండా మురళి ఇటీవల మీడియా ముందుకు వచ్చి ఎన్నికల ప్రచారానికి రూ.70 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ మొత్తం ఖర్చు సురేఖ అఫిడవిట్‌లో ప్రస్తావించకపోవడం RP చట్టంలోని సెక్షన్ 10-A, 77, 78 ప్రకారం ఉల్లంఘనగా పేర్కొన్నారు. అలాగే ఆమె అఫిడవిట్‌లో 2 ఎకరాల స్థిరాస్తిని మాత్రమే చూపించగా, మురళి 500 ఎకరాల భూమిని వారసత్వంగా పొందినట్లు స్వయంగా తెలిపారని పేర్కొన్నారు.
ఇవి తప్పుడు అఫిడవిట్ కింద RP చట్టంలోని 125-A సెక్షన్‌తో పాటు IPC సెక్షన్ 191, 193 ప్రకారం శిక్షార్హంగా పరిగణించాలన్నారు. పూర్తి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రదీప్ రావు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత నన్నపునేని నరేందర్ కూడా గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

